India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టెక్కలి ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడి ఎదుట అనేక సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన అనేక అంశాలు ఇప్పుడు అచ్చెన్నకు సవాల్‌గా మారాయి. నియోజకవర్గంలో ఆఫ్ షోర్ రిజర్వాయర్, త్రాగునీరు, సాగునీరు, జిల్లా ఆసుపత్రిలో వైద్యం, ప్రభుత్వ స్థలాల ఆక్రమణ, ఎత్తిపోతల పథకాలు, హుద్ హుద్ ఇళ్ల పంపిణీ, మార్కెట్ దుకాణాలు సముదాయాలు పంపిణీ, మినీస్టేడియం సమస్యలున్నాయి.
తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, ప్రాణహాని ఉందని దేవరపల్లి మండలం గౌరీపట్నంలోని నిర్మలగిరి డైరెక్టర్ జాన్ పీటర్ భయాందోళన వ్యక్తం చేశారు. కొందరు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, ఇటీవల శ్రీకాంత్ అనే వ్యక్తి ఫోన్ చేసి రూ.10లక్షలు ఇవ్వాలని బెదిరించినట్లు తెలిపారు. డబ్బులు ఇవ్వకుంటే హానికర చర్యలకు పాల్పడతానని, పుణ్యక్షేత్రంపై అసత్య వీడియోలు బయటపెడతానని బెదిరిస్తున్నారని పీటర్ వెల్లడించారు.
కర్నూలు వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం పంట ఉత్పత్తుల ధరల వివరాలు ఇలా ఉన్నాయి. మార్కెట్‌కు 104 క్వింటాళ్ల వేరుశనక్కాయల దిగుబడులు రాగా.. క్వింటా కనిష్ఠ ధర రూ.4,929, మధ్యస్థ ధర రూ.6,371, గరిష్ఠ ధర రూ.7,200 పలికింది. 318 క్వింటాళ్ల వాము దిగుబడులు రాగా.. క్వింటా కనిష్ఠ ధర రూ.711, మధ్యస్థ ధర రూ.17,501, గరిష్ఠ ధర రూ.20,160 పలికినట్లు మార్కెట్ అధికారులు వెల్లడించారు.
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. 1998 నుంచి 2014 వరకు కాంగ్రెస్ నుంచి ఒంగోలు ఎంపీగా పోటీచేసి 3 సార్లు గెలిచారు. ఆ తర్వాత టీడీపీలో చేరి ఎంపీగా ఓటమి చెందారు. 2019లో వైసీపీ తరఫున గెలిచారు. మళ్లీ 2024లో టీడీపీలో చేరి పోటీ చేసి గెలిచి మూడు పార్టీల తరఫున గెలిచిన ఏకైక ఎంపీగా ఆయన రికార్డ్ సాధించారు.
జిల్లాలోని తాటిపూడిలో ఉన్న ఏపీ బాలికల గురుకుల పాఠశాలలో గెస్ట్ టీచర్(పీజీటీ)గా నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ జె.ఎన్.సంధ్యాభార్గవి తెలిపారు. జూన్ 19 లోగా అర్హులైన మహిళా అభ్యర్థులు ఇంగ్లీషు, గణితం, భౌతిక శాస్త్రం సబ్జెక్టుల్లో పోస్టులకు అప్లై చేసుకోవాలన్నారు. PG, BED విద్యార్హత కలిగి బోధనలో అనుభవం ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
కడప నగరంలోని ఒక జ్యువెలరీ షోరూమ్‌ను సినీ హీరోయిన్ నిధి అగర్వాల్, కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి కలిసి శనివారం ప్రారంభించారు. జువెలరీ ప్రధాన రహదారికి ఇరువైపులా నిధి అగర్వాల్‌ను చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అభిమానులకు, వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు కార్యక్రమానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
అనంతపురంలో శుక్రవారం పట్టపగలే చోరీ జరిగింది. అయితే గంటల వ్యవధిలోనే పోలీసులు ఆ కేసును ఛేదించారు. డీఎస్పీ ప్రతాప్ అందించిన వివరాల మేరకు.. భవానీ నగర్‌కు చెందిన చంద్రశేఖర్ రెడ్డి ఇంట్లో ఖాజాపీర్ 30 తులాల బంగారు నగలు, రూ.50 వేల నగదును దొంగలించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితుడిని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి నగలు, నగదు స్వాధీనం చేసుకున్నారు.
మైదుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా
పుట్టా సుధాకర యాదవ్ గెలుపొందటంతో తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి మొక్కులు తీర్చుకొనేందుకు శనివారం జీవి సత్రం నుంచి టీడీపీ మండల అధ్యక్షుడు భీమయ్య ,యువ నేత కిశోర్ పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు రామచంద్రనాయుడు జెండా ఊపి ప్రారంభించారు. పాదయాత్రలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు .
కర్నూలు రాయలసీమ విశ్వవిద్యాలయం నాలుగో స్నాతకోత్సవం పలు కారణాలతో వాయిదా పడింది. ఈ మేరకు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ సుధీర్ ప్రేమ్‌కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని కాన్వకేషన్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు గమనించాలని కోరారు.
రాజమండ్రి సిటీలో ఇద్దరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. శంభూనగర్ ఫ్లై ఓవర్ కింద శనివారం ఉదయం ఇద్దరు వ్యక్తులు మృతి చెంది ఉండటంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. రెండో పట్టణ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. వీరిద్దరూ సోదరులని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.