Andhra Pradesh

News June 14, 2024

అప్పుడు బాలినేనికి, ఇప్పుడు గొట్టిపాటికి

image

వైసీపీ ప్రభుత్వంలో బాలినేని శ్రీనివాసుల రెడ్డి విద్యుత్, అడవులు పర్యావరణం, శాస్త్ర సాంకేతిక వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌కు విద్యుత్ శాఖ కేటాయించారు. దీంతో జిల్లాకు రెండో సారి విద్యుత్ శాఖనే వరించింది. గత ప్రభుత్వంలో జిల్లాకు ఇద్దరికి మంత్రి పదవులు కేటాయిస్తే.. ఈ ప్రభుత్వంలో కూడా ఇద్దరికి మంత్రి పదువులు వరించాయి.

News June 14, 2024

పేర్ని, జోగి పని చేసిన శాఖలకు మంత్రిగా పార్థసారథి

image

వైసీపీ హయాంలో పేర్ని నాని 2019- 2022 మధ్య సమాచార శాఖ మంత్రిగా ఉన్నారు. జోగి రమేశ్ సైతం 2022- 24 మధ్య గృహనిర్మాణ శాఖ మంత్రిగా పని చేశారు. తాజాగా చంద్రబాబు గృహనిర్మాణం, సమాచార శాఖలకు మంత్రిగా టీడీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథికి బాధ్యతలు అప్పగించారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న పార్థసారథికి పలువురు ఈ సందర్భంగా అభినందనలు తెలుపుతున్నారు.

News June 14, 2024

CTR: మంత్రులు లేకున్నా.. సీఎం మనవారే

image

గతంలో ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురు మంత్రులుగా వ్యవహరించారు. నారాయణ స్వామి డిప్యూటీ CM, ఎక్సైజ్ మంత్రిగా పని చేశారు. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కీలకమైన విద్యుత్తు, మైనింగ్ శాఖ.. రోజా పర్యాటక, క్రీడా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. తాజా కేబినెట్‌లో ఎవరికీ చోటు లేకపోయినా.. కుప్పం నుంచి గెలిచిన CM చంద్రబాబు సాధారణ పరిపాలన, లాండ్ ఆర్డర్, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖలు ఉంచుకున్నారు.

News June 14, 2024

తూ.గో: మంత్రులుగా అప్పుడు ముగ్గురు.. ఇప్పుడు ఇద్దరు

image

ఉమ్మడి తూ.గో నుంచి గత ప్రభుత్వంలో ముగ్గురు మంత్రులుగా చేశారు. చెల్లుబోయిన- బీసీ సంక్షేమ, సినిమాటోగ్రఫీ, I&PR శాఖ, పినిపే విశ్వరూప్- సాంఘిక సంక్షేమ శాఖ, దాడిశెట్టి రాజా- రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా చేశారు. ఇప్పుడు పవన్‌కు డిప్యూటీ సీఎంతో పాటు పర్యావరణం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సైన్స్&టెక్నాలజీ, అటవీ శాఖలు, వాసంశెట్టికి లేబర్, ఫ్యాక్టరీలు, వైద్య, బీమా సేవలు శాఖలు దక్కాయి.

News June 14, 2024

ప.గో.: ఊపందుకోనున్న పోలవరం

image

పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలన్నది ఉమ్మడి ప.గో. జిల్లా ప్రజల కళ. ఏలూరు జిల్లా పరిధిలోని పోలవరం సమీపంలో 2004లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు 2015లో జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపుపొందింది. అయితే తాజాగా మన జిల్లా మంత్రి నిమ్మల రామానాయుడిని జలవనరుల శాఖ వరించింది. దీంతో జిల్లా ప్రజల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. ప్రాజెక్టు పనులు పరుగులు పెడతాయని, నిర్వాసితులకు న్యాయం జరుగుతుందని చర్చ జరుగుతోంది.
– మీ కామెంట్..?

News June 14, 2024

గుంటూరు జిల్లాకు కీలక శాఖలు..

image

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గుంటూరు జిల్లాకు జలవనరులశాఖ(అంబటి రాంబాబు), వైద్యారోగ్య శాఖ(విడదల రజిని)లు దక్కాయి. మంత్రులుగా చేసిన విషయం తెలిసిందే. తాజా, ఎన్డీఏ ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండగా.. ఐటీ, మానవ వనరుల శాఖ(లోకేశ్).. ఆహార, పౌర సరఫరాల శాఖ(ఎన్.మనోహర్).. రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్(అనగాని సత్యప్రసాద్) శాఖలు దక్కాయి.

News June 14, 2024

ఫరూక్ మంత్రిగా పనిచేసిన శాఖలివే..!

image

నంద్యాల ఎమ్మెల్యే ఎన్ఎండీ ఫరూక్ 1985లో తొలిసారి MLAగా ఎన్నికై ఉమ్మడి ఏపీలో ఎన్టీ రామారావు కేబినెట్‌లో చక్కర, వక్ఫ్&ఉర్దూ అకాడమీ శాఖ మంత్రిగా చేశారు. 1999లో చంద్రబాబు కేబినెట్‌లో ఉన్నత విద్యా, ఉర్దూ అకాడమీ, మున్సిపల్ శాఖలు చేపట్టారు. రాష్ట్ర విభజన అనంతరం 2018లో మైనారిటీ సంక్షేమ, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా చేశారు. ప్రస్తుతం మైనార్టీ సంక్షేమం, న్యాయ శాఖలు కేటాయించారు.

News June 14, 2024

ఉమ్మడి కృష్ణా జిల్లాకు కీలక శాఖలు

image

ఉమ్మడి కృష్ణా జిల్లాకు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పౌరసరఫరాల శాఖ(కొడాలి నాని), జోగి రమేశ్(గృహ నిర్మాణ శాఖ), పేర్ని నాని(సమాచార శాఖ), దేవాదాయ శాఖ(వెల్లంపల్లి)లు దక్కిన విషయం తెలిసిందే. తాజా ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో భూగర్భ గనులు, ఎక్సైజ్ శాఖ(కొల్లు రవీంద్ర), హౌసింగ్, సమాచార శాఖ(కొలుసు పార్థసారథి)లను కేటాయించారు.

News June 14, 2024

ఆనం మంత్రిగా పని చేసిన శాఖలు ఇవే

image

➤ 1983, 85: రోడ్లు, భవనాల శాఖ మంత్రి
➤ 2007-09: సమాచార, పౌర సరఫరాల మంత్రి
➤ 2009-12: మున్సిపల్ శాఖ మంత్రి
➤ 2012-14: ఆర్థిక శాఖ మంత్రి
➤ 2024: దేవదాయ శాఖ మంత్రి
NOTE: రాష్ట్రం విడిపోయాక తొలి మున్సిపల్ శాఖా మంత్రిగా పొంగూరు నారాయణ 2014 నుంచి 2019 వరకు పని చేశారు. మరోసారి టీడీపీ అధికారంలోకి రావడంతో ఇప్పుడూ ఆయనకు అదే శాఖ అప్పగించారు.

News June 14, 2024

ప.గో.: అప్పట్లో ముగ్గురు.. ఇప్పుడు ఇద్దరు

image

ఉమ్మడి ప.గో. జిల్లాలోని 15 మంది MLAలలో గత వైసీపీ ప్రభుత్వంలో ముగ్గురు MLAలు మంత్రులుగా వ్యవహరించారు. 2019లో తాడేపల్లిగూడెం నుంచి గెలుపొందిన కొట్టు సత్యనారాయణ దేవాదాయశాఖ, కొవ్వూరు నుంచి MLAగా గెలిచిన తానేటి వనితకు హోంశాఖ, తణుకు MLA కారుమూరి వెంకట నాగేశ్వరరావు పౌరసరఫరాలు, వినియోగదారుల శాఖ మంత్రిగా పనిచేశారు. తాజాగా నిమ్మలకు జలవనరులు, దుర్గేశ్‌ పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖలు కేటాయించారు.