India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పోతన్న వైసీపీకి రాజీనామా చేసినట్లు సోమవారం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ కు దశాబ్దాల కాలంగా సేవలందించిన ఈయన, మాజీ మంత్రి పెనుమత్స కు అత్యంత విధేయుడు గా పేరొందారు. వైఎస్సార్ మరణాంతరం వైసీపీ లో చేరి తన సేవలందించారు. పార్టీ కి వ్యక్తిగత కారణాల రీత్యా రాజీనామా చేస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావుకి తన రాజీనామా లేఖను పంపారు.
నూజివీడు నియోజకవర్గం నుంచి TDPతరఫున MLAగా గెలిచిన కొలుసు పార్థసారథికి సమాచార శాఖ, గృహనిర్మాణ మంత్రి పదవి దక్కిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నియోజకవర్గానికి సోమవారం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన నూజివీడులో పార్టీ శ్రేణులు నిర్వహించి ర్యాలీలో పాల్గొన్నారు. అభిమానులు ఆయనకు CM చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫొటోలు ఇవ్వగా అవి పట్టుకొని ర్యాలీగా ముందుకుసాగారు.
రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. కేవీబీపురంలోని పేరడి గ్రామంలో సోమవారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన రవి కొడుకు మునస్వామి అక్కడికక్కడే చనిపోయారు. ఇంకొక వ్యక్తి తీవ్రంగా గాయపడటంతో అతడిని తిరుపతి ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
సార్వత్రిక ఎన్నికల్లో ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యేగా విజయం సాధించిన కనుమూరి రఘరామకృష్ణరాజు ఫ్లెక్సీ చినిగి ఉండటం కలకలం రేపింది. MLAగా గెలిచినందుకు శుభాకాంక్షలు తెలుపుతూ ఉండి మండలం చినపుల్లేరు గ్రామ శివారు తల్లమ్మ చెరువు వద్ద కొందరు నేతలు RRR ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.
ధర్మవరంలో బైకుపై వెళుతున్న కంసల లక్ష్మీనారాయణ చారి (39)ని ఆదివారం గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో అతని తలకు తీవ్రగాయాలయ్యాయి. బాధితుడిని చికిత్స కోసం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా సోమవారం సాయంత్రం మృతిచెందాడు. లక్ష్మీనారాయణ బేల్దారి పనిచేస్తూ జీవనం గడుపుతున్నాడు. మృతుడికి భార్య కొడుకు, కూతురు ఉన్నారు.
విశాఖ పోర్టు పనితీరును బీజేపీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అభినందించారు. విశాఖ పోర్టు కార్యాలయంలో పోర్టు అథారిటీ చైర్మన్ అంగముత్తుతో భేటీ అయ్యారు. పోర్ట్ అథారిటీ అత్యుత్తమ పనితీరును కనబరుస్తూ ముందుకు వెళుతుండడం విశాఖకు గర్వకారణం అన్నారు. గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో గణనీయమైన మెరుగుదలను చూపించడానికి కారణమైన పోర్టు ఛైర్మన్‌ను మాజీ ఎంపీ అభినందించారు.
కేంద్ర పౌర విమానాయన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు రేపు కడపకు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. రేపు సాయంత్రం కడప కలెక్టర్ కార్యాలయంలో ప్రధానమంత్రి కిసాన్ నిధుల విడుదల కార్యక్రమంలో కడప నుంచి ఆయన పాల్గొంటారని పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పర్యటన పూర్తి షెడ్యూల్ తెలియాల్సి ఉంది.
కృష్ణా వర్సిటీ పరిధిలో ఏప్రిల్ 2024లో నిర్వహించిన BA.LLB కోర్సు 5వ సెమిస్టర్ పరీక్షలకు(2023- 24 విద్యా సంవత్సరం) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్/ పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు జూన్ 24లోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.900 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ తెలిపింది. ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపుకై https://kru.ac.in/అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చన్నారు.
సీపీఎస్ రద్దు చేసి ఒపీఎస్ అమలు చేయాలని కోరుతూ.. మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు, విజయనగరం,MLA అతిథి గజపతికి అప్తా యూనియన్ ప్రతినిధులు వినత పత్రం అందజేశారు. సోమవారం అప్తా రాష్ట్ర అధ్యక్షుడు గణపతిరావు ఆధ్వర్యంలో పలువురు యూనియన్ ప్రతినిధులు వారిని కలిసి అభినందనలు తెలిపారు. జీఓ నంబర్ 117 రద్దు చేసి ప్రాథమిక విద్యను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
ఏలూరు జిల్లా గణపవరంలోని చర్చిలో సోమవారం బాల్య వివాహం జరుగుతుందని సమాచారం అందుకున్న అధికారులు అక్కడకు వెళ్లి అడ్డుకున్నారు. ఐసీడీఎస్ సూపర్‌వైజర్ చంద్రావతి తెలిపిన వివరాల ప్రకారం.. వీరవాసరం గ్రామానికి చెందిన 24ఏళ్ల యువకుడికి, నిడమర్రు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(17) వివాహం చేస్తున్నారు. సమాచారం రావడంతో అధికారులు వెళ్లి పెళ్లిని నిలిపివేశారు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.
Sorry, no posts matched your criteria.