India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నూజివీడులోని YSR హార్టికల్చర్ యూనివర్సిటీలో 2ఏళ్ల ఉద్యాన పాలిటెక్నిక్ కోర్సులో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. SSC పాసైన విద్యార్థులు https://drysrhu.ap.gov.in/అధికారిక వెబ్‌సైట్‌లో జూన్ 18లోపు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ పి.విజయలక్ష్మి చెప్పారు. మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి సీట్లు భర్తీ చేస్తామని ఆమె తెలిపారు.
పీఎం కిసాన్ నిధులను కేంద్ర ప్రభుత్వం రేపు విడుదల చేయనుంది. రూ.2 వేలు చొప్పున అన్నదాతల ఖాతాల్లో జమకానున్నాయి. అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో 5 లక్షల మందికి పైగా ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. 2024-25 వ్యవసాయ సీజన్‌లో తొలి విడత పీఎం కిసాన్ సాయం కింద ఈ నిధులను ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మోదకొండమ్మ ఉత్సవాల్లో ఆరేళ్ల పాపపై అత్యాచారం ఘటనకు సంబంధించి నిందితుడిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. అతడిని ఏఎస్పీ ధీరజ్ మీడియా ముందు హాజరుపరిచారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నట్లు వెల్లడించారు. అతనిపై పోక్సో కేసు నమోదైందని, కఠిన శిక్ష పడుతుందని ఏఎస్పీ తెలిపారు. సీఐ నవీన్ కుమార్, ఎస్సై లక్ష్మణ్ పాల్గొన్నారు.
కడప నగర శివారులో సోమవారం ఆర్టీసీ బస్సు కారును ఢీకొంది. వివరాల్లోకి వెళ్తే.. ఈరోజు సాయంత్రం కడప నగర శివారులో కడప టు చెన్నై జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో కారును బస్సు ఢీకొట్టడంతో కారు ధ్వంసమైంది. దీంతో కారులోని ప్రయాణిస్తున్న కారులోనే రక్తపుమడుగులో ఇరుక్కుపోయారు. ఈ ఘటనలో ఎవరికి ఏం జరిగిందో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
లోడ్‌తో వెళ్తున్న లారీలో మంటలు వ్యాపించిన ఘటన రాజుపాలెం సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. రాజుపాలెం- బెల్లంకొండ రహదారిపై ఒక్కసారిగా లారీకి మంటలు వ్యాపించాయి. దీంతో డ్రైవరు వాహనాన్ని రోడ్డు పక్కకు ఆపారు. స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
కుందుర్పి మండలంలోని విలువల బడుల పిల్లలు 150000 సీడ్ బాల్స్ స్వయంగా చేసి నాటారు. దీనికంతటికి స్ఫూర్తి విలువల బడుల అధ్యాపకులు అవచ్చన్నారు ప్రస్తుత సమాజంలో మన వ్యవస్థలు చేయలేనీ పని మన కుందుర్పి మండలం విలువల బడుల పిల్లలు చేసి చూపించవచ్చని అధ్యాకులు లెనిన్ తెలిపారు. ఈ పిల్లలు తయారు చేసిన సీడ్ బాల్స్ మరో 3 సంవత్సరాల్లో చెట్లుగా అవ్వడం చూడవచ్చని అధ్యాపకులు పేర్కొన్నారు.
నార్మల్ డెలివరీలు పెరిగేలా చర్యలు చేపడుతున్నామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఫలితం కనబడట్లేదు. తూ.గో జిల్లాలో 100 ప్రసవాల్లో 70 సిజేరియన్ ద్వారానే జరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి.
➤ 2023-24లో మొత్తం 23,673 ప్రసవాల్లో 11,944 ఆపరేషన్లే. మాతృమరణాలు-14
☞ ప్రభుత్వ ఆసుపత్రుల్లో 7,269 మంది ప్రసవిస్తే.. 3,527 మందికి సిజేరియన్లే
☞ ప్రైవేట్‌లో 16,404 ప్రసవాలు జరిగితే.. 8,417 మందికి కడుపు కోతే.
నెల్లూరు జిల్లా కేంద్రం జిజిహెచ్‌లో మరోసారి పాము కలకలం రేపింది. జిజిహెచ్ ఆవరణలో పారిశుద్ధ్య కార్మికులు పనుల్లో నిమగ్నమై ఉండగా ఒక్కసారిగా చెట్ల మాటున దాగి ఉన్న పాము ఒక్కసారిగా రత్నమ్మ అనే పారిశుద్ధ్య కార్మికురాలిపై కాటు వేసింది. దీంతో వైద్య నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గతంలో కూడా ఇలాగే పనులు చేస్తుండగా ఓ పారిశుద్ధ్య కార్మికురాలు పాముకాటుకు మృత్యువాత పడిన విషయం తెలిసిందే.
ఐపీఎస్ అధికారి బిందు మాధవ్‌పై సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే ఆయనను విధుల్లోకి తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సమయంలో ఘర్షణ నేపథ్యంలో పల్నాడు జిల్లా ఎస్పీగా ఉన్న బిందుమాధవ్‌ను ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. దీనిపై ఆయన ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందిన ప్రభుత్వం సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్ర గిరిజన శాఖ మంత్రిగా నియమితులైన సాలూరు, MLA గుమ్మడి సంధ్యారాణి గిరిజన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సోమవారం వెలగపూడి సచివాలయం 3వ బ్లాక్ మొదట అంతస్థులో వేద పండితులు పూజలు నిర్వహించగా రాష్ట్ర స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆమె పదవీ బాధ్యతలు స్వీకారాన్ని స్వయంగా చూడటానికి సాలూరు నియోజకవర్గం నుంచి పలువురు టీడీపీ నేతలు హాజరయ్యారు.
Sorry, no posts matched your criteria.