Andhra Pradesh

News June 17, 2024

నరసాపురం MP.. కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం రేపే

image

నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మ ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ కేంద్ర సహాయ మంత్రిగా మంగళవారం ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 11:11 గంటలకు, 12:15 గంటలకు రెండు శాఖల్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. భీమవరంలో ఉన్న ఆయన సోమవారం (నేడు) ఢిల్లీ వెళ్తున్నారు. తిరిగి 20వ తేదీన భీమవరం రానున్నారు. 

News June 17, 2024

శ్రీకాకుళం: ఆశల్నీ ఆ ఇద్దరిపైనే..!

image

వ్యవసాయం, ఆక్వా రంగాల్లో ప్రోత్సాహం, నిరుద్యోగులకు ఉపాధి లేక శ్రీకాకుళం జిల్లా నుంచి 6 లక్షల మందికిపైగా వలస వెళ్లారు. అలా అక్కడే మరణిస్తే కుటుంబ సభ్యులకు చివరిచూపు కూడా దక్కడం లేదు. కేంద్ర, రాష్ట్ర కేబినేట్‌లో రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడుకు చోటు లభించడంతో జిల్లా ప్రజలు వీరిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సిక్కోలు వ్యవసాయం, ఆక్వా రంగానికి అనుకూలంగా ఉండటంతో వీటిని అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.

News June 17, 2024

విశాఖ తీరంలో ‘తండేల్’ షూటింగ్

image

నాగచైతన్య, సాయిపల్లవి హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ‘తండేల్’ సినిమా షూటింగ్ ఉమ్మడి విశాఖలో జరుగుతోంది. ఆదివారం ఉదయం తంతడి-వాడపాలెం వద్ద సాంగ్ షూట్ చెయ్యగా.. మధ్యాహ్నం కొండకర్ల ఆవ వద్ద చేపల వేట, హీరో, హీరోయిన్ల మధ్య కొన్ని సీన్లు తీశారు. షూటింగ్ చూసేందుకు పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. షూటింగ్ విరామంలో నాగచైతన్య, సాయిపల్లవి 30 నిమిషాల పాటు దివ్యాంగులతో ముచ్చటించారు.

News June 17, 2024

నంద్యాల: చికిత్స పొందుతూ.. మాజీ ఎంపీపీ మృతి

image

పాములపాడు మాజీ ఎంపీపీ గాండ్ల లక్ష్మీదేవమ్మ ఆదివారం హైదరాబాద్ అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈనెల 9న లక్ష్మీ దేవమ్మ గృహంలో ఉదయం పూజ నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుంది. 50% గాయాలైన ఆమెను కుటుంబ సభ్యులు హైదరాబాద్ చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.

News June 17, 2024

ఉద్యోగాల పేరుతో సైబర్‌ మోసాలు: బాపట్ల SP

image

ఉద్యోగాల పేరుతో జరిగే మోసాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని బాపట్ల ఎస్పీ వకుల్‌ జిందాల్‌ అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల కొత్త తరహా సైబర్‌ మోసాలతో తక్కువ సమయంలో నగదు సంపాదించాలని నేరగాళ్లు అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. పార్ట్‌టైం ఉద్యోగాల పేరిట టెలిగ్రామ్‌‌లో లింక్ పంపి క్లిక్‌ చేయగానే రూ.లక్షల్లో నగదు వసూలు చేస్తున్నారన్నారు. హెల్ప్‌లైన్‌ నంబర్ 1930కు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు.

News June 17, 2024

పోలవరంలో దొంగనోట్ల కలకలం

image

ఏలూరు జిల్లా పోలవరంలో ఆదివారం దొంగ నోట్లు కలకలం రేపాయి. నేడు సీఎం పర్యటన నేపథ్యంలో కాఫీ హోటళ్లు, తినుబండారాల షాపులు, కిరాణా దుకాణాలు కిటకిటలాడాయి. లావాదేవీలు సమయంలో వచ్చిన కొత్తనోట్లను ఆ తర్వాత మరొకరికి ఇచ్చే సమయంలో దొంగనోట్లని తేలడంతో తాము మోసపోయినట్లు వ్యాపారులు గుర్తించారు. సుమారు ఏడుగురు వ్యాపారులు మోసపోయినట్లు గుర్తించారు.

News June 17, 2024

పల్నాడు: రైతు భరోసా కేంద్రంలో చోరీ

image

ఈపూరు మండలంలోని కొండ్రముట్ల రైతు భరోసా కేంద్రంలో గుర్తుతెలియని వ్యక్తులు శనివారం రాత్రి  రైతు భరోసా కేంద్రం తాళాలు పగులగొట్టి, కంప్యూటర్, టీవీలను చోరీ చేశారు. ఆదివారం ఉదయం అటువైపు వెళుతున్న రైతు ఒకరు రైతు భరోసా కేంద్రం తెరిచి ఉండటం చూసి వ్యవసాయశాఖ సిబ్బందికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వ్యవసాయశాఖ ఏవో రామినేని రామారావు తెలిపారు.

News June 17, 2024

అట్లూరు: ఏపీఎండీసీ డైరెక్టర్ రాజీనామా

image

రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ముడమాల బాలముని రెడ్డి ఆదివారం రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్‌కు, మేనేజింగ్ డైరెక్టర్‌కు పంపినట్లు ఆయన తెలిపారు. కూటమి అధికారంలోకి రావడంతో తమ పదవికి రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు.

News June 17, 2024

ప్రకాశం: వ్యవసాయ డిప్లమో కోర్సులకు నోటిఫికేషన్ 

image

వ్యవసాయ డిప్లమో కోర్సులకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఆచార్య రంగా వ్యవసాయ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.సంధ్యారాణి తెలిపారు. కోర్సుల్లో చేరేవారు ఈనెల 20 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుదారులు 2023 ఆగస్టు 31 నాటికి 15 సంవత్సరాల నుంచి 22 వయస్సు కలిగి ఉండాలన్నారు.

News June 17, 2024

టీడీపీలోకి వెళ్లడంపై స్పందించిన ఆలూరు ఎమ్మెల్యే

image

ఎమ్మెల్యేగా గెలిపించిన జగన్‌ను కాదని పార్టీని వీడే ప్రసక్తే లేదని ఆలూరు ఎమ్మెల్యే విరూఫాక్షి స్పష్టం చేశారు. పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. వైసీపీలో గెలిచి టీడీపీలోకి వెళ్లడానికి తన ఆత్మసాక్షి ఒప్పుకోదని పేర్కొన్నారు. పార్టీ మారుతున్నట్లు పత్రికల్లో వస్తున్న నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. వదంతులు నమ్మెుద్దని ప్రజలను కోరారు.