Andhra Pradesh

News March 28, 2025

హీరోను అంటూ నమ్మించి దారుణం.. కేసు నమోదు

image

హీరోను అంటూ నమ్మించి మహిళను మోసం చేసిన ఘటనలో యువకుడిపై నెల్లూరు(D) చిన్నబజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుపతి(D) కోట(M)నికి చెందిన ఓ మహిళ భర్త నుంచి విడిపోయింది. నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తోంది. ఆమెకు ఇన్‌స్టాలో సునీల్ రెడ్డి పరిచయం అయ్యాడు. హీరోను అంటూ నమ్మించి లాడ్జిలో శారీరకంగా దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకోమని కోరగా ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఫొటోలతో సునీల్ బెదిరించి దాడి చేశాడు.

News March 28, 2025

విజయనగరం: ఉప ఎన్నికల్లో YCP క్లీన్ స్వీప్

image

విజయనగరం జిల్లా వ్యాప్తంగా వివిధ కారణాలతో ఖాళీ అయిన స్థానాల్లో గురువారం నిర్వహించిన ఉప ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. భోగాపురం వైస్ ఎంపీపీగా పచ్చిపాల నాగలక్ష్మి (వైసీపీ) ఎన్నిక కాగా, వివిధ మండలాల్లో మరో పది స్థానాల్లో జరిగిన ఉప సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంతకవిటి మండలంలోని మండల పరిషత్ కో-ఆప్షన్ సభ్యుడిగా వైసీపీకి చెందిన షేక్ హయ్యద్ బీబీ ఎన్నికయ్యారు.

News March 28, 2025

కంచరపాలెంలో దారుణం.. ఒకరు మృతి

image

విశాఖలో దారుణం చోటుచేసుకుంది. ఎస్ఆర్‌ఆర్ నగర్‌కు చెందిన పి.హనుమంతురావు(60) మృతదేహం కలకలం రేపింది. చెట్టుకు నగ్నంగా కట్టేసి కొట్టడంతో అతను చనిపోయినట్లు సమాచారం. స్థానికులు చెట్టుకు కట్టేసి ఉన్న అతని మృతదేహాన్ని కిందకు దించి వస్త్రాలు కప్పారు. వారి సమాచారం మేరకు కంచరపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 28, 2025

కాకాణి ముందస్తు బెయిల్‌పై హై కోర్ట్ కీలక ఆదేశాలు

image

తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించిన కాకాణి పిటిషన్‌పై కోర్ట్.. పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. వరదాపురం పరిధిలోని ప్రభుత్వ భూమిలో కాకాణి అక్రమంగా మైనింగ్ చేశారంటూ అధికారుల ఫిర్యాదు మేరకు ఈ నెల 16న ఆయనపై కేసు నమోదైంది. దీనిపై బెయిల్ కోరుతూ కాకాణి కోర్టుకు వెళ్లగా.. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను తమకు సర్పించాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.

News March 28, 2025

ప్రకాశం జిల్లాలోనే అధిక ఎండలు

image

ప్రకాశం జిల్లాలో గురువారం ఎండ, వడగాల్పుల తీవ్రత కొనసాగింది. రాష్ట్రంలో అధిక ఎండలు ప్రకాశం జిల్లా నందనమారెళ్లలో 42.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. నేడు పలు మండలాల్లో వడగాల్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ ఎండలకు బయటకు వెళ్లేముందు, గొడుగు, టోపీలు వాడాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే జిల్లాలోని పలు మండలాల్లో ఉదయం మంచు కురవడం గమనార్హం.

News March 28, 2025

‘కిలోకి రూ.10 కమీషన్’ నిరూపిస్తే ఆస్తులు రాసిస్తా: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే

image

కర్నూలులోని ‘సాక్షి’ ఆఫీస్ ముందు ధర్నాకు దిగిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వైసీపీకి సవాల్ విసిరారు. ‘చికెన్ షాపుల నుంచి మేము కిలోకు రూ.10 తీసుకుంటున్నట్లు నిరూపిస్తే నా ఆస్తులు రాసిస్తా. లేదంటే నాపై రాసిన వార్తలన్నీ తప్పని ప్రచురించాలి. నాపై ఇలాంటి వార్తలు రాయడం తగదు’ అంటూ ఆమె హెచ్చరించారు. కాగా నిన్న సాక్షి కార్యాలయం ముందు కోళ్ల వ్యర్థాలు, చెత్త పడేసి ఆందోళన చేసిన విషయం తెలిసిందే.

News March 28, 2025

GNT: మైనర్ బాలికతో ప్రేమ పెళ్లి.. పోక్సో కేసు నమోదు

image

బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న యువకుడు 9వ తరగతి చదువుతున్న మైనర్ బాలికను వివాహం చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఆ యువకుడి‌పై పట్టాభిపురం పీఎస్‌లో పోక్సో కేసు నమోదైంది. ఇద్దరూ పెళ్లి చేసుకున్న విషయాన్ని ఇరు కుటుంబాలు గోప్యంగా ఉంచాయి. ఆ మైనర్ బాలిక మరో వ్యక్తితో చాటింగ్ చేస్తుండటంతో ఆ కుటుంబాల్లో గొడవలు జరిగాయి. దీంతో వారు స్టేషన్ మెట్లు ఎక్కడంతో పెళ్లి జరిగి 8 నెలలైందని పోలీసులు గుర్తించారు.

News March 28, 2025

నీ మొగుడి అలవాట్లే నీకు వచ్చాయి: తోపుదుర్తి

image

రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రామగిరి ఎంపీపీ ఎన్నిక విషయంలో పరిటాల కుటుంబం ప్రజాసామ్యాన్ని అపహాస్యం చేస్తోందని మండిపడ్డారు. ‘నీ మొగుడి అలవాట్లే నీకు, నీ కొడుకులకు వచ్చాయి. మీకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు. టీడీపీకి కేవలం ఒక ఎంపీటీసీ స్థానం ఉన్నా దౌర్జన్యంతో ఎంపీపీ పీఠం చేజిక్కుంచుకోవాలని చూస్తున్నారు’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

News March 28, 2025

వజ్రపుకొత్తూరుకు రానున్న సినీ నటి కవిత

image

వజ్రపుకొత్తూరు మండలంలోని ఒంకులూరు గ్రామానికి శుక్రవారం సినీ నటి కవిత రానున్నారు. గ్రామానికి చెందిన గుంటు వేణుగోపాలరావు గారి ఆధ్వర్యంలో జరగనున్న ఉగాది ఉత్సవాలు సందర్భంగా ఆమె రానున్నట్లు తెలుస్తోంది. గ్రామంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనున్నారని నిర్వాహకులు తెలిపారు.

News March 28, 2025

ప.గో: రెండు రోజులు జాగ్రత్త

image

రానున్న రెండు రోజులు ప.గో జిల్లా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇవాళ తాడేపల్లిగూడెంలో 40.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే పెంటపాడు, తణుకులో 40.6, అత్తిలి, ఆకివీడులో 40.1, ఇరగవరంలో 39.8, ఉండిలో 39.6, పెనుమంట్రలో 39.3, పెనుగొండలో 39.2, పాలకోడేరులో 39.1 డిగ్రీల ఎండ కాస్తుంది. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలి. టోపీ, గొడుగు వాడాలి.