India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎంకే దత్తారెడ్డి (122) వీర విహారం చేయడంతో సౌత్‌జోన్ అంతర్ జిల్లా అండర్-23 క్రికెట్ పోటీల్లో అనంతపురం జట్టు శుభారంభం చేసింది. శుక్రవారం అనంత క్రీడా గ్రామంలో ప్రారంభమైన వన్‌డే పోటీలో నెల్లూరు జట్టును 39 పరుగుల తేడాతో ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన అనంత జట్టు దత్తారెడ్డి శతకంతో 25 ఓవర్లలో 9 వికెట్లకు 214 పరుగుల భారీ స్కోరు సాధించింది. నెల్లూరు జట్టు 23.4 ఓవర్లలో 175 పరుగులకు ఆలౌటైంది.
పిఠాపురం మండలం భోగాపురంలో ప్రసాద్ అనే వ్యక్తి హత్యకు గురైన విషయం<<13436940>> తెలిసిందే.<<>> ఈ కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు. ప్రసాద్(48), పద్మరాజు కాకినాడలో పనికి వెళ్లేవారు. డబ్బుల విషయంలో వీరి మధ్య గొడవ జరగ్గా.. ఇవ్వకపోతే చంపేస్తానని ప్రసాద్ పద్మరాజును బెదిరించాడు. కోపం పెంచుకున్న పద్మరాజు.. ఆలయం ముందు నిద్రించిన ప్రసాద్‌ను బండరాయితో మోది హతమార్చాడు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
యాక్షన్ కింగ్, ప్రముఖ నటుడు అర్జున్ కుమార్తె ఐశ్వర్య రిసెప్షన్ వేడుకలు ఘనంగా జరిగాయి. తమిళ హాస్యనటుడు, దర్శకుడు తంబి రామయ్య కుమారుడైన ఉమాపతి రామయ్యతో ఐశ్వర్య పెళ్లయిన విషయం తెలిసిందే. శుక్రవారం చెన్నైలోని ఓ ప్యాలెస్‌లో వీరి రిసెప్షన్ జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఆర్కే రోజా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
సామాజిక పెన్షన్‌లు పెంచుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల విశాఖ జిల్లాలో 1,65,432 మంది లబ్ధి పొందనున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. పెన్షన్ పెంపు వల్ల ప్రతినెల అదనంగా రూ.21.27 కోట్లు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. కాగా ఈ పథకాన్ని ఇకపై ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌గా ప్రభుత్వం మార్పు చేసింది. విశాఖ జిల్లాలో 16 రకాల పెన్షన్ దారులు ఉన్నట్లు తెలిపారు.
ఎచ్చెర్ల మండలంలోని తోటపాలెం పంచాయితీ దుప్పలవలసకు చెందిన ఇద్దరిపై శుక్రవారం ఎచ్చెర్ల పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. తనపై ఇద్దరు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఓ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఆ ఫిర్యాదులో తన తల్లి పేరును కూడా చేర్చడం గమనార్హం. పోలీసులు కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.
నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పారుమంచాలకు చెందిన ధర్మారెడ్డిని టీటీడీ ఈవో పదవి నుంచి తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో YCPకి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనను తొలగిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ధర్మారెడ్డిని ఇటీవలే సీఎస్ నీరభ్ కుమార్ సెలవులపై పంపారు.
విజయవాడకు మెట్రో రైలు ప్రాజెక్టుపై మరోసారి చర్చ మొదలైంది. కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో లైట్ మెట్రో రైల్ ప్రాజెక్టుపై ఆశలు చిగురిస్తున్నాయి. గతంలోనే తుది డీపీఆర్ సిద్ధమైనా, వైసీపీ ప్రభుత్వం సమీక్ష చేయకపోవడంతో మూలన పడింది. రాజధాని మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులపై కొత్త ప్రభుత్వం సమీక్ష సందర్భంగా ఇది కూడా చర్చకు వస్తుందని అంతా భావిస్తున్నారు.
ఇటీవల ఓపెన్ స్కూల్ పరీక్షల్లో అలసత్వం ప్రదర్శించిన ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కావలి పరీక్ష కేంద్రంలో వీరు ఇన్విజలేర్లుగా పనిచేశారు. వీరి సస్పెన్షన్ చర్చనీయాంశంగా మారింది.
బక్రీద్ పండుగ సందర్భంగా గుంటూరు మిర్చి మార్కెట్ యార్డుకు వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. శని, ఆదివారాలు సాధారణ సెలవులతో పాటు సోమవారం బక్రీద్ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించిందని మిర్చి యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి ఐ వెంకటేశ్వరరెడ్డి శుక్రవారం తెలిపారు. యార్డులో 18 నుంచి యథావిధిగా క్రయ విక్రయాలు కొనసాగుతాయని ఆయన తెలిపారు.
విద్యార్థులకు పుస్తకాలు తక్కువ వస్తే ఎంఈఓలు ప్రతిపాదనలు పంపాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.అనురాధ సూచించారు. శుక్రవారం ప్రొద్దుటూరు అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్లోని స్టూడెంట్ కిట్ మండల స్థాయి స్టాక్ పాయింట్‌ను డీఈఓ, కడప డిప్యూటీ డీఈఓ రాజగోపాల్ రెడ్డి పరిశీలించారు. డీఈఓ మాట్లాడుతూ.. 8, 9 తరగతులకు కొరత ఉన్న పుస్తకాల మంగళవారం వస్తాయన్నారు. త్వరగా విద్యార్థులకు స్టూడెంట్ కిట్లను పంపిణీ చేయాలన్నారు.
Sorry, no posts matched your criteria.