Andhra Pradesh

News June 16, 2024

గుంటూరులో వ్యభిచార గృహాలపై దాడి

image

వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ మహిళపై శనివారం నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు మల్లారెడ్డి నగర్‌లో ఓ మహిళ తన ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తుందని వచ్చిన సమాచారంతో, శనివారం నగరంపాలెం సీఐ మధుసూదనరావు సిబ్బందితో తనిఖీలు చేశారు. తనిఖీల్లో అయిదుగురు మహిళలను అదుపులోకి తీసుకొని పునరావాస కేంద్రానికి తరలించారు.

News June 16, 2024

కృష్ణా: ఫార్మసీ విద్యార్థులకు అలర్ట్

image

కృష్ణా వర్సిటీ పరిధిలో ఏప్రిల్ 2024లో నిర్వహించిన బీ-ఫార్మసీ 1వ సెమిస్టర్ పరీక్షలకు(2023- 24 విద్యా సంవత్సరం) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్/ పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు జూన్ 22వ తేదీలోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.1,000 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగ కంట్రోలర్ తెలిపారు. వివరాలకు https://kru.ac.in/ వెబ్‌సైట్ చూడవచ్చన్నారు.

News June 16, 2024

సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్షలకు సర్వం సిద్ధం: అనంత కలెక్టర్

image

అనంతపురం జిల్లాలో సివిల్ సర్వీసెస్ పరీక్షలు-2024ను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి సర్వం సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని ట్రెజరీలో ఉన్న ప్రశ్న పత్రాలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ను ఆయన పరిశీలించారు. జూన్ 16వ తేదీన 9:30 నుంచి 11:30 గంటల వరకు పేపర్-1 పరీక్ష, 2:30 గంటల నుంచి 4:30 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

News June 16, 2024

శ్రీవారి భక్తులకు ముఖ్య సమాచారం

image

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల సెప్టెంబర్ నెల కోటాను జూన్ 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జూన్ 18 నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. 21న ఆర్జిత సేవా, 22న‌ అంగప్రదక్షిణం టోకెన్లు, 24న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల చేస్తారు.

News June 16, 2024

ఈ నెల 19న కర్నూలు జిల్లాకు కేంద్ర కరవు బృందం రాక

image

ఈనెల 19, 20వ తేదీల్లో కేంద్ర కరువు బృందం కర్నూలు జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు తెలిపారు. అధికారులందరూ కరవు బృందానికి కరవు తీవ్రత విషయాలను వివరంగా తెలియజేయాలని సూచించారు . ఈ సందర్భంగా ఆయన అధికారులతో సమీక్షించారు. క్షేత్రస్థాయిలో పర్యటించే కరువు బృందానికి తీవ్రత తెలియజేసే ఫోటోలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు అధికారులు ఏర్పాటు చేసుకోవాలన్నారు.

News June 16, 2024

జంతు సంరక్షణ చట్టాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు: బాపట్ల ఎస్పీ

image

జంతు సంరక్షణ చట్టాలను ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. జూన్ 17న బక్రీద్ పండగ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పటిష్ట భద్రత చర్యలు తీసుకోవాలని ఎస్పీ పోలీస్ అధికారులను ఆదేశించారు. జంతువులను చట్టవిరుద్ధంగా వధించడాన్ని అరికట్టడానికి, జంతు సంరక్షణ చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాలని, నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

News June 16, 2024

కడప: ప్రతిభ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

image

భారతదేశ ప్రభుత్వం, హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో 2025 రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా క్రీడలతో పాటు ఇతర రంగాల్లో ప్రత్యేకమైన ప్రతిభ కనబరిచిన వారికి ప్రతిభా అవార్డులు అందజేయనున్నట్లు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కె. జగన్నాథరెడ్డి తెలిపారు. కళలు, విద్య, స్పోర్ట్స్, మెడిసిన్, సోషల్ వర్క్, సివిల్ సర్వీసెస్ తదితర రంగాల్లో రాణించిన వారు జూలై 15వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News June 16, 2024

శ్రీకాకుళం: ఈ నెల 18 నుంచి 22 వరకు మధ్యవర్తిత్వ శిక్షణ

image

శ్రీకాకుళం జిల్లా కోర్టు కాన్ఫరెన్స్ హాల్లో జూన్ 18 నుంచి 22 వరకు మధ్య వర్తిత్వంపై శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా తెలిపారు. శ్రీకాకుళం కోర్టు హాలులో శనివారం న్యాయవాదులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈనెల 18న ఉదయం 9.00 నుండి 9.30 వరకు శిక్షణ జరుగుతుందని పేర్కొన్నారు. ఈ శిక్షణకు న్యాయవాద మధ్యవర్తులు పాల్గొనేలా చూడాలని ఆయన సూచించారు.

News June 16, 2024

కోనసీమ: అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండ.. నిందితులు అరెస్ట్

image

కె.గంగవరం మండలం యర్రపోతవరంలో అంబేడ్కర్ విగ్రహంపై దుశ్చర్యకు పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు SI జానీబాషా తెలిపారు. గ్రామానికి చెందిన పిల్లి రాంబాబు, కోరుకొండ స్వామినాయుడు ఇరిగేషన్ లాకుల వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం ఎడమ చేతికి చెప్పుల దండ వేసి వర్గాల మధ్య విభేదాలు సృష్టించే విధంగా బోర్డు వేలాడదీశారన్నారు . విప్పర్తి సత్యనారాయణ అనే వ్యక్తి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు.

News June 16, 2024

మంత్రి నారాయణను కలిసిన ఎంపీ వేమిరెడ్డి

image

మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణకి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శనివారం నెల్లూరులోని నారాయణ స్వగృహానికి చేరుకున్న వేమిరెడ్డి దంపతులు.. ఆయనకి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఉన్నారు.