Andhra Pradesh

News June 14, 2024

అచ్చెన్నాయుడికి వ్యవసాయ శాఖ కేటాయింపు

image

టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి వ్యవసాయం, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖలు కేటాయించారు. కాగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి ఈయన ఒక్కరికే కేబినెట్‌లో చోటు దక్కిన విషయం తెలిసిందే.

News June 14, 2024

ఉమ్మడి తూ.గో మంత్రులకు దక్కిన శాఖలివే

image

ఉమ్మడి తూ.గో నుంచి ముగ్గురికి మంత్రివర్గంలో చోటు దక్కగా.. వారికి నేడు శాఖలు కేటాయించారు. ☞ పిఠాపురం MLA పవన్ కళ్యాణ్- డిప్యూటీ సీఎం, పర్యావరణం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సైన్స్&టెక్నాలజీ, అటవీ శాఖలు. ☞ రామచంద్రపురం MLA వాసంశెట్టి సుభాశ్- లేబర్, ఫ్యాక్టరీలు, ఇన్‌స్యూరెన్స్ మెడికల్ సర్వీసెస్. ☞ నిడదవోలు MLA కందుల దుర్గేశ్- కందుల దుర్గేశ్ – పర్యాటకం, సినిమాటోగ్రఫీ.

News June 14, 2024

అనంతపురం జిల్లా మంత్రులకు శాఖలు కేటాయింపు

image

ఉమ్మడి అనంతపురం జిల్లాలో ముగ్గురు మంత్రులకు శాఖలు కేటాయించారు. ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు ప్రణాళిక, వాణిజ్య పన్నులు&అసెంబ్లీ వ్యవహారాలు, ధర్మవరం ఎమ్మెల్యే వై.సత్యకుమార్ యాదవ్‌కు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్యవిద్య, పెనుకొండ ఎమ్మెల్యే సవితకు చేనేత, బీసీ సంక్షేమ శాఖను కేటాయించారు. కాగా ఈ ముగ్గురూ మంత్రి పదవి చేపట్టడం ఇదే తొలిసారి.

News June 14, 2024

ఉమ్మడి కర్నూలు జిల్లా మంత్రులకు శాఖల కేటాయింపు

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ముగ్గురు మంత్రులకు శాఖలు కేటాయించారు. బీసీ జనార్దన్ రెడ్డికి రోడ్లు, గృహ నిర్మాణ శాఖ, ఎన్ఎండీ ఫరూక్‌కు ముస్లిం మైనార్టీ సంక్షేమం, న్యాయశాఖ, టీజీ భరత్‌కు పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖలు కేటాయించారు. బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్ తొలిసారి మంత్రులు కాగా.. ఫరూక్ నాలుగో సారి మంత్రి కావడం గమనార్షం.

News June 14, 2024

ప.గో.: ఏ మంత్రికి ఏ శాఖలు అంటే..?

image

ఉమ్మడి ప.గో. జిల్లాలోని 15 MLAలలో ఇద్దరికి మంత్రి పదవులు వరించిన విషయం తెలిసిందే. కాగా పాలకొల్లు MLA నిమ్మల రామానాయుడికి జలవనరుల అభివృద్ధి శాఖలు, నిడదవోలు MLA కందుల దుర్గేశ్‌కు పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖలు కేటాయించారు.

News June 14, 2024

మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి ఏ శాఖ అంటే..

image

సీఎంగా మంత్రులకు శాఖలు కేటాయించారు. రాయచోటి MLA మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి రవాణా, క్రీడా, సమాచార శాఖను కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన మొదటి సారే రాయచోటి ఎమ్మెల్యే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి మంత్రి పదవి వరించింది. రాయచోటి నియోజకవర్గం నుంచి మొదటి మంత్రి కావడం విశేషం. దీంతో రాయచోటి కూటమి కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

News June 14, 2024

సంధ్యారాణికి మహిళా శిశుసంక్షేమ, గిరిజనశాఖ.. శ్రీనివాస్‌కు MSME, సెర్ప్

image

సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన అనంతరం మంత్రులకు శాఖలు కేటాయించారు. సాలూరు ఎమ్మెల్యే గుమ్మిడి సంధ్యారాణికి మహిళా శిశుసంక్షేమ, గిరిజనశాఖ కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు. సాలూరు నియోజవర్గం నుంచి మొదటి మహిళా మంత్రి సంధ్యారాణే కావడం గమనార్హం. గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్‌కు శ్రీనివాస్‌కు MSME, సెర్ప్, ఎన్ఆర్‌ఐ వ్యవహారాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

News June 14, 2024

గొట్టిపాటికి విద్యుత్, డోలాకు సాంఘిక సంక్షేమ శాఖ

image

సీఎం చంద్రబాబు మంత్రులకు శాఖలు కేటాయించారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌కు విద్యుత్ శాఖ, కొండపి ఎమ్మెల్యే డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామికు సాంఘిక సంక్షేమ శాఖ, సచివాలయం, గ్రామ వాలంటీర్ల వ్యవహారాలను కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో అద్దంకి, కొండపి నియోజకవర్గాల్లోని కూటమి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

News June 14, 2024

BREAKING: ఉమ్మడి కృష్ణా జిల్లా మంత్రులకు శాఖల కేటాయింపు

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో మంత్రులుగా ప్రమాణ చేసిన ఇద్దరికి సీఎం చంద్రబాబు శాఖలు కేటాయించారు. మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్రకు భూగర్భ గనుల, ఎక్సైజ్ శాఖ దక్కింది. నూజివీడు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథికి సమాచార, గృహనిర్మాణ శాఖ కేటాయించారు. దీంతో రెండు రోజుల ఉత్కంఠకు తెరపడింది.

News June 14, 2024

నారా లోకేశ్‌కు ఐటీ శాఖ

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలో మంత్రులకు సీఎం చంద్రబాబు శాఖలు కేటాయించారు. దీంతో రెండ్రోజుల ఉత్కంఠకు తెరపడింది. జిల్లాకు సంబంధించి మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసిన నారా లోకేశ్‌కు ఐటీ, మానవ వనరుల శాఖ.. నాదెండ్ల మనోహర్‌కు పౌర సరఫరాల శాఖ.. అనగాని సత్యప్రసాద్‌కు రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖ కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు.