India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లు వాడాలంటూ మాజీ సీఎం జగన్ చేసిన ట్వీట్‌కు మాజీ మంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘ఓటమి షాక్ నుంచి జగన్ ఇంకా తేరుకోలేదు. అందుకే ఎలాన్ మస్క్‌లా మాట్లాడుతున్నాడు. గెలిస్తే తన గొప్ప.. ఓడితే ఈవీఎంల తప్పా? 2019లో గెలిచినప్పుడు జగన్ ఏం మాట్లాడాడో గుర్తు చేసుకోవాలి. ఇకనైనా జగన్ ఆత్మవిమర్శ చేసుకోవాలి’ అని సూచించారు.
ఎన్నికల ఫలితాలు విడుదలైన 2 రోజుల తర్వాత తనకు సెలవు కావాలని టీటీడీ పూర్వ ఈవో ధర్మారెడ్డి కోరారు. అదే సమయంలో తిరుమలకు చంద్రబాబు రావడంతో ఈనెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సెలవు మంజూరు చేశారు. ఈక్రమంలోనే ధర్మారెడ్డిని ఈవోగా తప్పించి శ్యామలరావును నియమించారు. ఇది ఇలా ఉండగా ఈనెలాఖరు వరకు తన సెలవు పొడిగించాలని ధర్మారెడ్డి సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్‌కు మరో లేఖ రాశారు. ఈనెల 30న ఆయన రిటైర్ కానున్నారు.
మహానందిలో చిరుత పులి మళ్లీ ప్రత్యక్షమవడం కలకలం రేపింది. సోమవారం అర్ధరాత్రి దాటాక పార్వతీపురం పాత వివేకానంద స్కూల్ వద్ద కనిపించింది. భయాందోళనకు గురైన ప్రజలు గట్టిగా కేకలు వేయడంతో పక్కనే ఉన్న అటవీ ప్రాంతానికి చిరుత పులి పారిపోయింది. గత రెండు రోజులుగా మహానంది గ్రామ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న చిరుత పులి తిరుగుతోంది భక్తులూ ..జాగ్రత్త అంటూ దేవస్థానం అధికారులు సూచిస్తున్నారు.
నిడిజివ్వి గ్రామంలో జూదం ఆడుతున్న 16 మందిని ఎర్రగుంట్ల పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 72,750 నగదును స్వాధీనం చేసుకునట్లు ఎస్సై భాస్కర్ రెడ్డి తెలిపారు. అదే విధంగా పోట్లదుర్తి గ్రామంలో జూదం ఆడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకుని రూ.24,750 నగదు స్వాధీనం చేసుకున్నారు.
అచ్యుతాపురం మండలం పూడిమడక సముద్రతీరంలో చాపల వేటకు వెళ్లిన బోటు ఇంజన్‌లో మంటలు చెల్లరేగడం వల్ల అగ్ని ప్రమాదం జరిగినట్లు ఏపీ మేకనైజ్డ్ బోటు అసోసియేషన్ అధ్యక్షుడు వాసుపల్లి జానకిరామ్ తెలిపారు. బోటులో ఉన్న మత్స్యకారులు వాసుపల్లి రాజు, వి.అప్పన్న, వి.దాసిలు, వి. అప్పారావు గనగళ్ల ఎర్రికొండ, మైలపల్లి ఎర్రయ్య, జి.పోలిరాజును మరో బోటు రక్షించి విశాఖ ఫిషింగ్ హార్బర్‌కు తీసుకొచ్చినట్లు తెలిపారు.
భర్త చనిపోయిన కొన్ని గంటలకే భార్య మరణించిన విషాద ఘటన ఇది. శ్రీకాకుళం జిల్లా వంగర మండలం కొప్పరవలస గ్రామానికి చెందిన బొద్దూరు శ్రీరాములు, చిన్నతల్లి భార్యాభర్తలు. శ్రీరాములు అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం కన్నుమూశారు. మనోవేధనకు గురైన చిన్నతల్లి భర్త మృతదేహం పక్కనే రోదిస్తూ తనువు చాలించింది. ఇలా ఒకేసారి భార్యాభర్తలు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నూజివీడు నియోజకవర్గం జిల్లాల విభజన తర్వాత ఏలూరు జిల్లాలోకి వెళ్లింది. NTR జిల్లాను ఆనుకొని ఉండే ఇక్కడి ప్రజలకు విజయవాడ, గన్నవరంతో ఎక్కువగా సంబంధాలు ఉంటాయి. ఎన్నికలకు ముందు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో కలుపుతామని చంద్రబాబు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దాని ప్రకారం నూజివీడును ఎన్టీఆర్ జిల్లాలో కలుపుతారా.? కృష్ణా జిల్లా పరిధిలోకి తీసుకొస్తారా.? అనే విషయం తెలియాల్సి ఉంది.
ఉమ్మడి నెల్లూరు జిల్లా కోట(M) విద్యానగర్‌కు చెందిన నిహారిక అనే యువతి మోసపోయింది. ఇన్‌స్టాగ్రాం పరిచయంతో గద్వాల్ జిల్లాకు చెందిన బషీర్‌తో ఆమె కొద్ది రోజులు సహజీవనం చేసింది. తనకు విడాకులై ఇద్దరు పిల్లలు ఉన్నారని నిహారిక చెప్పినా మార్చి 18న బషీర్ తాళి కట్టాడు. 2 నెలలు కాపురం చేసి పారిపోయాడు. బక్రీద్ కావడంతో అతను సొంత ఇంటికి వస్తాడని నిహారిక నిన్న బషీర్ ఊరికి వెళ్లగా అతను దాడి చేసి తరిమేశాడు.
ఆళ్లగడ్డ(M) మర్రిపల్లెకి చెందిన రామ్మోహన్ తనకు రెండు ఎకరాల్లోని 25 సెంట్లలో 25 రకాల పంటలు పండిస్తున్నారు. గడ్డ జాతి కూరగాయలకు 3అడుగుల మేర బెడ్లు, 1.5అడుగుల కాల్వలో కూరగాయలు, ఖాళీ స్థలంలో ఆకుకూరలు వేసుకునేలా సిద్ధం చేశారు. తెగుళ్ల నివారణకు కషాయలు తయారుచేసుకొని వాడారు. నెలకు రూ.4000 పెట్టుబడితో రూ.30 వేల దాకా సంపాదిస్తున్నట్లు తెలిపారు. రసాయనాలు వాడకపోవడంతో అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారన్నారు.
అనంతపురానికి చెందిన ఆరోన్ రోనాల్డిన్ భారత సాఫ్ట్ టెన్నిస్ జట్టుకు ఎంపికైనట్లు ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి దారం దిలీప్ కుమార్ విజయవాడ రాష్ట్ర సాఫ్ట్ టెన్నీస్ కార్యాలయంలో తెలిపారు. జూన్ 18 నుంచి 23 వరకు కొరియాలోని ఇంచియాన్‌లో జరుగనున్న నొంగ్యుప్ బ్యాంక్ ఇంచియాన్ కొరియా కప్ పోటీలలో భారతజట్టుకి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.