Andhra Pradesh

News June 16, 2024

చేజెర్ల: అటవీ భూములు ఖాళీ చేయాలి

image

చేజర్ల మండలంలోని ఆదూరుపల్లి కూడలిలో పెంచలకోన రహదారి వెంట అటవీ భూములు ఆక్రమించిన వారు వెంటనే ఖాళీ చేయాలని సంబంధిత అధికారులు సూచించారు. ఆక్రమించిన అటవీ భూముల నుంచి నాలుగు రోజుల్లో ఖాళీ చేయాలని అధికారులు ఆక్రమణదారులకు సూచించారు. వైదొలగని ప్రదేశాలను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. రెవెన్యూ, అటవీ శాఖతో సర్వే జరిపి హద్దులు ఏర్పాటు చేస్తామన్నారు.

News June 16, 2024

ప.గో: బ్యాటరీని మింగిలిన చిన్నారి.. సేఫ్

image

ప.గో జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన 11నెలల పాప ఆడుకుంటూ శనివారం మధ్యాహ్నం పొరపాటున ఓ బొమ్మలోని చిన్న బ్యాటరీని మింగేసింది. తల్లి వెంటనే గుర్తించి స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి విజయవాడకు తీసుకెళ్లాలని సూచించారు. హుటాహుటిన విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు శస్త్రచికిత్స అవసరం లేకుండా ఎండోస్కోపీ ద్వారా బ్యాటరీని జాగ్రత్తగా బయటకు తీశారు.

News June 16, 2024

కడప: ఐటీఐలో ప్రవేశాలకు 19 నుంచి కౌన్సెలింగ్

image

ఐటీఐ ప్రవేశాలకు 19 నుంచి 21వ తేదీ వరకు కడప ప్రభుత్వ మైనార్టీ ఐటీఐ కళాశాలల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల జిల్లా కన్వీనర్, మైనార్టీ ఐటీఐ ప్రధానాచార్యులు జ్ఞాన కుమార్ తెలిపారు. 19న ఉదయం 9 గంటలకు 10 జీపీఏ నుంచి 7.4 జీపీఏ వరకు, 20న 7.3 జీపీఏ నుంచి 5.7, 21న 5.6 జీపీఏ నుంచి 3 జీపీఏ వరకు వారికి కౌన్సెలింగ్ జరుగుతుందని తెలిపారు.

News June 16, 2024

భీమవరం: ఉరేసుకొని వివాహిత ఆత్మహత్య

image

భీమవరం మండలం వెంపకు చెందిన లక్ష్మీదుర్గ(33) శనివారం ఆత్మహత్య చేసుకుంది. ఈమెకు పాశర్లపూడికి చెందిన CISF కానిస్టేబుల్ దుర్గామహేశ్‌తో 2014లో పెళ్లి జరిగింది. లక్ష్మీదుర్గ కాలేజ్‌లో ల్యాబ్ అసిస్టెంట్‌. ఇద్దరు పిల్లలు. విభేదాల వల్ల దంపతులు దూరంగా ఉంటుండగా.. ఈనెల 13న తండ్రి ఆమెను అత్తవారింట్లో అప్పగించి వచ్చారు. చెన్నైలో ఉంటున్న భర్త వద్దకు వెళ్లడం ఇష్టంలేక లక్ష్మీదుర్గ ఉరేసుకొని మృతి చెందింది.

News June 16, 2024

తిరుపతి: 578 కేసులు.. రూ.12.93 లక్షల జరిమానా

image

విద్యుత్తు అక్రమ వినియోగంపై ఎస్పీడీసీఎల్ తిరుపతి సర్కిల్ పరిధిలో అధికారులు శుక్రవారం రాత్రి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాడులు నిర్వహించారు. ఎనిమిది డివిజన్ల పరిధిలో 3,095 సర్వీసులు తనిఖీ చేసి.. అక్రమంగా విద్యుత్తు వాడుతున్న 578 మంది సర్వీసుదారులపై కేసులు నమోదు చేశారు. రూ.12.93 లక్షల జరిమానా విధించామని ఉన్నతాధికారులు తెలిపారు.

News June 16, 2024

చిత్తూరు: తగ్గుతున్న తోతాపురి మామిడి ధరలు

image

చిత్తూరు జిల్లాలో తోతాపురి మామిడి ధరలు క్రమేపి తగ్గుతున్నాయి. గత నాలుగురోజుల్లో టన్ను రూ. 27 వేల నుంచి శనివారానికి రూ.22 వేలకు పడిపోయింది. సీజన్ ప్రారంభంలో టన్ను కాయలు రూ.27 వేలకు అమ్ముడుపోయాయి. వ్యాపారస్తులు సిండికేట్ గా మారి ధరలు తగ్గింపుకు కారణం అవుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం మామిడి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.

News June 16, 2024

కర్నూలు పెద్దాసుపత్రిలో మురుగు.. రోగుల అవస్థలు

image

కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మాతాశిశు విభాగం ఎదుట మురుగు చేరడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెలల తరబడి మురుగు తిష్ట వేయడంతో దోమలు బెడదతో అల్లాడిపోతున్నట్లు రోగులు వాపోతున్నారు. దీని పక్కనే రోగులకు ఆహారం అందిస్తున్నా మురుగును అరికట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News June 16, 2024

ఆరేళ్ల బాలికపై అత్యాచారం.. నిందితుడి అరెస్ట్

image

రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(6)పై ఈ నెల 11న అత్యాచారానికి పాల్పడిన చెక్కా బాలురెడ్డి(45)ని అరెస్ట్ చేసినట్లు SI అప్పలరాజు తెలిపారు. ఆరేళ్ల పాపకు పనస పండ్లు ఇస్తానని తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడన్నారు. అదే సమయంలో బాలిక తల్లిదండ్రులు రావడంతో పరారయ్యాడని, RTC కాంప్లెక్స్‌లో పట్టుబడిన బాలురెడ్డిని శనివారం అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకు పంపినట్లు తెలిపారు.

News June 16, 2024

నెల్లూరు: ఫాదర్స్ డే స్పెషల్.. PIC OF THE DAY

image

ఫాదర్స్ డేను పురస్కరించుకుని ఒక చిన్నారి కళ్లజోడుపై తల్లిదండ్రుల చిత్రాన్ని గీచారు. సైదాపురం మండలంలోని ఓరుపల్లికి చెందిన రమేశ్ కుమారుడు లోహిత్ గిద్దలూరు హైస్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నాడు. బాలుడు చిన్నప్పటి నుంచి చిత్రాలు గీస్తున్నాడు. ఈ క్రమంలో ఫాదర్స్ డే సందర్భంగా కళ్లజోడుపై తల్లిదండ్రుల చిత్రాలను గీశాడు. వాటిని చూసి పలువురు అభినందిస్తున్నారు.

News June 16, 2024

శ్రీకాకుళం: ఈ నెల 16 నుంచి చేపల వేట ప్రారంభం

image

సముద్రంలో చేపలు గుడ్లు పెట్టే సమయంలో రెండు నెలల పాటు చేపల వేటను నిషేధించిన సంగతి తెలిసిందే. గడువు ముగియడంతో ఈ నెల 16వ తేదీ నుంచి మళ్లీ సముద్రంలో వేట ప్రారంభించేందుకు శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం, ఎచ్చెర్ల మండలాల మత్స్యకారులు సిద్ధమవుతున్నారు. వలలు, బోట్ల మరమ్మతుల పనుల్లో వారంతా నిమగ్నమయ్యారు.