India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంతపురానికి చెందిన జాహ్నవి విజయవాడ శివారు గూడవల్లిలో గుండెపోటుతో మృతిచెందింది. ఈ మేరకు పటమట సీఐ మోహన్ రెడ్డి వెల్లడించారు. జాహ్నవి చదువు నిమిత్తం గూడవల్లి వెళ్లింది. శనివారం అనుమానస్పద స్థితిలో మృతి చెంది ఉండటంతో మృతదేహాన్ని పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. పోస్టుమార్టం చేసిన వైద్యులు.. జాహ్నవి గుండెపోటుతో మృతిచెందినట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.
అన్న క్యాంటీన్లను మూడు వారాల్లో పునరుద్ధరిస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. వెగలపూడి రాష్ట్ర సచివాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేవలం రూ.5లకే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రికి భోజనం అందజేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
విశాఖ అప్పుఘర్ బీచ్ సమీపంలో ఆత్మహత్యకు పాల్పడుతున్న యువకుడిని ఎంవీపీ పోలీసులు కాపాడారు. భీమిలి మండలం ఉప్పాడకు చెందిన 30 ఏళ్ళ యువకుడు కుటుంబ కలహాలతో ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. గమనించిన పోలీసులు యువకుడిని కాపాడి.. కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం కుటుంబ సభ్యులకు అతనిని అప్పగించారు. ప్రాణాలు కాపాడిన పోలీసులకు వారు ధన్యవాదాలు తెలిపారు.
వచ్చేనెల 1వ తేదీ నుంచి దేశంలో కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి రానున్నాయని జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ మెట్ట మల్లేశ్వరరావు అన్నారు. జిల్లా కోర్టులో ప్రాసిక్యూషన్ కార్యాలయంలో ఆయన పీపీలతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. కొత్త చట్టాలపై భారతీయ న్యాయ సంహిత, భారతీయ సాక్షి అధినీయం, భారతీయ నాగరిక సురక్ష సంహిత మొదలైన కొత్త క్రిమినల్ చట్టాలపై అవగాహన కల్పించారు.
బేతంచెర్ల వైష్ణవ పుణ్యక్షేత్రమైన మద్దిలేటి ఆలయంలోని కోనేరులో ఈతకు వెళ్లిన ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. గద్వాల మండలం వడ్డేపల్లికి చెందిన కురువ మహేశ్ (34) అనే వ్యక్తి మద్దిలేటి స్వామి దర్శనం కోసం శనివారం మద్దిలేటి స్వామి ఆలయానికి వచ్చారు. ఈ రోజు10 గంటల సమయంలో కోనేరులో ఈతకు వెళ్లాడు. గుంత ఉండడంతో అందులో మునిగి కనిపించలేదు. ఆదివారం ఉదయం మృతదేహం బయటపడింది.
నాన్నే తన హీరో అని అంటున్నారు మలికిపురం మండలం మట్టపర్రుకు చెందిన సినీ దర్శకుడు సుకుమార్. గ్రామానికి చెందిన బండ్రెడ్డి తిరుపతి రావునాయుడికి సుకుమార్‌తో పాటు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. కాగా ఆయన జ్ఞాపకార్థం తోబుట్టువులతో వారు రూ.15లక్షల వ్యయంతో ప్రభుత్వ పాఠశాలలో అదనపు తరగతి భవనం నిర్మించారు. తండ్రి బాధ్యతే పిల్లలను మంచివైపు నడిపిస్తుందని ఓ మూవీ విడుదల సందర్భంగా చెప్పారు.
☛ నేడు FATHERS డే
తిరుపతిలో 2023 సెప్టెంబర్‌లో జరిగిన చోరీ కేసులో ఈస్ట్ CIని A2గా చేర్చి కేసు ఫైల్ చేయాలని తిరుపతి 2వ మున్సిఫ్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అప్పట్లో TDP అధినేత చంద్రబాబు, లోకేశ్ ఫొటోలతో ఉన్న 36 గ్రాముల బంగారు ఉంగరాన్ని టి.జయరామిరెడ్డి ఓ రెస్టారెంట్‌లో పోగొట్టుకున్నారు. దీనిపై కేసు ఫైల్ చేయకపోగా నిందితుడ్ని వదిలేశారు. బాధితుడు కోర్టులో ప్రైవేట్ కేసు వేయడంతో.. జడ్జీ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు.
సింహగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి సోదరి పైడితల్లమ్మ ఉత్సవం మంగళవారం (18 వతేదీన) నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 6 గంటల వరకే సింహాద్రి అప్పన్న దర్శనానికి అవకాశం లభిస్తుందని ఈవో శ్రీనివాసమూర్తి వెల్లడించారు. బుధవారం యథావిధిగా ఉదయం ఆరున్నర గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పించినట్లు ఆయన వివరించారు. ఈ విషయాన్ని భక్తులు గుర్తించాలని కోరారు.
ఖాజీపేట సెక్షన్‌లో 3వ లైన్ పనులు జరుగుతున్నందున విజయవాడ మీదుగా ప్రయాణించే నం.20803, నం.20804 విశాఖ-గాంధీధామ్ ట్రైన్లు ప్రయాణించే మార్గాన్ని మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ట్రైన్‌లు జూన్ 23 నుంచి జూలై 4 మధ్య విజయవాడ-విశాఖపట్నం మీదుగా కాక విజయనగరం-రాయగడ గుండా ఈ ట్రైన్ నాగ్‌పూర్ చేరుకుంటుందన్నారు. ఆయా తేదీల్లో ఈ ట్రైన్‌లకు విజయవాడ, ఏలూరు, రాజమండ్రి తదితర స్టేషన్లలో స్టాప్ లేదన్నారు.
మండలంలోని శివాపురం సమీపంలో మామిడితోట ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ టిప్పర్ ప్రమాదవశాత్తు చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా, త్రిపురాంతకం మండలం ఎండ్లూరివారిపాలెం చెందిన లక్ష్మయ్య(45) గ్రామ సమీపంలోని ఇటుకల మట్టిని టిప్పర్ సాయంతో వినుకొండలో అన్లోడ్ చేసి తిరిగి వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పారు.
Sorry, no posts matched your criteria.