Andhra Pradesh

News June 15, 2024

SVU డిగ్రీ సెమిస్టర్ పరీక్ష వాయిదా

image

శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఈనెల 12వ తేదీ నుంచి డిగ్రీ 2, 4 సెమిస్టర్ రెగ్యులర్/ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 18వ తేదీ జరగాల్సిన పరీక్షను జలై 9వ తేదీకి పోస్ట్ పోన్ చేసినట్లు పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. 18వ తేదీ UGC NET ఎగ్జామ్ జరుగుతున్న కారణంగా వాయిదా వేసినట్లు వెల్లడించారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News June 15, 2024

గన్నవరం ఎయిర్‌పోర్ట్ భద్రత CISFకి అప్పగించిన AAI

image

గన్నవరం ఎయిర్‌పోర్ట్ భద్రత బాధ్యతలను ఇకపై CISF (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) పర్యవేక్షించనుంది. ఈ మేరకు విమానాశ్రయ డైరెక్టర్ ఎం.లక్ష్మీకాంత రెడ్డి రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు. ఎయిర్‌పోర్ట్ అధారిటీ ఆఫ్ ఇండియా(AAI) ఆదేశాల మేరకు విమానాశ్రయ భద్రత బాధ్యతలు జూలై 2 నుంచి CISF ఆధీనంలో ఉంటాయని లక్ష్మీకాంత రెడ్డి స్పష్టం చేశారు.

News June 15, 2024

కాకినాడ: హోప్ ఐలాండ్‌పై ఆశలు

image

కాకినాడ జిల్లా తాళ్లరేపు మండలం కోరింగ పంచాయతీ పరిధిలో ఉండే హోప్ ఐలాండ్‌ను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ప్రాంతాన్ని 1998లో వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం పరిధిలోకి తెచ్చారు. అయితే ఈ సుందర ప్రదేశానికి ఒకప్పుడు పర్యాటకులు పోటెత్తేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మరి పర్యాటక శాఖ మన నిడదవోలు MLAకే కట్టబెట్టడంతో కచ్చితంగా అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తమవుతోంది.

News June 15, 2024

చిత్తూరు:18న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక: కలెక్టర్

image

ఈ నెల 18న చిత్తూరు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం కలెక్టరేట్‌లోని నూతన సమావేశం మందిరంలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.షన్మోహన్ శనివారం తెలిపారు. ఉదయం 10 గంటలకు ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ప్రారంభమవుతుందని జిల్లాకు చెందిన ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News June 15, 2024

శ్రీకాకుళం: అధికారులకు మంత్రి అచ్చెన్న కీలక సూచనలు

image

వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్న సచివాలయంలో ఆ శాఖ ఉన్నతాధికారులతో శనివారం సమావేశమయ్యారు. ఈ నెల 18న అర్హులైన రైతులకు PM కిసాన్ లబ్ధి జమ కానున్నందున అధికారులకు అచ్చెన్న పలు సూచనలు చేశారు. సమావేశంలో అచ్చెన్న మాట్లాడుతూ.. ఖరీఫ్ సీజన్‌లో రైతులకు ఎరువులు, విత్తనాలు కొరత రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అందుబాటులో ఉంచాలన్నారు.

News June 15, 2024

శ్రీకాకుళం: స్పెషల్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల

image

ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో ఏప్రిల్- 2024లో జరిగిన MSC 2వ సెమిస్టర్ స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఫిజిక్స్, గణితం, స్టాటిస్టిక్స్, హ్యూమన్ జెనెటిక్స్, న్యూక్లియర్ ఫిజిక్స్, జియో ఫిజిక్స్ తదితర కోర్సులకు నిర్వహించిన స్పెషల్ పరీక్షల నేడు ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలకై విద్యార్థులు యూనివర్శిటీ అధికారిక వెబ్‌సైట్ https://results.andhrauniversity.edu.in/ చూడవచ్చు.

News June 15, 2024

చిత్తూరు: లారీ ఢీకొని ఒకరు స్పాట్ డెడ్

image

చిత్తూరు జిల్లా వీకోట మండల పరిధిలోని దాసర్లపల్లి-కుప్పం రహదారిలో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ఘటన శనివారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనాదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి, మరిన్ని వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.

News June 15, 2024

కాకినాడ: ఏడాకుల చెట్లు తొలగించాలని మంత్రికి లేఖ

image

రాష్ట్రంలో పర్యావరణానికి హానికరంగా ఉన్న కోనోకార్పస్, ఏడాకుల చెట్లను తొలగించి వేప మొక్కలు నాటించాలని పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్‌కు పౌర సంక్షేమ సంఘం శనివారం రిజిస్టర్డ్ లేఖ పంపింది. రోగ నిరోధక శక్తి తగ్గిన వారికి ఏడాకుల చెట్ల వలన తీవ్ర అనారోగ్యం కలిగే అవకాశం ఉందని అందులో పేర్కొంది. కాకినాడ నగరంలో 35 వేల కోనోకార్పస్ వృక్షాలు, 150 ఏడాకుల చెట్లు ఉన్నాయన్నారు. 

News June 15, 2024

చిత్తూరు: అక్రమంగా జంతువులను తరలిస్తే చర్యలు: కలెక్టర్

image

శాంతియుత వాతావరణంలో బక్రీద్ పండుగను జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ షన్మోహన్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన చిత్తూరులో మాట్లాడారు. జిల్లా బక్రీద్ పండుగను పురస్కరించుకొని జంతువులను వధించిన, అక్రమంగా తరలించినా వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పశుసంవర్ధక శాఖ ద్వారా పంచాయతీ స్థాయిలో జంతు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

News June 15, 2024

SKLM: పాలిటెక్నిక్ మొదటి విడత సీట్ల కేటాయింపు ఎలా

image

పాలిటెక్నిక్ మొదటి విడత సీట్ల కేటాయింపు ముగిసింది. కళాశాలల వారీగా జరిగిన ప్రవేశాలు పరిశీలిస్తే SKLM ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 297 సీట్లకు 268, SKLM ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌లో 99 సీట్లకు 94, ఆమదాలవలస పాలిటెక్నిక్‌లో 132కి 127, టెక్కలి ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో 118కి 98, సీతంపేటలో 108కి 31, టెక్కలి ఐతం పాలిటెక్నిక్‌లో 462కి 361, ఎచ్చెర్ల వెంకటేశ్వర 462కి 340, మందికి‌ ప్రవేశాలు జరిగాయి.