India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టీడీపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన పల్లా శ్రీనివాసరావు మంత్రి నారా లోకేశ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావుతో పలు రాజకీయం అంశాలపై చర్చించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల నుంచి యువతను రాజకీయాల్లోకి స్వాగతించాలని లోకేశ్ సూచించారు. యువతతోనే సమాజంలో మార్పులు సాధ్యమవుతాయన్నారు.
రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరూరు ఆర్ఎస్ సమీపంలో చోటు చేసుకుంది. సోమవారం రైల్వే ఎస్ఐ గోపాల్ తెలిపిన వివరాల మేరకు ఆదోని మండలం పెసలబండ గ్రామానికి చెందిన సలేంద్ర ఈశ్వర్ (20) రైలుపట్టాలపై తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.
మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడితో రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత విశాఖలో భేటీ అయ్యారు. వీరిద్దరూ పలు అంశాలపై చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా పరిపాలన సాగుతుందని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని తెలిపారు. కార్యకర్తలకు తగిన గుర్తింపు లభిస్తుందని చెప్పారు.
పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలన్న చంద్రబాబు కల త్వరలోనే సఫలం కానున్నదని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన చంద్రబాబుకు సోమవారం బొలిశెట్టి శ్రీనివాస్ ఇతర ఎమ్మెల్యేలతో కలిసి స్వాగతం పలికారు. ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్ట్ సందర్శన సిద్ధాంతం పాటించడం ఆయన నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. టీడీపీ నేత వలవల బాబ్జీ తదితరులు ఉన్నారు.
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో నివాస గృహాల మధ్య గత కొంతకాలం నుంచి విచ్చలవిడిగా వ్యభిచారం జరుగుతోంది. నివాసాల గృహాల మధ్య వ్యభిచారం రోజురోజుకు పెచ్చు మీరడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆ ప్రాంతవాసులు వాపోయారు. వ్యభిచార నిర్వహించేవారు విటులను ఆకర్షించేందుకు ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకువస్తున్నారని వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించాలని ఈ ప్రాంత వాసులు కోరారు.
తిరుమలలో సెప్టెంబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జూన్ 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. 27న తిరుమల – తిరుపతి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.
కృష్ణా వర్సిటీ పరిధిలో ఏప్రిల్ 2024లో నిర్వహించిన MA, M.COM, M.HRM4వ సెమిస్టర్ పరీక్షలకు(2023- 24 విద్యా సంవత్సరం) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్/ పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు రేపు మంగళవారంలోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.900 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగ కంట్రోలర్ తెలిపారు. వివరాలకు https://kru.ac.in/వెబ్‌సైట్ చూడవచ్చన్నారు.
పోలవరం ప్రాజెక్టు వద్ద సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో సోమవారం సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాలను ఎదుర్కొందన్నారు. టీడీపీ హాయంలోనే 72% ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి చేశామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో రివర్స్ టెండరింగ్ చేపట్టి ప్రాజెక్టు పనులను నిలిపివేశారన్నారు. ప్రాజెక్టు నిర్మాణం విషయంలో జగన్ క్షమించరాని తప్పులు చేశారని మండిపడ్డారు.
మంత్రి వాసంశెట్టి సుభాశ్ మాజీ మంత్రి వేణుగోపాల్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ద్రాక్షారామలో నేడు ఆయన మాట్లాడుతూ.. వైసీపీ హయాంలో నియోజకవర్గంలో దాదాపు 100 ఎకరాల భూముల్లో అవినీతి జరిగిందని ఆరోపించారు. వాటికి సంబంధించి తమ వద్ద అన్నీ ఆధారాలు ఉన్నాయని అన్నారు. అవినీతి, అక్రమాలను తర్వలోనే బయటకు తీసి చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సెప్టెంబర్ నెల కోటాను జూన్ 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జూన్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందినవారు జూన్ 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయని తెలిపింది.
Sorry, no posts matched your criteria.