India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పెద్దకడబూరు మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో పదో తరగతి పరీక్షలకు హాజరైన సింధు అనే విద్యార్థిని అస్వస్థతకు గురైన ఘటన మంగళవారం జరిగింది. పరీక్ష హాల్లో అస్వస్థతకు గురై ఒక్కసారిగా కుప్పకూలడంతో అధికారులు, ఎస్‌ఐ మహేశ్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక పీహెచ్సీకి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్‌లో ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా పోలంరెడ్డి దినేష్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. కోవూరు టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పేరును ప్రకటించిన నేపథ్యంలో దినేష్ రెడ్డిని అధికార ప్రతినిధిగా నియమిస్తూ టీడీపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.
విశాఖ తూర్పు నౌకాదళం పరిధిలో సాగర జలాల్లో భారత్ అమెరికా దేశాల మధ్య హెచ్ఎడిఆర్-హ్యుమానిటీరియన్ అసిస్టెన్స్ డిజాస్టర్ రిలీఫ్ పేరుతో నేవీ విన్యాసాలు ప్రారంభమైనట్లు నేవీ అధికారులు తెలిపారు. 18న ప్రారంభమైన విన్యాసాలు సీఫేజ్, హార్బర్ ఫేజ్‌ల్లో కొనసాగుతాయన్నారు. ఇరుదేశాల అధికారులు భారత్ నేవీ హెలికాప్టర్లు, యుద్ధ నౌకలు, అమెరికాకు చెందిన యుద్ధనౌక టైగర్ ట్రయాంప్ విన్యాసాల్లో పాల్గొంటున్నాయన్నారు.
జిల్లావ్యాప్తంగా నేటి నుంచి జొన్న, మొక్కజొన్న సేకరణకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించినట్లు జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ తెలిపారు. మంగళవారం జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో కొనుగోలు కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలు మేరకు జొన్న పంట ఒక క్వింటాకు రూ.3180, మొక్కజొన్న పంట క్వింటాకు రూ.2090 కనీస మద్దతు ధరగా ప్రకటించారు.
గుడిపల్లి మండలం చీకటపల్లి ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వెంకట్, కుప్పం మండలం టెక్నికల్ అసిస్టెంట్ మురుగేషన్ లను విధుల నుంచి తొలగిస్తూ జిల్లా కలెక్టర్ షన్మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల ప్రచారంలో ఇద్దరు కాంట్రాక్ట్ ఉద్యోగులు పాల్గొని, ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కారణంగా చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు.
రాజకీయ పార్టీల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనే వాలంటీర్లు, ప్రభుత్వంలో పనిచేసే వారిపై ఎన్నికల నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ హెచ్చరించారు. ప్రభుత్వంలో పనిచేసేవారు రాజకీయ పార్టీల ప్రచారంలో పాల్గొంటున్నారని వివిధ పత్రికలలో వచ్చిన వార్తలపై కలెక్టర్ స్పందించారు.
శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురంలో ఈ నెల 30న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటిస్తున్నట్లు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి టి.ఎన్. దీపిక తెలిపారు. హిందూపురం నియోజకవర్గంలో బస్సు యాత్ర, బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ బస్సు యాత్రకు జిల్లా వైసీపీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
మొన్నటి వరకు చిలకలూరిపేట YCP ఇన్‌ఛార్జ్‌గా ఉన్న రాజేశ్ నాయుడికి CMO నుంచి పిలుపు వచ్చింది. ఇటీవల కావటి మనోహర్‌ను ఇక్కడి ఇన్‌ఛార్జ్‌గా నియమించిన అధిష్ఠానం.. ఆయనకే MLA టికెట్ ఇచ్చింది. తనను తప్పించడంపై అసంతృప్తిగా ఉన్న రాజేశ్ సీఎం పిలుపు మేరకు క్యాంపు ఆఫీసుకు వెళ్లారు. దీంతో పాటు ఆయన ఇటీవల మంత్రి రజినీపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలసిందే. ఈ క్రమంలో సీఎంవో నుంచి పిలుపు ప్రాధాన్యం సంతరించుకుంది.
ఉమ్మడి తూ.గో. జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాలు రేపు (ఈ నెల 20న) కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. కోనసీమ, పెద్దాపురం తదితర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం వర్షం కురుస్తున్నాయి. జిల్లాలోని పొందూరు, చిలకపాలెం, గంగువారి సిగడాం, ఆమదాలవలస పలు మండలాల్లో ఈదురు గాలులు ఉరుములతో వర్షం కురుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇన్ని రోజులు ఉక్కపోతతో ఇబ్బంది పడ్డ ప్రజలకు కాస్త ఉపశమనం కలిగింది.
Sorry, no posts matched your criteria.