Andhra Pradesh

News June 18, 2024

కడప: కలిసి కట్టుగా భరతం పడుదాం..!

image

కడపలో సోమవారం తొలిసారిగా MLAలు సోమవారం సమావేశమయ్యారు. అక్రమార్కుల పనిపట్టాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. గతంలో అంటకాగిన అధికారుల భరతం పట్టాలని, దీనిలో ఎలాంటి మినహాయింపులు లేవనే అభిప్రాయానికి వచ్చారు. జిల్లా TDP శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన R&Bలో చర్చించారు. దీనికి కమలాపురం MLA పుత్తా హాజరుకాలేదు. అయిదేళ్లు కార్యకర్తలను వేధించిన వారిని గుర్తించి తీవ్రవను బట్టి సస్పండ్ చేయించాలని అభిప్రాయానికి వచ్చారు.

News June 18, 2024

ఏఎన్ఎంల నియామకంపై తొలి సంతకం

image

రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి గుమ్మిడి సంధ్యారాణి గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య రక్షణ కోసం ఏఎన్ఎంల నియామకం ఫైల్‌పై తొలి సంతకం చేశారు. గిరిజనులకు డోలీ మోతలు తప్పిస్తానని, ఆరోగ్య సేవలు అందుబాటులోకి తెస్తానన్నారు. మాతాశిశు మరణాలు నియంత్రణ చేస్తానని, కక్ష సాధించనని , త్రికరణ శుద్ధితో ప్రజల కోసం పని చేస్తానన్నారు.

News June 18, 2024

శ్రీకాకుళం: నేటి నుంచి ఐటీఐ అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌

image

ప్రభుత్వ, ప్రైవేటు ITIలో చేరేందుకు ఈనెల 18 నుంచి 23వ తేదీ వరకు కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఈ కౌన్సెలింగ్‌ ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటిఐలో నిర్వహించనున్నట్లు జిల్లా కన్వీనర్ ప్రభుత్వ ITI ప్రిన్సిపల్ సుధాకరరావు తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరంలో ఒక ఏడాది, రెండేళ్ల వ్యవధిగల కోర్సుల అడ్మిషన్లకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. జిల్లాలో 3 ప్రభుత్వం ఐటిఐల్లో 716 సీట్లు ప్రైవేటు ఐటిఐల్లో 2,892 సీట్లు ఉన్నాయి.

News June 18, 2024

పిఠాపురంలో హత్య..UPDATE

image

పిఠాపురం మండలం భోగాపురంలో ఈ నెల 14న బొమ్మ దేవప్రసాద్‌ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు నాగులపల్లి పద్మరాజును అరెస్ట్ చేసినట్లు CI శ్రీనివాస్, SI గుణశేఖర్ తెలిపారు. మృతుని సోదరుడు శ్రీనివాసరావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి హత్య కేసును విచారించామన్నారు. మృతుడు ప్రసాద్, నిందితుడు పద్మరాజు కలిసి తాపీ పని చేశారన్నారు. కూలి డబ్బుల విషయంలో జరిగిన ఘర్షణలో ప్రసాద్‌ను కొట్టి చంపేశారన్నారు.

News June 18, 2024

విశాఖ కేజీహెచ్‌లో పేలిన వెంటిలేటర్ బ్యాటరీ

image

KGHలో సోమవారం అర్ధరాత్రి సీఎస్ఆర్ బ్లాక్ ICU వార్డులో వెంటిలేటర్ బ్యాటరీ పేలిపోయింది. వార్డు మొత్తం పొగ వ్యాపించడంతో రోగులు, సహాయకులు భయాందోళన చెందారు. వెంటనే స్పందించిన వైద్యులు 7గురు రోగులను సర్జికల్ ICUకి తరలించారు. రోగులంతా సురక్షితంగా ఉన్నారని కేజీహెచ్ పర్యవేక్షక అధికారి డా.శివానంద వెల్లడించారు. రాత్రి 12 గంటలకు ప్రమాదం చోటు చేసుకోగా.. ఒంటి గంటకు పూర్తిగా అదుపులోకి వచ్చింది

News June 18, 2024

దర్శి: మాజీ ఎంపీటీసీ కోటిరెడ్డి మృతి

image

దర్శి మండలం బొట్లపాలెం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ గంగిరెడ్డిపాలెం కోటిరెడ్డి సోమవారం ఆనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కుమారుడు యలమందారెడ్డి వైసీపీ క్రీయాశీలక కార్యకర్తగా, జిల్లా వైసీపీ సేవాదళ్ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. విషయం తెలుసుకున్న దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్ గ్రామానికి చేరుకుని కోటిరెడ్డికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సానుభూతి పలికారు.

News June 18, 2024

ప.గో.: పార్ట్‌టైం ఉద్యోగం పేరుతో చీటింగ్

image

నరసాపురానికి చెందిన నరేశ్ ఓ యాప్‌లో పార్ట్‌ టైం ఉద్యోగ ప్రకటన చూసి నిర్వాహకులను సంప్రదించాడు. యాప్‌లో వచ్చే ప్రచారాలు చూస్తే నగదు ఇస్తామని వారు నమ్మించారు. తొలుత నరేశ్ ఖాతాలో రూ.10వేలు జమచేశారు. ఆ తర్వాత నగదురాకపోగా నరేశ్ ప్రశ్నించాడు. కొంత నగదుచెల్లిస్తే బకాయి మొత్తం ఇస్తామని చెప్పారు. అదినమ్మి నిర్వాహకుల ఖాతాల్లో రూ.6.86లక్షల వరకు జమచేశాడు. చివరికి మోసపోయానని గుర్తించి పోలీసులకు ఫిర్యాదుచేశాడు.

News June 18, 2024

మంగళగిరి క్రీడాకారిణికి గోల్డ్ మెడల్

image

మంగళగిరికి చెందిన క్రీడాకారిణి జెస్సీరాజ్(13) ప్రపంచ స్కేటింగ్ పోటీల్లో మెరిసింది. న్యూజిలాండ్‌లో ఈ నెల 13 నుంచి జరుగుతున్న పోటీల్లో భారత్ జట్టు తరఫున ప్రీ స్టైల్ ఈవెంట్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. ఈ విషయాన్ని రాష్ట్ర రోలర్ స్కేటింగ్ సంఘం కార్యదర్శి థామస్ చౌదరి తెలిపారు. 17 దేశాల క్రీడాకారులు పోటీ పడగా.. జెస్సీ రాజ్ 31.98 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచినట్లు చెప్పారు.

News June 18, 2024

తూ.గో.: పెళ్లి చేస్తానని.. రూ.40లక్షలు స్వాహా

image

ఆలమూరు మండలం మూలస్థాన అగ్రహారానికి చెందిన దుర్గారావు దివ్యాంగుడు. గ్రామానికి చెందిన ఓ యువకుడికి పెళ్లి సంబంధం చూస్తానని చెప్పి..ఓ అమ్మాయి ఫొటో చూపించాడు. 4ఎకరాల భూమి ఉందని, తనకు తెలిసిన అమ్మాయి నంబర్ ఇచ్చి రోజూ మాట్లాడించాడు. ఆ తర్వాత అమ్మాయికి ఆర్థిక సమస్యలున్నాయని రూ.40 లక్షల వరకు వసూలుచేశాడు. ఎన్నిరోజులైనా పెళ్లి ప్రస్తావన లేకపోగా మోసం బయటపడింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేశారు.

News June 18, 2024

నేడు అప్పన్న సోదరి పైడితల్లమ్మ పండుగ

image

సింహాద్రి అప్పన్న సోదరి తల్లి అమ్మ జాతర మంగళవారం నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. సింహాచలం అడవివరం తోపాటు 14 గ్రామాల ఆరాధ్య దైవంగా విరాజిల్లుతున్న అమ్మవారి ఉత్సవం ఏట ఘనంగా నిర్వహించడం పరిపాటి. ఇందుకోసం సింహాచలం దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసింది. మంగళవారం సాయంత్రం అనుపు ఉత్సవం నిర్వహిస్తారు.