India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నేడు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించాల్సిన స్పందన కార్యక్రమం రద్దు చేసినట్లు డీఆర్ఓ ఎం.గణపతి రావు తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న వినతుల స్వీకరణ కార్యక్రమం తాత్కాలికంగా నిలుపుదల చేశామన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిన తరువాత తదుపరి తేదీ ప్రకటిస్తామని తెలిపారు.
కర్నూలు లాంటి వెనుకబడిన ప్రాంతంలో ఉన్న రాయలసీమ వర్సిటీని అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని వైస్ ఛాన్స్‌లర్ సుధీర్ ప్రేమ్ కుమార్ ప్రకటించారు. వర్సిటీలో చదివే విద్యార్థులకు తప్పనిసరిగా ప్లేస్మెంట్ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉద్యోగులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి త్వరలో కొలిక్కి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.
అనంతపురం జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అందరూ కచ్చితంగా పాటించాలని ఎస్పీ అన్బు రాజన్ తెలిపారు.
జిల్లాలో ప్రశాంత, పారదర్శక ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా అన్ని వర్గాల ప్రజలు సహకరించాలన్నారు. ఎన్నికల్లో పోటి చేసే అభ్యర్థులు కూడా సభలు ,సమావేశాలకు ముందస్తుగా అనుమతులు పొందాలని సూచించారు. నిబంధనలు ఉల్లంగిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమం సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ తుషార్ ఆదివారం తెలిపారు. జిల్లాలో సుదూర ప్రాంతాల నుంచి నుంచి వచ్చే ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. ఏదైనా సమస్యలు వుంటే పోలీసు కంట్రోల్ రూమ్ నెంబర్ 8688831568 ఫోన్లో, వాట్స్అప్ ద్వారా తెలియజేయవచ్చన్నారు.
ఎన్నికల కంట్రోల్ రూమ్ నుంచి పంపవలసిన నివేదికలను ఎప్పటికప్పుడు వేగంగా పంపాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. ఆదివారం కంట్రోల్ రూమ్‌ను కలెక్టర్ తనిఖీ చేశారు. కంట్రోల్ రూమ్‌లో ఏర్పాటు చేసిన ఎలెక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా, సోషల్ మీడియా సెల్, 24/7 కాల్ సెంటర్, కంప్లైంట్లో మానిటరింగ్ సెల్, రిపోర్ట్ మెనేజ్మెంట్ సిస్టం విభాగాలు ఎలా పని చేస్తున్నాయని వివరాలు అడిగారు.
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో జగనన్నకు చెబుదాం (స్పందన) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. ఆదివారం కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నంత కాలం స్పందన కార్యక్రమం జరగదని తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని ప్రజలు, ఫిర్యాదుదారులు గమనించాలని అన్నారు.
ప.గో జిల్లా తణుకు మండలం పైడిపర్రులోని రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్ చేసిన వ్యక్తి ఎట్టకేలకు కిందికి దిగాడు. వేల్పూరు గ్రామానికి చెందిన యరమాటి సత్యనారాయణ ఆదివారం మధ్యాహ్నం వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. అప్రమత్తమైన పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సత్యనారాయణను కిందకు దించే ప్రయత్నం చేశారు. దాదాపు 3గంటల అనంతరం అతడు కిందికి దిగాడు.
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికలు స్వేచ్చాయుత వాతావరణంలో నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మనజీర్ జిలాని సామూన్ అన్నారు. అందులో భాగంగానే రాజకీయ పార్టీలకు చెందిన బ్యానర్లు, పోస్టర్లు, కటౌట్లు, హోర్డింగులు, జెండాలు వంటివన్నీ తొలగిస్తున్నామన్నారు. అనంతరం ఎన్నికల నియమావళికి సంబంధించిన బుక్‌లెట్‌ను వారికి అందజేశారు.
మే 13న రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగనున్న వేళ శనివారం సాయంత్రంతోనే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో YCP, TDP-JSP-BJP, కాంగ్రెస్, తదితర పార్టీల నేతలు ఇకపై క్షేత్రస్థాయిలో ప్రజల్లో తిరగనున్నారు. దీంతో ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల అభ్యర్థుల ప్రచార పర్వం ఊపందుకోనుంది. ఈసారి ఎన్నికలలో విజయమే లక్ష్యంగా అభ్యర్థులు హామీలు ఇవ్వనున్నారు.
పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద వంటి 144 సెక్షన్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల వద్ద ఎవరు గుమిగూడి ఉండొద్దన్నారు. నంద్యాల జిల్లాలో 134 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని, ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పోలీసు సిబ్బంది విధుల్లో ఉంటారన్నారు. పరీక్ష కేంద్రానికి దగ్గరలో ఎలాంటి జిరాక్స్ షాపులు తెరవకూడదని ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.