India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖలో ‘ఆపరేషన్ లంగ్స్-2.0’ పేరుతో GVMC ఆక్రమణలను తొలగిస్తున్న విషయం తెలిసిందే. దీంతో తమ ఉపాధి కోల్పోయామంటూ చిరు వ్యాపారులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపడుతున్నారు. తమ కష్టాలను తీరుస్తారని గెలిపించిన కార్పొరేటర్లు మాత్రం ఈ కష్ట సమయంలో తమను గాలికొదిలేసి విహార యాత్రలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు చెప్పుకుందామంటే ఫోన్లు కూడా లిఫ్ట్ చేయడం లేదని వాపోయారు.
ప్రకాశం జిల్లాలో అర్ధరాత్రి భూమి కంపించింది. బుధవారం తెల్లవారుజామున 2 గంటల 53 నిమిషాలకు భూమి కంపించినట్లు ఒంగోలు ప్రజలు తెలిపారు. ఈ భూకంప ప్రభావం అధికంగా ఒంగోలులోని శర్మా కళాశాల ప్రాంతంలో ఉనిందన్నారు. అర్ధరాత్రి ఒక్కసారిగా భూ ప్రకంపనతో భయాందోళనకు గురయ్యామన్నారు. చివరికి అది భూకంపం అని తెలిసినట్లు ప్రజలు వివరించారు.
కోరుకున్న చోటకు పోస్టింగ్ వచ్చింది కదా అని.. ప్రజలతో ఇష్టంవచ్చినట్లుగా మాట్లాడితే తాను సహించబోనంటూ జిల్లా కలెక్టర్ రాజాబాబు మంగళవారం అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం నుంచి రెవెన్యూ సంబంధిత అంశాలపై మంగళవారం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అర్జీదారులతో అధికారులు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటానన్నారు.
దసరా సెలవుల్లో ఇళ్లకు తాళాలు వేసి ఊర్లకు వెళ్లే ప్రజలు ముందస్తుగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ మంగళవారం వెల్లడించారు. విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లలో ఉంచాలన్నారు. ఇంటి బయట లోపల ఒకటి లేదా రెండు లైట్లు వేసి ఉంచాలని, సాధ్యమైనంత వరకు ఇళ్లకు సీసీ కెమెరాలను అమర్చుకోవాలన్నారు. సెలవులు ముగిసేంత వరకు కాలనీలలో సంక్షేమ సంఘాలు గస్తీని ఏర్పాటు చేసుకోవాలన్నారు.
వాతావరణ శాఖ హెచ్చరికలతో రానున్న నాలుగు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు కలెక్టరు డాక్టర్ సిరి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి, ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. వర్షాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగు పర్చేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి అన్నారు. విజయనగరం జిల్లాలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యాచరణ అమలు తీరును తన ఛాంబర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా MPDOలతో సమీక్షించారు. నగరపాలక సంస్థల్లో నిర్ణీత లక్ష్యాలు సాధిస్తున్నారన్నారు. గ్రామాల్లో కూడా నిర్దేశించిన లక్ష్యాలు సాధించాలని లేనిపక్షంలో చర్యలు తప్పవన్నారు.
విశాఖలో 21 వెడింగ్ జోన్లను గుర్తించామని జీవీఎంసీ యూసీడీ ప్రాజెక్ట్ డైరెక్టర్ సత్యవేణి తెలిపారు. ఇంకా మరికొన్ని గుర్తించాలని నిర్ణయించామన్నారు. యూసీడీ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో వీధి విక్రయదారుల అర్హత సర్వే 90% పూర్తయిందని తెలిపారు. బీపీఎల్ కేటగిరీ, స్ట్రీట్ వెండర్ గుర్తింపు ఉండాలన్నారు. వీరికి వెండింగ్ జోన్లలో దుకాణాలు కేటాయిస్తామన్నారు.
ఎచ్చెర్లలో గల డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ, అనుబంధ కళాశాలలకు ఈ నెల 25 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించినట్లు రిజిస్ట్రార్ ఆచార్య బి.అడ్డయ్య తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అక్టోబర్ 9వ తేదీన తిరిగి తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఈ సమాచారాన్ని కళాశాలల యాజమాన్యం, విద్యార్థులు గమనించాలని సూచించారు.
డీఎస్సీ–2025లో ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులకు విజయవాడ ప్రయాణ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి మంగళవారం తెలిపారు. విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి కార్యక్రమంలో పాల్గొనే అభ్యర్థుల కోసం రాజమండ్రిలో ఆరు పాఠశాలల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఎంపికైన అభ్యర్థులు గురువారం తమకు కేటాయించిన పాఠశాలల వద్దకు రిజిస్ట్రేషన్ కోసం తప్పనిసరిగా రావాలని సూచించారు.
పాలకొల్లులో బుధవారం నిర్వహించనున్న మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె శ్రీజ వివాహానికి సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మధ్యాహ్నం 12:45 నిమిషాలకు ఉండవల్లిలో తన నివాసం నుంచి హెలికాఫ్టర్ ద్వారా బయలుదేరతారు. 1:15 నిమిషాలకు పాలకొల్లు రానున్నారు. 1:30 నుంచి 2:15 వరకు పెళ్లి వేడుకలో పాల్గొననున్నట్లు అధికారులు మంగళవారం ప్రకటించారు.
Sorry, no posts matched your criteria.