Andhra Pradesh

News June 14, 2024

మున్సిపల్ శాఖా మంత్రిగా నారాయణ

image

జిల్లాలోని ఆత్మకూరు, నెల్లూరుసిటీ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ ఇటీవల మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసిన విషయం తెలిసిందే. నారాయణకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ కేటాయించారు. అలాగే ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రిగా పని చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

News June 14, 2024

టీచర్ నుంచి హోంమంత్రిగా అనిత

image

వంగలపూడి అనితకు హోంశాఖ, విపత్తుల నిర్వహణ శాఖను కేటాయించారు. ఉమ్మడి జిల్లాలోనే ఏకైక మంత్రిగా అనిత ఉన్నారు. పాయకరావుపేట నియోజకర్గం నుంచి మొదటి మంత్రి అనితే కావడం గమనార్హం. టీచర్ పనిచేసిన అనిత 2014లో మొదటిసారి పాయకరావుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 కొవ్వురులో పోటీ చేసి మాజీ హోంమంత్రి తానేటి వనిత చేతిలో ఓడిన అనితను హోంమంత్రి వరించడం విశేషం.

News June 14, 2024

ఉమ్మడి ప.గో. జిల్లాలో 5.02 లక్షల లబ్ధిదారులు

image

ఎన్నికల హామీలో భాగంగా ఏప్రిల్ నుంచి పెన్షన్ రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు ఇస్తామని కూటమి ప్రకటించింది. కాగా ఏలూరు జిల్లాలో 2.68 లక్షల పెన్షన్‌దారులు, పశ్చిమగోదావరిలో 2.34 లక్షల మందికి లబ్ధిచేకూరనుంది. మొత్తం 2 జిల్లాల్లో 5.02 లక్షల మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందనున్నారు. ప్రస్తుతం పెన్షన్ దారులు రూ.3వేలు అందుకుంటున్నారు.

News June 14, 2024

జడ్పీటీసీ పదవికి విరుపాక్షి రాజీనామా

image

ఆలూరు వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన విరుపాక్షి చిప్పగిరి మండల జడ్పీటీసీ పదవికి శుక్రవారం రాజీనామా చేశారు. ఆ పత్రాన్ని కర్నూలు కలెక్టరేట్లో కలెక్టర్ డాక్టర్ సృజనకు అందించారు. విరుపాక్షి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో జడ్పీటీసీ ఎన్నికల్లో చిప్పగిరి మండలం నుంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

News June 14, 2024

అన్న క్యాంటీన్లు.. 30వేల మందికి ఆహార భద్రత

image

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అన్న క్యాంటీన్ల ద్వారా 30 వేల మందికి ఆహార భద్రత లభించనుంది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడంతో అవి మూతపడ్డాయి. ప్రస్తుతం చంద్రబాబు అన్న క్యాంటీన్ల పునః ప్రారంభానికి సంతకం చేశారు. జిల్లాలో రాజమండ్రి, కాకినాడ, సామర్లకోట, పెద్దాపురం, అమలాపురం తదితర ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లు ప్రారంభించనున్నారు.

News June 14, 2024

మంత్రి పదవి రానందుకు బాధ లేదు: గోరంట్ల

image

తాను మంత్రి పదవి ఆశించానని, అయితే ఇవ్వడం ఇవ్వకపోవడం అధిష్ఠానం నిర్ణయమని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. కూటమి అన్నాక ఎన్నో లెక్కలు ఉంటాయని, మంత్రి పదవి దక్కనందకు తనకు ఎలాంటి బాధలేదని స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో హద్దుమీరి ప్రవర్తించి ఏ అధికారిని వదిలేది లేదని, కలెక్టరేట్ నుంచి పంచాయతీ వరకూ ఆరోపణలు ఉన్నవారిపై విచారణ చేయిస్తామన్నారు.

News June 14, 2024

చిత్తూరులో ఉద్యోగ మేళా..!

image

ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ సేల్స్ ఆఫీసర్, యూనిట్ మేనేజర్ ఉద్యోగ ఖాళీల భర్తీకి ఈ నెల15న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి పద్మజ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్/డిగ్రీ ఉత్తీర్ణులై వయస్సు 18 నుంచి 40 ఏళ్లలోపు అర్హులన్నారు. ఆసక్తి గల వారు చిత్తూరులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో జరిగే మేళాకు హాజరుకావాలని ఆమె కోరారు.

News June 14, 2024

కొత్త ప్రభుత్వానికి అభినందనలు: ఉండవల్లి

image

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వానికి శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోటీ చేసిన 21 సీట్లలో విజయం సాధించిన పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేక అభినందనలు అని అన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కందుల దుర్గేష్‌ను అభినందించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.

News June 14, 2024

SKLM: చిట్టీల పేరిట రూ.కోటి కాజేసిన యువకుడు

image

కొత్తూరు మండలం కుంటిభద్రకు చెందిన ఓ యువకుడు చిట్టీల పేరిట రూ.కోటికి పైగా టోపీ పెట్టాడని బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సదరు యువకుడు కొందరి నుంచి ప్రతి నెల చిట్టీపాట పేరుతో నగదు తీసుకొని తిరిగి చెల్లించకుండా గత కొన్ని నెలలుగా తప్పించుకు తిరుగుతున్నాడని ఆరోపించారు. బాధితులు వెళ్లి ఊరి పెద్దల్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. కాగా.. దీనిపై ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

News June 14, 2024

మాజీ మంత్రి యనమలతో మంత్రి అనిత భేటీ

image

మాజీ మంత్రి యనమల రామకృష్ణుడితో పాయకరావుపేట ఎమ్మెల్యే, మంత్రి వంగలపూడి అనిత విజయవాడలో ఆయన స్వగృహంలో శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రిని అనిత శాలువాతో సత్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం పలు విషయాలపై వారు చర్చించారు. మంత్రి పదవి పొందిన అనితను రామకృష్ణుడు అభినందించారు. రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని రామకృష్ణుడు సలహా ఇచ్చారు.