India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పాయకరావుపేట ఎమ్మెల్యే అనితకు హోంశాఖ కేటాయించి ఉత్తరాంధ్రకు సీఎం చంద్రబాబు ప్రత్యేక గుర్తింపు ఇచ్చారు. ఈ ప్రాంతం వారికి హోంశాఖ రావడం ఇది రెండోసారి కావడం విశేషం. గతంలో ఎన్టీఆర్ కేబినేట్‌లో ప్రస్తుత చీపురుపల్లి టీడీపీ ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు హోంమంత్రిగా పనిచేశారు. నాడు ఆయన ప్రాతినిధ్యం వహించిన ఉణుకూరు నేడు రాజాం నియోజకవర్గంలో భాగమైంది.
శ్రీశైలం దేవస్థానంలో స్వామి అమ్మవార్లకు ఆలయ ఈవో పెద్దిరాజు ఆధ్వర్యంలో ఊయలసేవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. లోక కల్యాణాన్ని ఆకాంక్షిస్తూ విశేషంగా ప్రతి శుక్రవారం రోజు పౌర్ణమి , మూలానక్షత్రం రోజులలో స్వామి, అమ్మవార్లకు ఊయలసేవ కార్యక్రమం దేవస్థానం సేవగా నిర్వహిస్తారు. శ్రీస్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలు నిర్వహించి భక్తులకు దర్మనం కల్పిస్తారు.
కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలైన శెట్టూరు, కుందుర్పి, కళ్యాణదుర్గం మండలాల్లో శనివారం అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ పర్యటించనున్నారు. పైన తెలిపిన మండలాల్లో జరిగిన పలు రకాల ఉపాధిహామీ పనుల నాణ్యత, అవకతవకలపై పరిశీలించనున్నారు. కావున సంబంధిత విభాగాలకు చెందిన అధికారులు తప్పక హాజరు కావాలని అధికారులు తెలిపారు.
అంతర్జాతీయ రక్త దాతల దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ చేతుల మీదుగా గుమ్మగట్ట, రాయదుర్గానికి చెందిన యువకులు అవార్డులు అందుకున్నారు. అత్యధికసార్లు రక్తదానం చేయడమేకాక విస్తృతంగా రక్తదాన శిబిరాలు నిర్వహించినందుకు గుమ్మగట్ట ఎం.జి వీరన్న, రాయదుర్గం హరికృష్ణలు ఈ అవార్డులకు ఎంపికయ్యారు. వారికి కలెక్టర్ ఆవార్డులు అంజేసి అభినందించారు.
హైరిస్క్ కేసుల్ని ముందుగానే గుర్తించి పైస్థాయి ఆసుపత్రులకు చెకప్, కాన్పుకు పంపేందుకు ఆరోగ్య కార్యకర్తలు, డాక్టర్లు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఆదేశించారు. డెలివరీ అయిన స్త్రీని కనీసం 5 రోజులు తప్పనిసరిగా ఆసుపత్రిలోనే ఉంచాలన్నారు. హైరిస్క్ గర్భిణీలకు ఈసీజీ, 2డీ ఎకో పరీక్షలు 8 నుంచి 9 నెలల మధ్యలో చేయాలని చెప్పారు. మాతృ మరణాల నివారణపై శుక్రవారం కలెక్టర్ సమీక్షించారు.
విశాఖపట్నం నుంచి కడప వయా తుని, అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, అనపర్తి, ద్వారపూడి, రాజమండ్రి మీదుగా వెళ్తున్న తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలు నంబర్‌ను రైల్వే అధికారులు మార్పు చేశారు. ప్రస్తుతం 17487/ 17488 నంబర్లపై రైలు నడుస్తుండగా, జూలై నెల 1వ తేదీ నుంచి 18521/ 18532 నంబర్లగా రైల్వే అధికారులు మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మార్పును రైల్వే ప్రయాణికులు గమనించాలన్నారు. ☛ SHARE IT
విజయవాడ మీదుగా ప్రయాణించే హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ నెంబర్లను మార్చినట్లు సదరన్ రైల్వే తెలిపింది. ఈ మేరకు నం.12503 బెంగుళూరు కంటోన్మెంట్ – అగర్తల హమ్‌సఫర్ ట్రైన్‌కు 15673 నెంబరు, నం.12504 అగర్తలా- బెంగుళూరు కంటోన్మెంట్ హమ్‌సఫర్ ట్రైన్‌కు 15674 నెంబరు కేటాయించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు గమనించాలని కోరుతూ ఈ మేరకు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.
శ్రీకాకుళం రోడ్, పలాస మీదుగా ప్రయాణించే హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ నెంబర్లను మార్చినట్లు సదరన్ రైల్వే తెలిపింది. ఈ మేరకు బెంగుళూరు కంటోన్మెంట్ – అగర్తల హమ్‌సఫర్ ట్రైన్‌కు నం.12503 బదులు 15673 నెంబరు, అగర్తల- బెంగుళూరు కంటోన్మెంట్ ట్రైన్‌కు 12504 బదులు 15674 నంబరు కేటాయించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు గమనించాలని కోరుతూ ఈ మేరకు తాజాగా విషయాన్ని వెల్లడించారు.
ఏలూరు ఈ నెల 17వ తేదీన బక్రీద్ పండుగ నేపథ్యంలో ముస్లిం సోదరులకు ఎస్పీ మేరీ ప్రశాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రధాన మసీదులు, ఈద్గాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటుచేయనున్నట్లు వెల్లడించారు. మతపెద్దలతో సమావేశమై మత సామరస్యాన్ని కాపాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలన్నారు. పోలీసు అధికారులు ముస్లిం పెద్దలతో సమావేశాలు ఏర్పాటుచేసి అవగాహన కల్పించాలన్నారు.
తిరుపతి జిల్లాలో ఈనెల 16న ఆదివారం UPSC సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షలు జరగనున్నాయి. సంబంధిత ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. తిరుపతి జిల్లాలో ఈ పరీక్షలకు 11 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 5,518 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారని వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.