India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అత్యుత్తమ రాజధానిగా అమరావతిని నిర్మిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. శనివారం చింతారెడ్డిపాలెంలోని నారాయణ మెడికల్ కాలేజీ ఆవరణలోని ఆయన నివాసంలో పాత్రికేయులతో మాట్లాడారు. రెండున్నర ఏళ్లలోనే రాజధాని అమరావతిని పూర్తి చేసేందుకు పక్కా ప్రణాళికను రూపొందిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు.
కొయ్యూరు మండలం చీడిపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న వట్టి కాలువ సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. శనివారం స్థానికులు వట్టి కాలువ వైపు వెళ్లగా అక్కడ ఉన్న చెట్టుకు ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం వేలాడుతూ కనిపించింది. దీంతో ఆందోళన చెందిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
జూన్ 17న బక్రీద్ పండుగ సందర్భంగా ఇరు మత పెద్దలతో ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ సమావేశమయ్యారు. భక్తి భావం, త్యాగం, ఐక్యతకు ప్రతీకగా నిలిచిన బక్రీద్ పండుగను కులమతాలకు అతీతంగా, సామరస్యంగా, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఒకరికొకరు సహకరించుకుంటూ పండుగ జరుపుకుంటామని హిందూ, ముస్లిం మత పెద్దలు ప్రమాణం చేశారు. గోవధ చట్టాలను అనుసరించి పండగ చేసుకోవాలని కోరారు.
జూన్ 17 వరకు వారాంతపు సెలవులు ఉండడంతో శనివారం కూడా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. అన్ని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లు, కల్యాణ వేదిక వరకు బయట క్యూ లైన్లు యాత్రికులతో నిండిపోయాయి. గురువారం నుంచి యాత్రికుల తాకిడి తగ్గలేదు, సోమవారం కూడా సెలవు దినం కావడంతో భక్తుల రద్దీ కొనసాగనుంది. శ్రీవారి సేవకుల సహకారంతో క్యూ లైన్లలో భక్తులకు అన్నప్రసాదం, తాగునీటిని టీటీడీ నిరంతరాయంగా అందిస్తున్నారు.
రాజాం మండలం గడ్డిముడిదాం గ్రామానికి చెందిన గురయ్యా అతని భార్య పిల్లలు గత కొంతకాలం నుంచి అతడికి దూరంగా ఉంటున్నారు. దీంతో అతడు మనస్తాపం చెంది శనివారం ఎవరు లేని సమయంలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ దాడి మోహన్ రావు తెలిపారు.
ఓడిపోయినా జగన్ రెడ్డికి ఇంకా బుద్ధి రాలేదని విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జి అన్నారు. పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవి బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఐదు హామీలను అమలు చేస్తూ సంతకాలు చేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారన్నారు. జగన్ రెడ్డిని ప్రజలు వ్యతిరేకించినా ఆయనలో పశ్చాత్తాపం కనిపించలేదన్నారు.
నిండ్ర మండలం నిండ్ర ఉన్నత పాఠశాలలో శనివారం విషాదం చోటుచేసుకుంది. పాఠశాలలో పనిచేస్తున్న గణిత ఉపాధ్యాయుడు సురేష్ బాబు గుండెపోటుతో పాఠశాలలోనే కుప్పకూలాడు. వెంటనే సమీప ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు సురేష్ బాబు మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
తోటపాలెం జంక్షన్ సమీపంలో శుక్రవారం ఓ గుర్తుతెలియని మృతదేహం లభ్యమయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుని మెడలో కేబుల్ వైర్లు ఉండడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతుని శరీరంపై రెండు చోట్ల కుమారీ, గంగా పేర్లతో పచ్చబొట్లు ఉన్నట్లు వారు తెలిపారు. వివరాలు తెలిసిన వారు తమను సంప్రదించాలన్నారు.
మార్కాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ పదవికి పానుగంటి మురళి శనివారం రాజీనామా చేశారు.
ఆయన తన రాజీనామా లేఖను యార్డ్ సెక్రెటరీ కోటేశ్వరరావుకు అందజేశారు. పానుగంటి మురళితో పాటు మరో ఐదుగురు డైరెక్టర్లు కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. అలాగే యార్డు ఛైర్మన్‌తో పాటు రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవులకు డాక్టర్ మీర్జా షంషీర్ ఆలీబేగ్ ఇటీవలే రాజీనామా చేశారు.
రాయలసీమలో హైకోర్టు కానీ, హైకోర్టు బెంచి కానీ ఏర్పాటు చేయాలని ఏపీసీసీ మీడియా ఛైర్మన్ డా.తులసి రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. వేంపల్లెలో ఆయన మాట్లాడుతూ.. 1937 నాటి శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాజధాని, హైకోర్టు రెండింటిలో ఒకదానిని రాయలసీమలో ఏర్పాటు చేయాలన్నారు. ఈ ఒప్పందాన్ని అనుసరించి 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు రాజధాని రాయలసీమ, హైకోర్టు కోస్తాలో ఏర్పాటు చేశారన్నారు.
Sorry, no posts matched your criteria.