India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హైదరాబాద్‌లో వ్యభిచార ముఠా పోలీసులకు దొరికింది. విజయవాడకు చెందిన సూర్యకుమారి HYD మధురానగర్‌లో ఉంటోంది. అక్కడే ఆమెకు తిరుపతికి చెందిన విజయశేఖర్ రెడ్డి పరిచయమయ్యాడు. అతను కస్టమర్ల డేటా యాప్‌లో ఉంచుతాడు. యువతులకు డబ్బు ఆశ చూపి వాళ్లని వేణుగోపాల్ బాలాజీ(తిరుపతి) సహకారంతో కస్టమర్లు చెప్పిన హోటళ్లకు తీసుకెళ్లేవాడు. సూర్యకుమారి డబ్బులు తీసుకునేది. నిన్న పంజాగుట్టలోని ఓ హోటల్లో సోదాలు చేయగా దొరికిపోయారు.
ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా సత్రాగచ్చి- చెన్నై సెంట్రల్ (నం.06006) మధ్య వన్ వే స్పెషల్ ట్రైన్ నడపనున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే(ECOR) తెలిపింది. ఈ ట్రైన్ ఆదివారం ఉదయం 7.50 గంటలకు విజయవాడ చేరుకుంటుందని, మధ్యాహ్నం 3.30 గంటలకు చెన్నై చేరుకుంటుందని పేర్కొంది. ఏపీలో ఈ ట్రైన్ విజయవాడతో పాటు గూడూరు, నెల్లూరు, ఒంగోలు స్టేషన్లలో ఆగుతుందని ECOR తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.
ట్రాఫిక్ మెయింటెనెన్స్ పనుల కారణంగా రద్దు చేసిన కింది రైళ్లను యథావిధిగా నడుపుతామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు విజయవాడ డివిజన్ రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. రైలు నం.07630 తెనాలి- విజయవాడ, నం.07629 విజయవాడ- తెనాలి నం.07781 విజయవాడ-మాచర్ల నం.07782 మాచర్ల- విజయవాడ.
త్వరలో మేయర్‌ను కూడా దించేస్తామని టీడీపీ దక్షిణ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ సీతంరాజు సుధాకర్ అన్నారు. శుక్రవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొందరు అత్యంత అవినీతి పరులుగా వ్యవహరించారని, కొన్ని సాంకేతిక మార్పులు చేశాక.. మేయర్ మార్పులు జరుగుతాయని అన్నారు. జగన్ ఐదేళ్లలో రాష్ట్రం ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం చేశారని ఆయన విమర్శించారు.
వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక 2019లో కొత్తగా ప్రవేశ పెట్టిన గిరిజన సంక్షేమశాఖ వరుసగా మూడోసారి మన్యం జిల్లాకి వరించింది. YCP హయాంలో కురుపాం MLA పాముల పుష్పశ్రీవాణి, సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ఈ శాఖలకు మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం సాలూరు ఎమ్మెల్యే గుమ్మిడి సంధ్యారాణికి శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖను కేటాయించారు. దీంతో జిల్లాలో సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబు మంత్రివర్గంలో సొంత సామాజికవర్గానికి చెందిన 15 మందికి అవకాశం కల్పించారని కొన్ని ఛానళ్లలో వస్తున్న కథనాలు పూర్తిగా ఫేక్ అని మంత్రి అచ్చెన్న ట్వీట్ చేశారు. ఏపీ ప్రజలు వైసీపీని 11 మంది ఎమ్మెల్యేలకు పరిమితం చేసినా జగన్‌కు సిగ్గు రాలేదని ట్విటర్(X) వేదికగా ఫైరయ్యారు. 15 మంది కమ్మ కులానికి చెందిన మంత్రులంటూ మళ్లీ ఫేక్ ప్రచారం మొదలెట్టారంటూ దుయ్యబట్టారు.
లక్కిరెడ్డిపల్లిలో 20 రోజుల కిందట అదృశ్యమైన చిన్నకొండు సుదర్శన్ (34) గురువారం పాలెం గొల్లపల్లి అటవీ ప్రాంతంలో శవమై కనిపించాడు. స్థానికుల వివరాల మేరకు.. పాలెం గొల్లపల్లి గ్రామం బురుజు పల్లికి చెందిన చిన్నకొండ సుదర్శన్ 20 రోజుల కిందట కనిపించకుండా పొయ్యి గురువారం పాలెం గొల్లపల్లి అటవీ ప్రాంతంలో చెట్టుకు శవమై వేలాడుతూ కనిపించాడు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు ఈనెల 17వ తేదీన జిల్లాకు వస్తున్నట్లు ఎంపీ కార్యాలయం నుంచి ప్రకటనలో తెలిపారు. ఆరోజు మధ్యాహ్నం 4 గంటలకు శ్రీకాకుళం ఆర్చి, డే&నైట్ కూడలి, 7 రోడ్లు జంక్షన్, సూర్యమహల్ జంక్షన్, అరసవల్లి జంక్షన్, 80 అడుగుల రోడ్డులో ఉన్న ఎంపీ కార్యాలయంకి ర్యాలీగా వెళ్తారు. అచ్చెన్నాయుడు సాయంత్రం 5 గంటలకు MP కార్యాలయం నుండి పెద్దపాడు మీదుగా నిమ్మాడ చేరుకుంటారు.
TTD ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్‌లో కాంట్రాక్ట్ పద్ధతిలో వివిధ ఉద్యోగాలకు శనివారం ఉదయం 10 గంటలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ కార్యాలయం పేర్కొంది. పీడియాట్రిక్ అసోసియేట్& అసిస్టెంట్, పీడియాట్రిక్ ఇంటెన్స్ విస్ట్ , అసిస్టెంట్ అనస్తీషియా మొత్తం 4 పోస్టులు ఉన్నట్లు తెలియజేశారు. అర్హత, ఇతర వివరాలకు https://www.tirumala.org/ వెబ్‌సైట్ చూడాలన్నారు.
నారా లోకేశ్ మరోసారి ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. చంద్రబాబు మానసపుత్రికైన అమరావతిలో ఐటీ రంగానికి పెద్దపీట వేయనున్నారు. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో కంపెనీలు తీసుకొచ్చి, ఐటీ రంగాన్ని లోకేశ్ పరుగులు పెట్టిస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ ఐటీ మంత్రిగా చేసిన అనుభవం లోకేశ్‌కు పని కొస్తుందని వివరిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.