India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. నెల్లూరు జిల్లాలో 4970 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 3675 మంది పాసయ్యారు. 75 % పాస్ పర్సంటేజ్‌తో రాష్ట్రంలో 4వ స్థానంలో నిలిచింది. తిరుపతి జిల్లాలో 6023 మందికి 3602 మంది పాసయ్యారు. 60 % పాస్ పర్సంటేజ్‌తో 13వ స్థానంలో నిలిచింది. ఒకేషన్లో నెల్లూరు విద్యార్థులు 412 మందికి 325 మంది.. తిరుపతిజిల్లా విద్యార్థులు 380 మందికి 235 మంది పాసయ్యారు.
ఇంటర్ సెకండ్ ఇయర్ సప్లమెంటరీ ఫలితాల్లో చిత్తూరు జిల్లా విద్యార్థులు పర్వాలేదనిపించారు. జిల్లాలో 4,742 మంది పరీక్షలు రాయగా 3,043 మంది పాసయ్యారు. 64 శాతం ఉత్తీర్ణతతో జిల్లా రాష్ట్రంలో 8వ స్థానంలో నిలిచింది. తిరుపతి జిల్లా 6,023 మందికి 3,602 మందే పాస్(60%) అవడంతో 13వ స్థానాన్ని పొందింది. ఒకేషన్లో చిత్తూరు విద్యార్థులు 750 మందికి 380 మంది.. తిరుపతి జిల్లా విద్యార్థులు 380 మందికి 235 మంది పాసయ్యారు.
➤ ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షలకు విశాఖ జిల్లాలో 7,500 మంది విద్యార్థులు హాజరవ్వగా 3,777 మంది ఉత్తీర్ణత సాధించారు. 50 శాతం ఉత్తీర్ణతతో జిల్లా 22వ స్థానంలో నిలిచింది.
➤ అనకాపల్లి జిల్లాలో 4,400 మందికి 2,713 మంది ఉత్తీర్ణత సాధించారు. 61 శాతం ఉత్తీర్ణతతో జిల్లా 10వ స్థానంలో నిలిచింది.
➤ అల్లూరి జిల్లాలో 1,691 మందికి 1,370 మంది ఉత్తీర్ణత సాధించారు. 81 శాతంతో జిల్లా రెండో స్థానంలో నిలిచింది.
ఇంటర్ సెంకడ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఇందులో కాకినాడ జిల్లా 14వ స్థానంలో నిలిచింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 6027 మంది పరీక్ష రాయగా.. 3410 మంది(57 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ కోర్సులో కాకినాడ జిల్లా వ్యాప్తంగా 384 మంది పరీక్ష రాయగా.. 218 మంది (57శాతం) పాస్ అయ్యారు.
ఇంటర్మీడియెట్ సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో 1,709 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 1,443 మంది ఉత్తీర్ణత సాధించారు. 84 శాతం పాస్ పర్సంటేజ్‌తో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. విజయనగరం జిల్లాలో 6,685 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 4,570 మంది ఉత్తీర్ణత సాధించారు. 68 శాతం పాస్ పర్సంటేజ్‌తో రాష్ట్రంలో 5వ స్థానంలో నిలిచింది.
కాసేపటి క్రితం ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో ప్రకాశం జిల్లాలో 5,487 మంది పరీక్షలు రాయగా… 3330 మంది పాసయ్యారు. మొత్తం 61 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా .. జిల్లా 12వ స్థానంలో నిలిచింది. దాంతో పాటు ఒకేషనల్‌కు ప్రకాశం జిల్లాలో 862 మంది పరీక్ష రాయగా 534 మంది పాసయ్యారు. ఇందులో జిల్లా 62 శాతం ఉత్తీర్ణత సాధించింది.
ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల్లో సత్యసాయి జిల్లాలో 2524 మంది పరీక్షలు రాయగా 1557 మంది పాసయ్యారు. 62 % ఉత్తీర్ణతతో జిల్లా రాష్ట్రంలో 9వ స్థానంలో నిలిచింది. అనంత జిల్లాలో 4811 మంది పరీక్షలు రాయగా 2920 మంది పాసయ్యారు. 61 % ఉత్తీర్ణతతో జిల్లా 11వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ కోర్సులో సత్యసాయి జిల్లాలో 310 మంది పరీక్ష రాయగా 183 మంది, అనంత జిల్లాలో 445 మంది పరీక్ష రాయగా 264 మంది పాసయ్యారు.
ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలోని బీ-ఫార్మసీ నాలుగో ఏడాది 2వ సెమిస్టర్(2017-18 రెగ్యులేషన్) థియరీ పరీక్షలను జూలై 25 నుంచి నిర్వహించనున్నారు. 22 కళాశాలల్లో ఈ పరీక్షలను క్లబ్బింగ్ & జంబ్లింగ్ విధానంలో నిర్వహిస్తామని AU వర్గాలు తెలిపాయి. సంబంధిత కళాశాలల ఫార్మసీ విద్యార్థులు పరీక్ష రాయాల్సిన కేంద్రాల వివరాలను https://exams.andhrauniversity.edu.in అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవాలన్నారు..
నెల్లూరు జిల్లాలో ఈనెల 19, 20వ తేదీల్లో ఐటీఐలో ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఐటీఐ కన్వీనర్, ప్రభుత్వ బాలుర ఐటీఐ ప్రిన్సిపల్ శ్రీధర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు నెల్లూరు వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ బాలుర ఐటీఐకు ఒరిజనల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు. 19న మెరిట్ నంబరు 1 నుంచి 300 వరకు, 20న మెరిట్ నంబరు 301 నుంచి 620 వరకు కౌన్సెలింగ్ ఉంటుంది.
ఆసియాలోనే మదనపల్లె టమాటా మార్కెట్ అతిపెద్దది. దేశంలో ఎక్కడ ధరలు పెరిగినా ఇక్కడి రేటు ఎంతో తెలుసుకోవడానికి అందరూ ఆసక్తి చూపుతుంటారు. కాగా మంగళవారం ఇక్కడ కిలో టమాటా రూ.80 పలికిందని మార్కెట్ అధికారులు వెల్లడించారు. గత శుక్రవారం ఇక్కడ రూ.50 ఉండగా నాలుగు రోజులకే ధర బాగా పెరిగింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.