India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కృష్ణా జిల్లా ఆర్యవైశ్య సంఘం మహిళా విభాగం, యువజన విభాగం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం మచిలీపట్నంలో నిర్వహించారు. మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే పేర్ని నాని ఫోటో బ్యానర్‌పై కనిపించగా అదే వేదికపై పేర్ని నాని రాజకీయ ప్రత్యర్థి కొల్లు రవీంద్ర పాల్గొని ప్రసంగించారు. బ్యానర్‌లో ఒకరు, వేదికపై ఒకరిని చూసిన అక్కడున్న వారు పొలిటికల్ కామెంట్స్ చేసుకున్నారు.
విశాఖపట్నంలో జరిగిన మూడవ రాష్ట్ర సబ్ జూనియర్ బాక్సింగ్ పోటీల్లో విజయనగరం క్రీడాకారుడు బి. సచిన్ బంగారు పతాకం సాధించాడు. మార్చి 18 నుంచి 25 వరకు ఉత్తర ప్రదేశ్‌లో జరగబోయే జాతీయస్థాయి పోటీలలో ఆంధ్రప్రదేశ్ తరుఫున ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈ మేరకు ఆదివారం అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డోల మన్మథకుమార్ ఆయనకు అభినందనలు తెలిపారు. జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలని ఆకాక్షించారు.
వైసీపీ MLA అభ్యర్థుల జాబితాలో ఉమ్మడి తూ.గో జిల్లాలో నలుగురు సిట్టింగులకు టికెట్ దక్కలేదు.
☞ జగ్గంపేట సిట్టింగ్ ఎమ్మెల్యే చంటిబాబుకు ప్రత్యామ్నాయంగా తోట నరసింహం,
☞ పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబుకు కాకుండా వంగా గీత,
☞ ప్రత్తిపాడు సిట్టింగ్ ఎమ్మెల్యే పూర్ణచంద్రప్రసాద్‌కు ప్రత్యామ్నాయంగా వరుపుల సుబ్బారావు,
☞ పి.గన్నవరం సిట్టింగ్ ఎమ్మెల్యే చిట్టిబాబును పక్కనబెట్టి విప్పర్తికి టికెట్లు ఇచ్చారు.
కర్నూలు పార్లమెంటు సీపీఐ అభ్యర్థిగా రామచంద్రయ్యను ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రంలో సీఎం జగన్ ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఆదివారం కర్నూలులో సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అభ్యర్థిగా రామచంద్రయ్యను అధికారికంగా ప్రకటించారు. కార్యక్రమంలో ఆస్పరి మండల కార్యదర్శి రమేష్ పాల్గొన్నారు.
మరికొద్దిసేపట్లో గన్నవరం ఎయిర్‌పోర్టుకు ప్రధానమంత్రి మోదీ చేరుకోనున్నారు. అనంతరం అక్కడి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో ఆయన చిలకలూరిపేట మండలం బొప్పూడి సభకు చేరుకుంటారు. సభా ప్రాంగణానికి 200 మీటర్ల దూరంలోనే హెలీ ప్యాడ్ ఉంది. మోదీ సభ వద్దకు సులభతరంగా వచ్చే విధంగా ఏర్పాటు చేశారు.
నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఒడిశా రాష్ట్రానికి చెందిన 17 సంవత్సరాల యువతి ఆదివారం అనుమానాస్పదంగా మృతిచెందింది. ఫ్యాను హుక్‌కి చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు వెల్లడించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నూజివీడు ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున ఎన్నికల ప్రవర్తన నియమావళిని కఠినతరం చేయాలని కలెక్టర్ లోతేటి శివశంకర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం స్థానిక కలెక్టరేట్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు ఎన్నికల నివేదికల సమర్పణ సి.విజిల్, సువిదయాప్, తదితర అంశాలపై ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల సిబ్బందితో జాయింట్ కలెక్టర్‌తో కలిసి కలెక్టర్ సమీక్ష చేశారు.
పాయకరావుపేట మండలం వెంకటనగరం తీరంలో ఆదివారం ఉదయం చేపల వేటకు వెళ్లిన ఒక మత్స్యకారుడు, బోటు బోల్తా పడడంతో మృతి చెందాడు. రాజానగరం గ్రామానికి చెందిన గరికిన కొత్తబాబు తన కుమారుడు, మరో వ్యక్తితో కలిసి వెంకటనగరం రేవులో చేపల వేటకు వెళ్లాడు. ఆదివారం ఉదయం పడవ బోల్తా పడడంతో కొత్తబాబు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారాన్ని ఫిషరీస్ అధికారులకు తెలియజేశామన్నారు.
రాబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి ఎన్నికల కంట్రోల్ రూమ్‌ను ఆదివారం కలెక్టర్ శివశంకర్ పరిశీలించారు. ఎన్నికలకు సంబంధించిన యాప్‌లు ఏవీ ఎలా మానిటర్ చేయాలని సంబంధిత అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ విభాగంలో పనిచేసే సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండి వారికి నిర్దేశించిన ఎన్నికల విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని చెప్పారు.
అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ఆదివారం వచ్చిన ఆదాయాన్ని అధికారులు వెల్లడించారు. టికెట్లు రూపేనా రూ.3,02,300, పూజలు, విరాళాల రూపంలో రూ.88,790, ప్రసాదాల రూపంలో రూ.1,92,006, శ్రీ స్వామి వారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవోఎస్ చంద్రశేఖర్ తెలిపారు. సెలవు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకున్నారని ఆయన తెలిపారు.
Sorry, no posts matched your criteria.