Andhra Pradesh

News June 17, 2024

విశాఖ: ఏయూ వీసీకి బెదిరింపు కాల్స్

image

ఏయూ వైస్ ఛాన్స్‌లర్ పీ.వీ.జీ.డీ ప్రసాదరెడ్డికి శనివారం బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. ఈ మేరకు విశాఖలోని మూడో పట్టణ పోలీసుస్టేషన్‌తో రిజిస్ట్రార్ జేమ్స్ స్టీఫెన్ ఫిర్యాదు ఆదివారం చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి వీసీకి ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండాలని లేకుంటే ఇబ్బంది తప్పదని.. ఇక నుంచి నీ ఆటలు కొనసాగవంటూ బెదిరించినట్లు తెలిపారు. బెదిరించిన వ్యక్తికి పోలీసులు ఫోన్ చేసినట్లు సమాచారం.

News June 17, 2024

నెల్లూరు: వాళ్లకు మరోసారి ఛాన్స్ ఇస్తారా..?

image

నెల్లూరు జిల్లా పరిధిలోని గ్రామాల్లో 9,546 మంది, పట్టణ ప్రాంతాల్లో 4,063 మంది వాలంటీర్లు ఉన్నారు. ఎన్నికలకు ముందు గ్రామాల్లో 3,798 మంది, పట్టణాల్లో 941 మంది రాజీనామా చేశారు. మొత్తంగా జిల్లాలో 4,739 మంది విధుల నుంచి తప్పుకొన్నారు. వైసీపీ నేతల ఒత్తిళ్లతోనే రాజీనామా చేశామంటూ చాలా మంది వాలంటీర్లు ఏకంగా పోలీసులకే ఫిర్యాదు చేస్తున్నారు. మరి వీళ్లకు తిరిగి విధులు అప్పగిస్తారో లేదో చూడాలి మరి.

News June 17, 2024

పెద్దిరెడ్డికి హైకోర్టు నోటీసులు..!

image

YCP హయాంలో జరిగిన అక్రమాలను బయటపెట్టిన తనకు రక్షణ కల్పించాలంటూ B.కొత్తకోటకు చెందిన మాజీ జడ్జి రామకృష్ణ హైకోర్టును ఆశ్రయించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరులు తనను వేధించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. తన ఇంటిపై కూడా దాడి చేశారని చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. తన పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు పెద్దిరెడ్డి సోదరులకు నోటీసులు ఇచ్చిందని మాజీ జడ్జి వెల్లడించారు.

News June 17, 2024

విజయనగరం: పలు రైళ్లు రద్దు

image

వాల్తేరు డివిజన్ పరిధిలో పూండి-పలాస సెక్షన్‌లో భద్రతాపరమైన ఆధునీకరణ పనులు కారణంగా పలు రైళ్ళను రద్దు చేసినట్లు వాల్తేరు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కే. సందీప్ తెలిపారు. ఈనెల 17న, పలాస- విశాఖ(07471) విశాఖ పలాస(07470), విశాఖ-గుణుపూర్ (08522), గుణుపూర్-విశాఖ(08521), విశాఖ-బ్రహ్మపుర (18526) రైళ్లను, 18న బ్రహ్మపుర-విశాఖ(18525) రైలును రద్దు చేశారు. ప్రయాణికుల గమనించాలని ఓ ప్రకటనలో తెలిపారు.

News June 17, 2024

విశాఖ: హాల్ టికెట్స్ విడుదల

image

విశాఖపట్నం జిల్లాలోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలల్లో 6,7,8,9 తరగతుల్లో మిగిలి ఉన్న సీట్లు భర్తీకి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకున్న విద్యార్థులకు హాల్ టికెట్లు విడుదలయ్యాయి. హాల్ టికెట్లను https://mjpapbcwreis.apcfss.inలో  డౌన్లోడ్ చేసుకోవాలని విశాఖ జిల్లా గురుకుల పాఠశాలల కన్వీనర్ దాసరి సత్యారావు సూచించారు. 

News June 17, 2024

జిల్లా ప్రజలకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన కడప కలెక్టర్

image

సామరస్యానికి ప్రతీక అయిన కడప జిల్లా ప్రజలకు సకల శుభాలతో పాటు ఆయురారోగ్యాలు అందాలని, అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని ఆకాంక్షిస్తూ జిల్లా కలెక్టర్ విజయరామరాజు ఆదివారం ఒక ప్రకటన ద్వారా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరులకు బక్రీద్ పర్వదినం అత్యంత భక్తి, ప్రీతికరమైనదన్నారు. ఎంతో పవిత్రంగా జరుపుకునే ఈ పండుగ దానగుణానికి, త్యాగానికి ప్రతీక అన్నారు.

News June 17, 2024

హాలహర్వి: విద్యుత్ తీగలు తగిలి వివాహిత మృతి

image

హాలహర్వి మండలం గూళ్యం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. వివరాలకు వెళ్తే ఆదివారం లక్ష్మీ అనే వివాహిత పొలంలో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలడంతో అక్కడిక్కడే మృతి చెందారు. మృతురాలికి భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్త వీరేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

News June 17, 2024

ప్రకాశం జిల్లాలో నాలుగు రోజులు కరవు బృందం పర్యటన

image

రబీలో కరవు పరిస్థితిని పరిశీలించేందుకు రితేశ్ చౌహాన్ నేతృత్వంలోని కేంద్ర బృందం కరవు ప్రభావిత జిల్లాల్లో 18వతేది నుంచి 21 వరకు పర్యటించనున్నట్లు విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. 10 మంది సభ్యులు మూడు బృందాలుగా క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడతారు. ఇందులోని ఒక బృందం నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పర్యటించి పరిస్థితి తెలుసుకుంటారని ఆయన తెలిపారు.

News June 17, 2024

శ్రీకాకుళం: విద్యార్థులకు శుభవార్త చెప్పిన కేంద్ర విద్యాశాఖ

image

కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలోని స్వయం పోర్టల్‌లో 9-12 తరగతుల విద్యార్థులకు సైన్స్, గణితం తదితర సబ్జెక్టులలో ఉచిత ఆన్‌లైన్ కోర్సులు అందిస్తున్నట్లు NCERT తెలిపింది. ఈ కోర్సులు నేర్చుకునే వారు https://swayam.gov.in అధికారిక వెబ్‌సైట్‌లో సెప్టెంబర్ 1లోపు రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది. ఈ పోర్టల్‌లో కోర్సు పూర్తైన అనంతరం అసెస్‌మెంట్, సర్టిఫికేషన్ ఉంటాయని NCERT స్పష్టం చేసింది.

News June 17, 2024

CM చంద్రబాబు పోలవరం షెడ్యూల్ ఇదే

image

నేడు పోలవరంలో CM చంద్రబాబు పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి పోలవరం ప్రాజెక్ట్ సైట్‌కి 11:45 గంటలకు చేరుకుంటారు. 15 నిమిషాలు మంత్రులు, అధికారులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 12నుంచి 1:30 వరకు పోలవరం పనులను పరిశీలిస్తారు. ప్రాజెక్ట్ అతిథి గృహంలో మధ్యాహ్నం 2:05 నుండి 3:05 వరకు ప్రాజెక్ట్ నిర్మాణ పనులపై అధికారులతో సమీక్షిస్తారు. సాయంత్రం 4గంటలకు తిరిగి బయలుదేరుతారు.