India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమం సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ తుషార్ ఆదివారం తెలిపారు. జిల్లాలో సుదూర ప్రాంతాల నుంచి నుంచి వచ్చే ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. ఏదైనా సమస్యలు వుంటే పోలీసు కంట్రోల్ రూమ్ నెంబర్ 8688831568 ఫోన్లో, వాట్స్అప్ ద్వారా తెలియజేయవచ్చన్నారు.
ఫోన్‌కు వచ్చే గుర్తింపు లేని లింకులను క్లిక్ చేసి, వాటిని ఇన్‌స్టాల్ చేసుకొని సైబర్ నేరాలకు గురికావద్దని ఎస్పీ రాధిక సూచించారు. ఈ మేరకు ఆమె ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ఏదైనా లోన్‌యాప్‌కు సంబంధించిన అప్లికేషన్‌ను డౌన్లోడ్ కోసం యాప్ అఫీషియల్ యాప్ స్టోర్ నుంచి చేసుకోవాలన్నారు. సైబర్ నేరాలపై ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అన్నారు.
కర్నూలు జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న టెన్త్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈఓ కె.శామ్యూల్ వెల్లడించారు. . విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులేకుండా తగు చర్యలు తీసుకున్నామన్నారు. మొత్తం 31,070 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, 6,020 మంది ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని చెప్పారు. 162 పరీక్షా కేంద్రాలను గుర్తించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు.
సంగం మండల కేంద్రంలోని వెంకయ్య స్వామి గుడి పక్కన ఉన్న దువ్వూరు కాలువలో ప్రమాదవశాత్తు జారిపడి ఓ వృద్దుడు మృతి చెందాడు. కాలువలో మృతదేహం ఉండటానికి గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి పంచనామాకు తరలించారు. మృతుడు సంగంకి చెందిన సూరాయిపాలెం వెంకటేశ్వర్లుగా పోలీసులు గుర్తించి, కేసు నమోదు చేశారు.
సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినందున ఎన్టీఆర్ జిల్లా సీపీ TK రాణా స్పందన కార్యక్రమ నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకున్నారు. విజయవాడలోని తన కార్యాలయంలో రేపు సోమవారం జరగవలసిన స్పందన కార్యక్రమం రద్దు చేసినట్లు ఆయన ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ప్రజానీకం, సంబంధిత అధికారులు ఈ విషయం గమనించవలసిందిగా రాణా ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.
సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినందున కలెక్టర్ రాజబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. మచిలీపట్టణం కలెక్టరేట్‌లో రేపు సోమవారం జరగవలసిన స్పందన కార్యక్రమం తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు ఆయన ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజానీకం, సంబంధిత అధికారులు ఈ విషయం గమనించవలసిందిగా కలెక్టర్ కోరారు.
ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా సేవలందించిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవలె ఆయన బీజేపీలో చేరారు. ఆదివారం ఆయన ప్రజాగళం సభలో ప్రధాని మోదీ, CBN, PKతో కలిసి వేదికను పంచుకున్నారు. దీంతో ఆయన రానున్న ఎన్నికల్లో రాజంపేట MP అభ్యర్థిగా పోటీ చేస్తారనే వార్త గట్టిగా వినిపిస్తోంది.
గుంటూరులో ఆదివారం నిర్వహించిన గ్రూప్ 1 స్క్రీనింగ్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. జిల్లాలో ఉదయం జరిగిన గ్రూప్ 1 స్క్రీనింగ్ పరీక్షలకు మొత్తం 8,785 మంది హాజరయ్యారు. 6,254 మంది గైర్హజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 8,714 మంది హాజరయ్యారు. 6,325 మంది గైర్హజరయ్యారు. ఈ పరీక్షలను జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి
పరిశీలించారు.
కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి భార్గవ్ తేజ అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల షెడ్యూలు రావడంతో ఎన్నికల సంఘం నిర్దేశించిన నియమావళిని తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. కాన్వాసింగ్, లౌడ్ స్పీకర్స్, ఊరేగింపులు, మీటింగులు, బ్యానర్లు, పోస్టర్లు, హోల్డింగుల కోసం అనుమతులకు ఆన్‌లైన్‌లో (https://suvidha.eci.gov.in) ఎలా అప్లై చేసుకోవాలో డెమో నిర్వహించి అవగాహన కల్పించారు.
సాధారణ ఎన్నికల షెడ్యూల్ విడుదలతో ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. అధికారుల ఆదేశాల మేరకు ఉమ్మడి ప.గో వ్యాప్తంగా ప్రభుత్వానికి సంబంధించిన భవనాలు, కార్యాలయాలపై ఉన్న బ్యానర్లు, ఫ్లెక్సీలను తొలగిస్తున్నారు. ఆదివారం మొగల్తూరు పంచాయతీ సిబ్బంది అధికారుల పర్యవేక్షణలో సచివాలయాల భవానాలు, బహిరంగ ప్రదేశాలలోని బ్యానర్లు, ఫ్లెక్సీలు, పార్టీల జెండాలు తొలగించారు. విగ్రహాలకు ముసుగులు వేశారు.
Sorry, no posts matched your criteria.