India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు టచ్‌లో ఉన్న మాట వాస్తవమే కానీ.. వారిని చేర్చుకునే ప్రసక్తే లేదని విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు ఆదివారం స్పష్టం చేశారు. అద్భుతమైన పాలనను ఆంధ్ర ప్రజలు చూస్తారని ఆయన పేర్కొన్నారు. మాటల ప్రభుత్వం కాదు.. చేతల ద్వారా చూపించేది కూటమి ప్రభుత్వం అని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు బడా పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని అన్నారు.
ఉమ్మడి జిల్లా నుంచి గతంలో ఇద్దరు గిరిజన శాఖమంత్రులుగా పనిచేసినప్పటకీ పలు గిరిశిఖర గ్రామాల్లో సమస్యలు వెంటాడుతున్నాయి. తాజాగా సాలూరు ఎమ్మెల్యే సంధ్యారాణికి అవకాశం రావడంతో సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని కోరుతున్నారు. కురుపాం నియోజకవర్గంలో పూర్ణపాడు-లాబేసు వంతెన నిర్మాణం పూర్తి చెయ్యాలని, ఎస్.కోట, సాలూరు, పాలకొండ నియోజకవర్గాల్లో రోడ్లు, తాగునీటి సౌకర్యం కల్పించాలని గిరిజనులు కోరుతున్నారు.
ఒడిశా రాష్ట్రం కటక్‌లోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన జాతీయ ఫెన్సింగ్ పోటీలలో జగ్గప్పదొర కాంస్య పతకం సాధించాడు. దీనితో జగ్గప్ప అంతర్జాతీయ ఫెన్సింగ్ పోటీలకు అర్హత సాధించాడు. ఈ సందర్భంగా ఫెన్సర్ జగ్గప్పదొరను, శిక్షకులు లక్ష్మి లావణ్యను ఉమ్మడి కృష్ణా జిల్లా ఫెన్సింగ్ సంఘం సభ్యులు నాగరాజు, విజయ్ కుమార్ అభినందించారు.
త్యాగానికి, సత్యానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పర్వదినాన్ని సుఖ శాంతులతో జరుపుకోవాలని అడిషనల్ ఎస్పీ కె.నాగేశ్వరరావు సూచించారు. ఆదివారం జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి ఆయన మాట్లాడుతూ.. బక్రీద్ వేడుకలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని తెలిపారు. గోవుల అక్రమ తరలింపును అడ్డుకునేందుకు జిల్లాలో 18 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు.
వైవీయూ పరిధిలోని న్యాయ కళాశాలలో చదువుతున్న LLB (3 & 5 ఇయర్స్) విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలు విశ్వవిద్యాలయంలో జులై 1వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఎన్ ఈశ్వర్ రెడ్డి తెలిపారు. ఐదు, మూడేళ్ల LLB (రెగ్యులర్)తొలి సెమిస్టర్ పరీక్షలు 1, 3, 5, 8, 10 తేదీల్లో జరుగుతాయన్నారు. అలానే సప్లిమెంటరీ పరీక్షలు ఇదే తేదీల్లో ఉంటాయన్నారు.
వైసీపీ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖను అనారోగ్య శాఖగా మార్చారని వైద్యారోరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు. ఆయన ఆదివారం విజయవాడ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. స్థానిక మీడియాతో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీని ఆదాయ వనరులుగా మార్చేశారని మండిపడ్డారు. YCP సానుభూతిపరులు, వాళ్లకు కావాల్సిన ఆసుపత్రులకు ప్రజాధనం దోచిపెట్టారని ఆరోపించారు.
రుషికొండపై జరిగిన విధ్వంసం విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలని భీమిలి జనసేన ఇన్‌ఛార్జ్ చేసిన ట్వీట్‌కు నిర్మాత ఎస్కేఎన్ రిప్లై ఇచ్చారు. ‘టూరిజం డెవలప్ చెయ్యడానికో, పాన్ ఇండియా సినిమా షూటింగ్‌ల కోసమో ఇవి కట్టి ఉంటారు సందీప్. వాటిని లీజు, అద్దెలకు ఇస్తే వచ్చే ఆదాయం ద్వారా ఏపీని డెవలప్ చెయ్యాలని ప్లాన్ చేసుంటారు.. అర్థం చేసుకోరు’ అని స్మైలీ ఎమోజీని జోడించారు.
సచివాలయ భవనానికి నెలల తరబడి అద్దె చెల్లించకపోవడంతో యజమాని తాళం వేసిన ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలో వెలుగు చూసింది. వాసిలి గ్రామంలో ఐదేళ్లుగా సచివాలయాన్ని అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. గతంలో అద్దె చెల్లించాలని యజమాని అడగగా.. వైసీపీ నాయకులు చెల్లిస్తామంటూ ముందుకు వచ్చారు. ఇటీవల అద్దె అడగగా.. తమకు సంబంధం లేదని వైసీపీ నాయకులు తప్పుకున్నారు. దీంతో యజమాని సచివాలయానికి తాళం వేశారు.
విశాఖ నగర పరిధిలో 26 కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన యూపీఏస్సీ ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 9,735 మంది హాజరు కావలసి ఉండగా, 4,677 మంది పరీక్షకు హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ మల్లికార్జున వి.ఎస్.కృష్ణ కళాశాల, గాయత్రి కళాశాలలో ఏర్పాటుచేసిన పరీక్ష కేంద్రాలను సందర్శించారు. జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్ పరీక్షల నిర్వహణను పర్యవేక్షించారు.
భీమవరం పట్టణంలో జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ సభ్యుల సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి కేరళకు చెందిన రికేశ్ శర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు పట్టణానికి చెందిన పేరుచర్ల కృష్ణంరాజు 152 రకాల స్వీట్లు, పచ్చళ్ళు, బిరియానీలు, ఫ్రూట్స్‌తో విందు ఏర్పాటుచేశారు. దీంతో శర్మ వంటకాలు చూసి ఆశ్చర్యానికి గురయ్యారు.
Sorry, no posts matched your criteria.