Andhra Pradesh

News June 14, 2024

కుటుంబ సభ్యులతో చంద్రబాబును కలిసిన అనిత

image

సీఎం చంద్రబాబును అమరావతి సచివాలయంలో హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత కుటుంబ సభ్యులతో మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై నమ్మకంతో హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. హోమ్ మినిస్టర్‌గా బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహిస్తానన్నారు. నమ్మకం నిలబెట్టుకుంటానని చంద్రబాబుకు ఈ సందర్బంగా తెలిపారు.

News June 14, 2024

తూ.గో.: రేపటి నుంచి వేట షురూ

image

చేపల సంతానోత్పత్తి, మత్స్య సంపద వృద్ధి లక్ష్యంగా సముద్రంలో 2 నెలల పాటు అమలుచేసిన చేపల వేట నిషేధం శుక్రవారం అర్ధరాత్రితో ముగియనుంది. దీంతో శనివారం నుంచి వేట షురూ కానుంది. ఏప్రిల్ 14 నుంచి వేట నిషేధం ప్రకటించారు. కాకినాడ జిల్లాలో తొండంగి నుంచి తాళ్ళరేవు వరకు 94 కిలోమీటర్ల మేర సాగర తీరం విస్తరించి ఉంది. జిల్లాలో 1,95,184 మంది మత్స్యకారుల్లో 36,101 మంది సముద్రంలో వేట ద్వారా ఉపాధి పొందుతున్నారు.

News June 14, 2024

ఐదేళ్లు ఈవోగా కొనసాగిన ధర్మారెడ్డి

image

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టీటీడీ EOగా ఏవీ ధర్మారెడ్డిని నియమించారు. ఆయన రక్షణ శాఖకు చెందిన ఉద్యోగి. జగన్ సీఎం అయిన తర్వాత ధర్మారెడ్డిని డిప్యూటేషన్ మీద రాష్ట్రానికి తీసుకు వచ్చి మరి ఈవో పోస్టు అప్పగించారు. ప్రభుత్వం మారడంతో ఆయనపై వేటు పడింది. ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న శ్యామలరావును నూతన ఈవోగా నియమించింది.

News June 14, 2024

శ్రీకాకుళం: పలు పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల

image

ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో డిసెంబర్-2023లో జరిగిన బీపీఈడీ, ఎంపీఈడీ 3వ సెమిస్టర్ పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఫలితాలు చెక్ చేసుకోవాలని ఆంధ్రా యూనివర్సిటీ వర్గాలు సూచించాయి. ఫలితాలకై విద్యార్థులు యూనివర్శిటీ అధికారిక వెబ్‌సైట్ https://results.andhrauniversity.edu.in/లో చూడొచ్చు.

News June 14, 2024

దువ్వూరు: తప్పిపోయిన అబ్బాయి ఆచూకీ లభ్యం

image

దువ్వూరు మండలం గుడిపాడుకు చెందిన గురివిరెడ్డి కుమారుడు గురు మాధవరెడ్డి బుధవారం సాయంత్రం వారి ఇంట్లో వారికి చెప్పకుండా బయటకు వెళ్లి రెండు రోజులుగా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అబ్బాయి ఆర్లగడ్డలో ఉన్నాడని తెలుసుకొని పోలీసులు శుక్రవారం ఎస్సై శ్రీనివాసులు సమక్షంలో తల్లిదండ్రులకు అబ్బాయిని అప్పగించారు.

News June 14, 2024

దొనకొండ మండలంలో దొంగతనం

image

దొనకొండ మండలంలోని చిన్న గుడిపాడులో గురువారం రాత్రి దొంగతనం జరిగింది. గ్రామానికి చెందిన చౌదల కృష్ణారెడ్డి ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి బీరువా పగలగొట్టి అందులో ఉన్న రూ.50 వేల నగదు, బంగారు గొలుసు అపహరించారు. ఈ ఘటనపై శుక్రవారం దొనకొండ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఏఎస్సై శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News June 14, 2024

అన్ని లెక్కలు బయటకు తీస్తాం.. పేదలకు న్యాయం చేస్తాం: పరిటాల సునీత

image

గత ఐదేళ్లలో పేదల ఇళ్ల మాటున కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి చేసిన అవినీతి లెక్కలను బయటకు తీస్తామని ఆమె పేర్కొన్నారు. శుక్రవారం ఆమె క్యాంప్ కార్యాలయంలో పంచాయతీరాజ్, గృహ నిర్మాణ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. పంచాయతీ రాజ్ అధికారులతో సమావేశమై నియోజకవర్గంలో నిధులు ఉండి పనులు చేయని రోడ్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

News June 14, 2024

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిసిన పెమ్మసాని

image

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రపతిని కలవడం తాను గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన ‘X’ వేదికగా చెప్పారు. పెమ్మసానితో పాటు కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా రాష్ట్రపతిని కలిశారు.

News June 14, 2024

కాణిపాకం: ముగ్గురు యువకుల మృతి

image

చిత్తూరు జిల్లాలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాణిపాకం నుంచి బంగారుపాలేనికి బైకుపై వెళ్తున్న ముగ్గురు యువకులను ఇరువారం జంక్షన్ వద్ద లారీ ఢీకొట్టింది. సంక్రాంతిపల్లెకు చెందిన ముగ్గురు యువకులు చనిపోయారు. లారీ రాంగ్ రూట్లో రావడంతోనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. మృతదేహాలను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై తాలూకా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News June 14, 2024

DSC అభ్యర్థులకు కొలికపూడి గుడ్‌ న్యూస్

image

టీడీపీ ప్రభుత్వం మెగా DSC నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో ఆ పార్టీ MLA కొలికపూడి శ్రీనివాస్ DSC అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. DSCకి ప్రిపేర్ అయ్యేవారికి తిరువూరులో ఉచిత కోచింగ్ ఇస్తామని ఆయన తాజాగా తన అధికారిక FB ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ శిక్షణకు రాష్ట్రంలో ఉండే ఎవ్వరైనా రావొచ్చని కొలికపూడి చెప్పారు. కాగా గతంలో కొలికపూడి తన KS రావు అకాడమీ ద్వారా పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చిన విషయం తెలిసిందే.