India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సాంకేతిక పరిజ్ఞానంతో శ్రీహరిపురం ఏటీఎం కేంద్రంలో కార్డు వినియోగించే చోట ఓ ముఠా కొద్దిపాటి మార్పులు చేసి నలుగురి నుంచి రూ. లక్ష కాజేసింది. నగదు డ్రా చేసేందుకు వచ్చినవారు కార్డు పెట్టగా అది లోపలికి పోతోంది. వెంటనే ముఠాలో ఒకడు వచ్చి సహాయం చేస్తున్నట్లు నటిస్తూ ముఠా అతికించిన నంబర్‌కి ఫోన్ చేయాలని సలహా ఇస్తాడు. నంబర్‌కి ఫోన్ చేయగా ముఠాలో మరొక సభ్యుడు వివరాలు సేకరించి వేరే ATMలో నగదు డ్రా చేస్తాడు.
ఇబ్రహీంపట్నం మండలం దాములూరులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం దాములూరు గ్రామం డొంక రోడ్డులో సుమారు 40 నుంచి 45 సంవత్సరాలు వయసు గలిగిన మహిళ మృతదేహం ఉందని, స్థానికులు ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టామన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గార్లదిన్నె మండలం పెనకచర్ల డ్యాం గ్రామానికి చెందిన షేక్ జిలాన్ బాషాకు అనంతపురంలో యాక్సెస్ బ్యాంకు అకౌంట్ ఉంది. శనివారం రాత్రి ఖాతా నుంచి రూ.1,73,100 దొంగలించినట్లు బాధితుడు వాపోయాడు. దీనిపై సైబర్ క్రైమ్ నంబర్ 1030తోపాటు గార్లదిన్నె పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులు వాట్సాప్ లింకు పంపించి క్లిక్ చేయగానే ఫోను హ్యాక్ చేసి దొంగలించినట్లు పేర్కొన్నారు.
శ్రీశైలానికి 20 కి.మీ దూరం గల దట్టమైన అభయారణ్యంలో వెలసిన కోరిన కోరికలు తీర్చే ఇష్టకామేశ్వరి అమ్మవారిని సినీ దర్శకులు సముద్ర ఖని మంగళవారం దర్శించుకున్నారు. మల్లన్న దర్శనార్థమై వచ్చిన ఆయన ముందుగా నల్లమల అటవీ ప్రాంతంలోని ఇష్టకామేశ్వరి దేవాలయాన్ని సందర్శించి అనంతరం శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట స్థానికుడు కోటి ఉన్నారు.
జలదంకి మండల పరిధిలోని చిన్న కాక వద్ద అదుపుతప్పి గ్యాస్ సిలిండర్ లారీ బోల్తా పడిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో డ్రైవర్ లారీలోనే చిక్కుకుపోవడంతో అటువైపుగా వెళ్తున్న వాహనదారులు రక్షించి బయటికి తీశారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. స్వల్పంగా గాయపడిన డ్రైవర్ ను ఆసుపత్రిలో తరలించినట్లు స్థానికులు తెలిపారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో ఆరు నియోజకవర్గాలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారులను నియమించినట్టు కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. పెనుకొండకు సబ్ కలెక్టర్, హిందూపురానికి జాయింట్ కలెక్టర్, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి నియోజకవర్గాలకు ఆయా ఆర్డీవోలు, మడకశిరకు అహుడా కార్యదర్శి గౌరీ శంకర్ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు. హిందూపురం పార్లమెంటుకు కలెక్టర్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు.
బాపట్లలో సోమవారం సాయంత్రం రైలు కిందపడి మృతి చెందిన వ్యక్తి వివరాలను రైల్వే పోలీసులు తెలిపారు. రైల్వే ఎస్సై రాజకుమార్ తెలిపిన కథనం మేరకు.. విజయవాడకు చెందిన షేక్. సమ్మర్ (45) అనే వ్యక్తి రైలులో కాంట్రాక్ట్ పద్ధతిలో సమోసాలు విక్రయిస్తుంటాడు. సోమవారం సాయంత్రం పూరి- తిరుపతి ఎక్స్‌ప్రెస్ బాపట్లలో నిలపగా.. కాలకృత్యాలు తీర్చుకుని రన్నింగ్ ట్రైన్ ఎక్కుతుండగా జారిపడి మృతి చెందినట్లు ధ్రువీకరించారు.
తూర్పు తీరంలో ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు చేపలవేట నిలిచిపోనుంది. ఈ మేరకు కేంద్ర మత్స్యశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. చేప పిల్లలు ఎదిగే సమయం కావడంతో ఏటా ఏప్రిల్-జూన్ మధ్య 61రోజుల పాటు చేపలవేటను నిషేధిస్తారు. ఏపీతోపాటు తీరప్రాంతం విస్తరించి ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఇది అమలు కానుంది. కేంద్ర ప్రభుత్వానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉందని మత్స్యశాఖ జేడీ విజయకృష్ణ తెలిపారు.
పల్నాడు జిల్లా గురజాల పట్టణంలో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన వాలంటీర్‌ను, విధుల నుంచి తొలగిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆవుల గోపాలకృష్ణ అనే వాలంటీర్ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా కరపత్రాలను అందించిన క్రమంలో, అందిన ఫిర్యాదు మేరకు ఆర్డీవో సదరు వాలంటీర్‌ను విధులు నుంచి తొలగించారు. వాలంటీర్ దగ్గర నుంచి సెల్ ఫోను బయోమెట్రిక్ డివైస్‌ను స్వాధీనపరుచుకున్నారు.
బత్తలపల్లి సమీపంలోని నార్సింపల్లి రోడ్డు వద్ద సోమవారం పొలంలో విద్యుత్ తీగలు చోరీ చేయడానికి వచ్చి శ్రీరాములు(32) అనే వ్యక్తి విద్యుత్ షాక్‌తో మృతి చెందాడని బత్తలపల్లి ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. బాధితుడు పుట్టపర్తి మండలం ఎనుములపల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించమన్నారు. కుటుంబ సభ్యులతో గొడవపడి గత ఆరు నెలలుగా ఇంటికి వెళ్లడం లేదన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.