Andhra Pradesh

News June 15, 2024

విజయవాడ: రేపే UPSC పరీక్ష .. ఏర్పాట్లు పూర్తి

image

ఈ నెల 16వ తేది ఆదివారం UPSC పరీక్ష నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ ఢిల్లీరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ..నగరంలోని 25పరీక్షా కేంద్రాలలో ఈ పరీక్ష జరుగుతుందన్నారు. విజయవాడలోని పరీక్షా కేంద్రంలో మెత్తం 11,112మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు చెప్పారు. ఉదయం 9.30నుంచి 11.30గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30నుంచి 4.30వరకు పేపర్-2 పరీక్ష ఉంటుందన్నారు.

News June 15, 2024

బాపట్ల: ఈనెల 21 వరకు రైల్వే గేట్ మూసివేత

image

బాపట్ల మండలం వెదుళ్ళపల్లి గ్రామంలోని పూల మార్కెట్ వద్ద గల రైల్వే గేట్ ఈనెల 21 వరకు మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే ట్రాక్ మరమ్మతుల నిమిత్తం నేటి నుంచి 21వ తేదీ వరకు రైల్వే గేట్ నుంచి రాకపోకలు నిలిపివేయడం జరుగుతుందన్నారు. కావున ప్రజలు ఈ విషయాన్ని గమనించి స్టువర్టుపురం గేటు నుంచి రాకపోకలు సాగించాలని సూచించారు.

News June 15, 2024

ఏయూ వీసీపై చర్యలు తప్పవు: టీడీపీ రాష్ట్ర కార్యదర్శి

image

ఏయూ వీసీ ప్రసాద్ రెడ్డి అక్రమాలపై కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆరేటి. మహేశ్ అన్నారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. ఏయూలో అరాచక పాలనకు ముగింపు పలుకుతామన్నారు. ప్రజాస్వామ్య వాతావరణం నెలకొల్పే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఏయూ వీసీ 200 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ గెస్ట్ ఫ్యాకల్టీలను తొలగించారని అన్నారు.

News June 15, 2024

కడప: నిరుద్యోగ యువతకు ట్యాలీలో ఉచిత శిక్షణ

image

ఉన్నతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ట్యాలీ కోర్సులో ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఫౌండేషన్ అడ్మిషన్ కోఆర్డినేటర్ హరిప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. టెన్త్ పాస్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా పాస్ లేదా ఫెయిల్ అయిన 18 నుంచి 26 సంవత్సరాల మధ్య వయసు గలవారు అర్హులని తెలిపారు. 35 రోజుల శిక్షణా కాలంలో కంప్యూటర్ స్కిల్, స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పుతామన్నారు.

News June 15, 2024

తిరుపతిలో యువకుడు దారుణ హత్య

image

తిరుపతి: అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆటోనగర్‌లోని ఓఆయిల్ షాపు వద్ద ఓ వ్యక్తిని గొంతుకోసి హత్య చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. మృతుడు ముంగిలిపట్టుకు చెందిన మాదం ప్రసాద్‌గా గుర్తించారు. మద్యంమత్తులో గుర్తుతెలియని వ్యక్తులు ప్రసాద్‌తో శుక్రవారం రాత్రి 2 గంటల వరకు గొడవపడి, వెంటబడి హత్య చేసినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ఈస్ట్ డీఎస్పీ రవిమనోహరచారి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

News June 15, 2024

సూళ్లూరుపేట: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

image

రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నెల్లూరు నుంచి చెన్నై వెళ్లే మెమో రైలును సూళ్లూరుపేట రైల్వే స్టేషన్లో ఎక్కుతూ ఓ వ్యక్తి జారిపడ్డాడు. అతనికి తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని వయస్సు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని, కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

News June 15, 2024

అలుగోలులో విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

image

నెల్లిమర్ల మండలం అలుగోలు గ్రామ పంచాయతీలో కెల్ల అప్పలనాయుడు (65) శనివారం ఉదయం విద్యుత్ షాక్‌తో మృతిచెందాడు. శుక్రవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షానికి విద్యుత్ వైర్లు తెగి పడ్డాయి. ఉదయం ఆవులకు పాలు తీసేందుకు బయలుదేరిన అప్పలనాయుడు చీకట్లో వైర్లను గమనించలేదు. ఈ క్రమంలో ఒక వైర్ అతని ఛాతిని తాకడంతో విద్యుత్ షాక్‌తో అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనపై ఎస్సై గణేశ్ కేసు నమోదుచేసుకున్నారు.

News June 15, 2024

మెగా డీఎస్సీ: ప.గో@400.. ఏలూరు@800..!

image

CMగా చంద్రబాబు ‘మెగా డీఎస్సీ’పై సంతకం చేయడంతో అభ్యర్థులు మళ్లీ పుస్తకాలు పడుతున్నారు. ఎలాగైనా కొలువుకొట్టాలని కోచింగ్‌ల కోసం పట్టణాల బాట పడుతున్నారు. మొత్తం 16వేలకు పైగా పోస్టులు భర్తీ చేయనుండగా..
➤ ప.గో జిల్లాలో 400లకు పైగా పోస్టుల భర్తీకి ఛాన్స్ ఉంది. ఇక్కడ దాదాపు 13వేల మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు.
➤ ఏలూరు జిల్లాలో సుమారు 800 పోస్టుల భర్తీకి అవకాశం ఉండగా.. 10,500మంది వేచి చూస్తున్నారు.

News June 15, 2024

కర్నూలు: జత పొట్టేళ్ల ధర రూ.1.10 లక్షలు

image

ముస్లింల బక్రీద్‌ పండగ పురస్కరించుకొని పొట్టేళ్లకు భలే గిరాకీ ఏర్పడింది. ధరలు ఒక్కసారిగా అధికమయ్యాయి. ఆదోని సంతలో శుక్రవారం జత పొట్టేళ్ల ధర ఏకంగా రూ.1.10 లక్షలు పలికింది. వీటిని ఆదోని పట్టణం మేతర్‌ మసీదు ప్రాంతానికి చెందిన ఖాజా, ఖురేషి ఇబ్రహీం కొనుగోలు చేశారు.

News June 15, 2024

గొట్టిపాటి రవికుమార్ పర్యటనలో జేబు దొంగల చేతివాటం

image

విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శుక్రవారం అద్దంకి పట్టణానికి తొలిసారి రావటంతో పాతబస్టాండ్ సెంటర్‌లో రద్దీ ఏర్పడింది. ఇందులో జేబుదొంగలు చేతివాటం చూపించారు. సుమారు 10 మంది వద్ద నుంచి రూ.15 లక్షల వరకు కాజేసినట్లు ఆరోపించారు. అయితే స్థానికులు ఓ దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతను దర్శికి చెందిన వాడిగా అనుమానిస్తున్నారు.