India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గొడ్డలి దాడిలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. గిద్దలూరు మండలం పరమేశ్వర్ నగర్ గ్రామానికి చెందిన <<12881965>>TDP కార్యకర్త<<>> మునయ్యపై నలుగురు వైసీపీ వర్గీయులు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మునయ్యను హైదరాబాద్ లోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా మునయ్య చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
సింహాచలం అప్పన్న బాబు ఆలయంలో మే 10వ తేదీన నిర్వహించే చందనోత్సవం రోజున అంతరాలయ దర్శనాలు రద్దు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ ఉత్సవానికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేశారు. ఆ రోజున కేవలం విధుల్లో ఉన్న వైదికలు, ఆలయ సంప్రదాయం ప్రకారం అనుమతులు ఉండే వాళ్లకు మాత్రమే అంతరాలయ దర్శనాలు కల్పించాలని సూచించారు. ఆరోజున ఘాట్ రోడ్డులో కేవలం మినీ బస్సులు మాత్రమే నడపాలని అన్నారు.
బంటుమిల్లి మండలం రామవరపు మోడిలోని 3 ఎకరాల చేపల చెరువులో విషప్రయోగం కలకలం రేపుతోంది. బాధితుల వివరాల ప్రకారం.. గూడవల్లి లక్ష్మీ చేపల సాగు చేస్తున్నామన్నారు. కుమార్తె వివాహం కోసం నాలుగు రోజుల్లో చేపలు పట్టడానికి బేరం కుదుర్చుకున్నామని, ఈలోపే గుర్తు తెలియని వ్యక్తులు విషప్రయోగం చేయడంతో చేపలన్నీ చనిపోయాయని.. దాదాపు రూ. 7 లక్షల నష్టం జరిగిపట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆత్మకూరు పట్టణంలోని ఒక మద్యం దుకాణంలో నగదు చోరీకి గురైన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు షాపు ఒక వైపు గోడకు రంద్రం వేసి లోనికి ప్రవేశించి దుకాణంలోని రూ. 3.89 లక్షల నగదు చోరీ చేశారు. ఉదయం దుకాణం తెరిచిన సిబ్బంది చోరీ విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
1952లో ఏర్పడిన నరసాపురం పార్లమెంట్ స్థానానికి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. అయితే ఇక్కడ అత్యధికంగా 15 సార్లు క్షత్రియ, 2 సార్లు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు ఎంపీలుగా గెలుపొందారు. కాగా వైసీపీ తొలిసారిగా బీసీ మహిళకు అవకాశం ఇచ్చింది. శెట్టిబలిజ వర్గానికి చెందిన న్యాయవాది గూడూరి ఉమాబాలను అభ్యర్థిగా ప్రకటించింది.
విశాఖ నాలుగవ పోలీస్ స్టేషన్ పరిధిలో జగన్నాథపురంలో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థి భాను చైతన్య(20) మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నగరంలో ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో భాను చైతన్య బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. రెండవ సంవత్సరంలో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
కృష్ణా జిల్లా పెనమలూరు టికెట్ వ్యవహారం ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే బోడే ప్రసాద్‌కు టికెట్ ఇవ్వలేకపోతున్నామని అధినేత చెప్పడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అభ్యర్థుల ప్రకటన ఆలస్యం కావడంతో రోజురోజుకి ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. పెనమలూరు తెరపైకి తాజాగా టీడీపీ నేత ఆలపాటి రాజా, దేవినేని చందు పేర్లు అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఎవరికి టికెట్ కేటాయిస్తారనే అంశంపై చర్చ జరుగుతోంది.
శ్రీకాకుళం జిల్లాలో పదో తరగతి పరీక్షలు సజావుగా సాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 145 కేంద్రాల్లో పది పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు సోమవారం తెలిపారు. మొత్తం 29,243 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా 28,785 మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు. 458 మంది పరీక్షలకు హాజరుకానట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడ మాల్ ప్రాక్టీస్ జరగకుండా అధికారులు చర్యలు చేపట్టారు.
కర్నూలు జిల్లాలో 14మంది ఎమ్మెల్యే, 2 ఎంపీ అభ్యర్థులను వైసీపీ అదిష్ఠానం ప్రకటించింది. వీరిలో 1988లో జన్మించిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థి గంగుల బ్రిజేంద్రారెడ్డి అందరికంటే వయస్సులో చిన్నవారు. ఆయన తర్వాత స్థానంలో 1988లో జన్మించిన నంద్యాల శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఉన్నారు. అందరి కంటే ఎక్కువ వయస్సు కల్గిన అభ్యర్థిగా 1954లో జన్మించిన నంద్యాల ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మానందరెడ్డి ఉన్నారు.
ఒకటి, రెండు ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. దక్షిణ తమిళనాడు నుంచి అంతర్గత కర్ణాటక మీదుగా.. పశ్చిమ విదర్భ వివిధ ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం వరకు ఒక ద్రోణి విస్తరించి ఉంది. దీంతో ఝార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తా వరకు మరో ద్రోణి వ్యాపించింది. వీటి ప్రభావంతో బుధవారం శ్రీకాకుళం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.
Sorry, no posts matched your criteria.