Andhra Pradesh

News June 18, 2024

గార్లదిన్నెలో తప్పిన ప్రమాదం.. లారీ బోల్తా

image

చీని కాయల లోడుతో వెళుతున్న లారీ అదుపు తప్పి మంగళవారం బోల్తా పడింది. లారీ తిమ్మంపేట నుంచి గార్లదిన్నెలోకి వస్తుండగా శింగనమల క్రాస్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

News June 18, 2024

విజయవాడ: కన్సల్టెన్సీ పేరుతో మహిళ మోసం

image

సౌజన్య అనే మహిళ మరోవ్యక్తితో కలిసి విజయవాడలో ఓ కన్సల్టెన్సీ ద్వారా కొందరిని విజిటింగ్ వీసా ద్వారా కెనడా పంపించారు. అక్కడ సౌజన్యకు పార్ట్‌నర్‌తో విబేధాలు రాగా ఏలూరు రోడ్డులో సొంతంగా కన్సల్టెన్సీ ఓపెన్ చేసింది. విదేశాల్లో ఉద్యోగాలిప్పిస్తానని గుంటూరు, కృష్ణా, ఏలూరుకు చెందిన 40మంది నుంచి రూ.లక్షల్లో వసూలు చేసింది. బాధితులు విజయవాడ సీపీ రామకృష్ణను ఆశ్రయించగా ఆయన కేసును మాచవరం పోలీసులకు అప్పగించారు.

News June 18, 2024

ఏలూరు: చేతబడి నెపం.. కత్తితో దాడి

image

పోలవరం మండలం ఎల్లండిపేటలో కత్తిపోట్లు కలకలం రేపాయి. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామంలోని కనకదుర్గమ్మ ఆలయ పూజారి జొన్నడ పేరస్వామిపై అదే గ్రామానికి చెందిన చిక్కాల ఏసుబాబు కత్తితో దాడి చేశాడు. చేతబడి నెపంతోనే దాడికి పాల్పడ్డాడని తెలిపారు. బాధితుడిని పోలవరం ప్రభుత్వాసుపత్రికి తరలించగా ప్రథమ చికిత్సచేసి మెరుగైన వైద్యం కోసం రాజమండ్రికి తరలించారు. పోలవరం పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

News June 18, 2024

వందే భారత్‌లో విజయవాడ బయలుదేరిన హోం మంత్రి

image

విశాఖ నుంచి వందే భారత్ రైలులో హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మంగళవారం ఉదయం విజయవాడ బయలుదేరి వెళ్లారు. రైలులో ప్రయాణికులతో ముచ్చటిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ట్రైన్లో కలిగి తిరుగుతూ అందరినీ పలకరించారు. హోం మంత్రినైనా ప్రజలతో కలిసిమెలిసి ఉండడమే తనకు ఇష్టమని ఆమె పేర్కొన్నారు. ఎవరు ఏ సమస్య తన దృష్టికి తీసుకువచ్చినా పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని అన్నారు.

News June 18, 2024

రాజాం: మెట్ల మీద నుంచి పడి వ్యక్తి మృతి

image

మున్సిపాలిటీ పరిధిలోని మల్లిఖార్జున కాలనీకి చెందిన కొల్లు రమణ(79) శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కొల్లు రమణ మెట్లు మీద నుంచి దిగుతుండగా కాలు జారి పడిపోవడంతో గాయపడ్డాడు. కుటుంబసభ్యులు వెంటనే రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు సీఐ దాడి మోహన్ రావు తెలిపారు. రమణ మృతి చెందినట్లు కుమారుడు వాసు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

News June 18, 2024

వైఎస్ జగన్‌కు బుద్ధా వెంకన్న కౌంటర్

image

మాజీ సీఎం జగన్‌కు విజయవాడ టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. ‘జగన్ రెడ్డి నీకు 151 సీట్లు వచ్చినప్పుడు అది మీ విజయమా ? అదే మాకు 164 సీట్లు వస్తే ఈవీఎంల గురించి మాట్లాడుతున్నావు. నువ్వు పులివెందులలో రాజీనామా చెయ్. బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నికలకు వెళ్దాం. నీకు మొన్న వచ్చిన మెజారిటీ అయినా వస్తుందో రాదో, అసలు గెలుస్తావో లేదో చూద్దాం. ఇకనైనా నీ చిలక జోస్యం ఆపు’ అని Xలో పోస్ట్ చేశారు.

News June 18, 2024

వైఎస్ జగన్‌కు బుద్ధా వెంకన్న కౌంటర్

image

మాజీ సీఎం జగన్‌కు విజయవాడ టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. ‘జగన్ రెడ్డి నీకు 151 సీట్లు వచ్చినప్పుడు అది మీ విజయమా ? అదే మాకు 164 సీట్లు వస్తే ఈవీఎంల గురించి మాట్లాడుతున్నావు. నువ్వు పులివెందులలో రాజీనామా చెయ్. బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నికలకు వెళ్దాం. నీకు మొన్న వచ్చిన మెజారిటీ అయినా వస్తుందో రాదో, అసలు గెలుస్తావో లేదో చూద్దాం. ఇకనైనా నీ చిలక జోస్యం ఆపు’ అని Xలో పోస్ట్ చేశారు.

News June 18, 2024

మర్కాపురం: పులుల వేటకు దుప్పులు వదిలారు..!

image

మార్కాపురం అటవీ డివిజన్ పరిధిలో సంరక్షణ కేంద్రమైన నాగార్జున సాగర్ టైగర్ రిజర్వు ఉంది. ఇది దేశంలోనే 53 టైగర్ రిజర్వాయర్లలో పెద్దది. అయితే పులులకు ఆహారం తగ్గడంతో మార్కాపురం అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ అప్పావు ఆధ్వర్యంలో నెక్కంటి అటవీ క్షేత్రాధికారి ఆరీఫ్ ఖాన్ 28 సాంబార్లు, 15 చుక్కల దుప్పులను కాకినాడ నుంచి తీసుకొచ్చారు. వాటిని నల్లమల అటవీ ప్రాంతంలో వదిలినట్లు తెలిపారు.

News June 18, 2024

అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు..!

image

నర్సీపట్నం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చింతకాయల అయ్యన్నపాత్రుడుకి స్పీకర్ పదవి ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అయ్యన్న తన అనుచరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్ పదవి తనకి కేటాయించారని చెప్పినట్లు సమాచారం. ఈనెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్న తరుణంలో ఆయన నియామకంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. దీంతో టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

News June 18, 2024

ఏలూరు: కన్సల్టెన్సీ పేరుతో మహిళ మోసం

image

సౌజన్య అనే మహిళ మరోవ్యక్తితో కలిసి విజయవాడలో ఓకన్సల్టెన్సీ ద్వారా కొంతమంది యువతను విజిటింగ్ వీసా ద్వారా కెనడా పంపించారు. అక్కడ సౌజన్యకు పార్ట్‌నర్‌తో విబేధాలు రాగా ఏలూరు రోడ్డులో సొంతంగా కన్సల్టెన్సీ ఓపెన్ చేసింది. విదేశాల్లో ఉద్యోగాలిప్పిస్తానని గుంటూరు, కృష్ణా, ఏలూరుకు చెందిన 40మంది నుంచి రూ.లక్షల్లో వసూలుచేసింది. బాధితులు విజయవాడ CI రామకృష్ణను ఆశ్రయించగా ఆయన కేసును మాచవరం పోలీసులకు అప్పగించారు.