Andhra Pradesh

News September 24, 2025

పెరవలి ఘటనపై మంత్రి దుర్గేష్ స్పందన

image

పెరవలిలో ఆర్టీసీ బస్సు ప్రమాదంపై మంత్రి కందుల దుర్గేశ్ స్పందించారు. ఈ ఘటనలో సలాది సత్యనారాయణ మృతి పట్ల ఆయన సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుని కుటుంబానికి ఆర్టీసీ నుంచి పరిహారం అందేలా చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు.

News September 24, 2025

చిత్తూరులో యూనివర్సిటీ పెట్టండి: MLA

image

చిత్తూరు జిల్లా విభజనతో యూనివర్సిటీలు అన్ని తిరుపతి జిల్లాలోకి వెళ్లిపోయాయని MLA జగన్ మోహన్ అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ‘చిత్తూరులో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. PVKN కాలేజీకి 100 ఎకరాలు ఉన్నాయి. ఇక్కడ యూనివర్సిటీ పెడితే విద్యార్థులకు బాగుంటుంది’ అని MLA కోరారు. యూనివర్సిటీని ఏర్పాటు చేసే దిశగా కృషిచేస్తామని విద్యా శాఖ మంత్రి లోకేశ్ సమాధానమిచ్చారు.

News September 24, 2025

కడప: ప్లాన్ ప్రకారమే వడ్డీ వ్యాపారి హత్య?

image

కడప జిల్లాలో వడ్డీ వ్యాపారి హత్య సంచలనం రేకిత్తించిన విషయం తెలిసిందే. అయితే వ్యాపారి వేణుగోపాల్‌రెడ్డిని పక్కా ప్లాన్‌తో హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఆయన ఇంటి వద్ద పలుమార్లు రెక్కీ నిర్వహించి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. ఆయన నుంచి అప్పులు తీసుకున్న వారే హైదరాబాద్‌కు చెందిన కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు పోలీసులు ఆధారాలు సేకరించినట్లు సమాచారం.

News September 24, 2025

SKLM: అధికారులు అప్రమత్తంగా ఉండాలి

image

వాయుగుండం ప్రభావంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. అల్పపీడనం వాయుగుండంగా బలపడుతుండటంతో రానున్న 4 రోజులు జిల్లాలో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. తీరం వెంబడి 40 నుంచి 50కి.మీ వేగంతో గాలులు విస్తాయన్నారు. 08942-240557ఈ నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.

News September 24, 2025

గాజువాక: డాక్‌యార్డ్ వంతెన రెఢీ

image

గాజువాక పారిశ్రామిక ప్రాంత వాసుల రవాణా కష్టాలు తీరనున్నాయి. డాక్‌యార్డ్ వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ వంతెన నిర్మాణం పూర్తయ్యింది. పోర్ట్ యాజమాన్యం మద్రాస్ ఐఐటి ఇంజనీర్ల బృందంతో రూ.26 కోట్లతో 330 మీ.పొడవు.10.5మీ.వెడల్పు 20 నెలల్లో వంతెన పునర్నిర్మాణం పూర్తిచేశారు. దసరా నుంచి రాకపోకలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలా అయితే ప్రయాణికులకు సమయంతోపాటు ఖర్చూ తగ్గుతుంది.

News September 24, 2025

నెల్లూరు జిల్లా DSC అభ్యర్థులకు గమనిక

image

డీఎస్సీ ద్వారా టీచర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అమరావతిలో గురువారం నియామక పత్రాలు అందజేస్తామని నెల్లూరు డీఈవో బాలాజీ రావు ఓ ప్రకటనలో తెలిపారు. ఉద్యోగాలకు ఎంపికైన వారంతా నేటి సాయంత్రం 4 గంటలలోపు గొలగమూడి ఆశ్రమం వద్దకు రావాలని సూచించారు. ఇక్కడి నుంచి బస్సుల్లో విజయవాడకు తీసుకెళ్తామన్నారు.

News September 24, 2025

ఒంగోలు: ‘విద్యతోపాటు ఆరోగ్యంపై దృష్టి సారించాలి’

image

పిల్లలకు మెరుగైన విద్యతోపాటు వారి ఆరోగ్యంపైనా సమాన దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలో పాఠశాల, జూనియర్ కళాశాలల స్థితిగతులు, విద్యాసంబంధ విషయాలపై మంగళవారం సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో ఒంగోలు ప్రకాశం భవనంలో ప్రత్యేకంగా ఆయన సమీక్షించారు. విద్య, వైద్యం, ప్రజలకు తాగునీరు తన ప్రాధాన్యత అంశాలని ఆయన పునరుద్ఘాటించారు.

News September 24, 2025

అసెంబ్లీ సమావేశాలు ముగియగానే సమస్యకు పరిష్కారం: వంశీకృష్ణ

image

విశాఖలో తొలగించిన స్ట్రీట్ వెండర్స్, ఫుడ్ కోర్ట్ వర్తకుల వ్యాపారాలను తిరిగి ఏర్పాటు చేయిస్తానని దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ బుధవారం హామీ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే వారి సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. వెండర్ కార్డులు ఇచ్చి చట్టబద్ధంగా వ్యాపారాలు పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం చిరువర్తులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

News September 24, 2025

నిరుత్సాహపరుస్తున్న కృష్ణా వర్సిటీ అడ్మిషన్లు

image

కృష్ణా విశ్వవిద్యాలయంలో పీజీ కోర్సుల అడ్మిషన్లు నిరుత్సాహకరంగా ఉన్నాయి. మొత్తం 322 సీట్లకు గాను కేవలం 158 మాత్రమే భర్తీ అయ్యాయి. కామర్స్, ఇంగ్లీష్, ఫిజిక్స్, మ్యాథ్స్ వంటి విభాగాల్లో విద్యార్థులు తక్కువగా చేరారు. హాస్టల్ వసతి లేకపోవడం, అధిక ఫీజులు అడ్మిషన్లు తగ్గడానికి కారణమని తెలుస్తోంది. తక్కువ సంఖ్యలో చేరికలు విశ్వవిద్యాలయ అధికారులను ఆందోళనలోకి నెట్టాయి.

News September 24, 2025

చందమామ కథలను ప్రారంభించింది మన తెనాలి వారే

image

తెలుగు రచయిత, ‘చందమామ’ పుస్తక సంపాదకుడు, చందమామ-విజయా కంబైన్స్ సహా నిర్మాత ఆలూరు వెంకట సుబ్బారావు (కలంపేరు చక్రపాణి) తెనాలిలో జన్మించారు. ఆయన రచయితగా, అనువాదకుడిగా పేరు పొందడంతో సినిమా అవకాశాలు వచ్చాయి. సినిమాలే కాక ఆయన నాగిరెడ్డితో కలసి 1947 జులైలో పిల్లల కోసం చందమామ కథల పుస్తకం ప్రారంభించారు. భారతీయుల్లో చదవడం వచ్చిన ప్రతి ఒక్కరూ చందమామ ఒక్కసారైనా చదివే ఉంటారనడంలో అతిశయోక్తి లేదు.