Andhra Pradesh

News October 3, 2024

విశాఖలో టెట్ పరీక్షకు 3439 మంది హాజరు

image

విశాఖలో గురువారం నిర్వహించిన టెట్ పరీక్షకు 3931 మంది అభ్యర్థులు హాజరు కావలసి ఉండగా 3439 మంది హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రకళ తెలిపారు. మొత్తం 492 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. నగరంలో ఉదయం 5 కేంద్రాల్లోనూ మధ్యాహ్నం మూడు కేంద్రాల్లోనూ పరీక్ష నిర్వహించినట్లు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ బుచ్చిరాజుపాలెం సెంటర్‌ను సందర్శించినట్లు తెలిపారు.

News October 3, 2024

టెట్ పరీక్షకు 145 మంది గైర్హాజరు

image

కర్నూలు జిల్లావ్యాప్తంగా గురువారం నిర్వహించిన టెట్ పరీక్షకు 145 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ వెల్లడించారు. ఉదయం జరిగిన పరీక్షలో 551 మంది అభ్యర్థులు హాజరు కాగా.. మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 556 మంది అభ్యర్థులు పరీక్ష రాశారని తెలిపారు.

News October 3, 2024

పాలకోడేరు: నేర సమీక్ష నిర్వహించిన ఎస్పీ నయీం అస్మి

image

పాలకోడేరు మండలం గొల్లలకోడేరు గ్రామంలోని జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి ఎస్పీ అద్నాన్ నయీం అస్మి జూమ్ మీట్ ద్వారా నెలవారి నేర సమీక్ష సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్టేషన్ల వారీగా పెండింగ్ కేసుల వివరాలు, అరెస్టులు, దర్యాప్తులపై ఆరా తీశారు. అలాగే దసరా, దీపావళికి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలని సిబ్బందికి సూచనలు జారీ చేశారు.

News October 3, 2024

శ్రీకాకుళం: ఈనెల 7నుంచి బస్సు పాసుల మంజూరు

image

విద్యార్థులకు ఈనెల 7 నుంచి RTC బస్ పాసులు మంజూరు చేస్తున్నట్లు జిల్లా రవాణా అధికారి విజయ్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వీటి కోసం విద్యాసంస్థ నుంచి స్టడీ, బోనఫైడ్ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్‌లతో apsrtcpass.in వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవాలన్నారు. పలాస, టెక్కలి, శ్రీకాకుళం బస్ స్టేషన్లలో గల కౌంటర్ల వద్ద పాసులు పొందవచ్చని అధికారి పేర్కొన్నారు. share it.

News October 3, 2024

సెలవులలో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు: డీఈఓ

image

దసరా సెలవులలో పాఠశాలలు, కళాశాలలో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీ సత్యసాయి జిల్లా విద్యాశాఖ అధికారి మీనాక్షి తెలిపారు. నేటి నుంచి 13వ తేదీ వరకు పాఠశాలలకు సెలవు ప్రకటించామని, నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా తరగతులు నిర్వహిస్తే యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండల విద్యాశాఖ అధికారులు పాఠశాలలను సందర్శించి నివేదికను ఉన్నతాధికారులకు అందజేయాలన్నారు.

News October 3, 2024

నిడదవోలులో రేపు జాబ్ మేళా

image

నిడదవోలు ఎస్వీఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తూ.గో.జిల్లా ఉపాధి కల్పనాధికారి సుధాకర్ తెలిపారు. ఉదయం 9 గంటలకు జాబ్ మేళా మొదలవుతుందని, 5 కంపెనీల ప్రతినిధులు ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారన్నారు. SSC, డిప్లొమా, డీఫార్మసీ, ఇంటర్, డిగ్రీ, బీ-ఫార్మసీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంబీఏ, ఎంసీఏ ఎం-ఫార్మసీ చదివిన 19-30 ఏళ్ల మధ్య వయసు కలిగిన వారు అర్హులన్నారు.

News October 3, 2024

నెల్లూరు: కారు బోల్తా.. ఒకరు మృతి

image

కారు బోల్తాపడిన సంఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడిన సంఘటన వింజమూరు మండలం బొమ్మరాజుచెరువువద్ద గురువారం చోటుచేసుకుంది. కావలి నుంచి కడపకు వెళ్తున్న కారు బొమ్మరాజుచెరువు వద్ద కంకరగుట్ట ఎక్కి అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో కడపకు చెందిన ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో కారు నుజ్జునజ్జయింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News October 3, 2024

రేపే తిరుపతిలో ఉద్యోగ మేళా

image

తిరుపతిలోని పద్మావతిపురం ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో జాబ్ మేళా శుక్రవారం నిర్వహిస్తున్నట్లు తిరుపతి జిల్లా నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారి లోకనాథం పేర్కొన్నారు. 4 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, ఎంబీఏ, ఎంకాం పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని చెప్పారు. నిరుద్యోగులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News October 3, 2024

లేబర్, టెక్స్ టైల్స్ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా అనంతపురం ఎంపీ

image

అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకు కేంద్ర ప్రభుత్వం లేబర్, టెక్స్ టైల్స్, స్కిల్ డెవలప్‌మెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా అవకాశం కల్పించింది. ఈ అవకాశం కల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు అంబికా లక్ష్మీనారాయణ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు.

News October 3, 2024

జాతీయ స్థాయి ప్లోర్ బాల్ పోటీలలో నంద్యాల జిల్లా పగిడ్యాలకు ద్వితీయ స్థానం

image

తమిళనాడులోని చెంగల్పట్టులో సెప్టెంబర్ 26 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించిన జాతీయ స్థాయి ప్లోర్ బాల్ పోటీలలో నంద్యాల జల్లా పగిడ్యాల మండలం లక్ష్మాపురం డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ బాలికల గురుకులం విద్యార్థినుల అఖిల, అక్షయ ద్వితీయ స్థానంలో నిలిచారనీ ఈమేరకు పీఈటీ లావణ్య వెల్లడించారు. దీంతో అఖిల, అక్షయను పాఠశాల అధ్యాపక బృందం అభినందించారు.