Andhra Pradesh

News March 29, 2024

విశాఖ నుంచి అందుబాటులోకి కొత్త విమాన సర్వీసులు

image

విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రెండు అంతర్జాతీయ, రెండు దేశీయ విమానం సర్వీసులు అందుబాటులోకి వస్తున్నట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఏప్రిల్ 9 నుంచి విశాఖ బ్యాంక్, 26 నుంచి కౌలాలంపూర్ విశాఖ, మార్చి 31 నుంచి విశాఖ ఢిల్లీ, విశాఖ హైదరాబాద్ విమాన సర్వీసులు నడుస్తాయని తెలిపారు. ఆయా సర్వీసులకు సంబంధించి టికెట్లు ప్రస్తుతం ఆల్ లైన్ లో అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు.

News March 29, 2024

విశాఖ: మరికొన్ని వర్గాలకు పోస్టల్ బ్యాలెట్

image

ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, సర్వీస్‌ ఓటర్లతోపాటు మరికొన్ని వర్గాలకు ఈసారి పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకునే అవకాశం కల్పించనున్నారు. ప్రధానంగా 80 ఏళ్లు దాటిన వారిని, దివ్యాంగులను (40 శాతానికి పైబడి వైకల్యం కలిగిన), విధి నిర్వహణలో ఉండే జర్నలిస్టులను పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకునేవారి జాబితాలో చేర్చారు. దీంతో జిల్లాలో 30 వేల మందికి పైబడి పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకునే అవకాశం ఉంది.

News March 29, 2024

VZM: 25 శాతం సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

image

2024-25 విద్యా సంవత్సరానికి జిల్లాలోని ప్రైవేట్, అన్-ఎయిడెడ్ పాఠశాలల్లో 1వ తరగతిలో ఉచిత సీట్లకు విద్యార్థులు మార్చి 31వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని జిల్లా డీఈవో తెలిపారు. సెంట్రల్ లేదా రాష్ట్ర సిలబస్‌లో విద్యనభ్యసించేందుకు దరఖాస్తులు చేసుకోవచ్చునన్నారు. ఆర్‌టి‌ఈ చట్టంలోని సెక్షన్ 12(1) (సి) 2009 అనుసరించి 25 శాతం సీట్లను భర్తీ చేస్తామని తెలిపారు.

News March 29, 2024

శ్రీకాకుళం: 81 ఓట్లు మెజార్టీతో గెలిచారు

image

మీకు తెలుసా.. శ్రీకాకుళం జిల్లాలో ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్న పాతపట్నం నుంచి 81 ఓట్లు అత్యంత తక్కువ మెజార్టీతో పెంటన్నాయుడు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. 1952లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్న పాతపట్నం నుంచి పెంటన్నాయుడు పోటీ చేశారు. ఈయన సమీప ప్రత్యర్థి ఎంఎస్ నారాయణపై 81 ఓట్లతో గెలిచారు. ఇప్పటి వరకు అంతకంటే తక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థి జిల్లాలో లేరు.

News March 29, 2024

కాకినాడలో ట్రాఫిక్ ఎస్సైపై యువకుల దాడి

image

కాకినాడలోని ఉప్పలంక వద్ద వాహన తనిఖీలు చేస్తోన్న ట్రాఫిక్ ఎస్ఐ కిషోర్ కుమార్‌పై కొంతమంది దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కిషోర్ కుమార్‌కు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో యువకులు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. వారిని పట్టుకొని కరప పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 29, 2024

శ్రీకాకుళం: మే 31 వరకు వేసవి సెలవులు

image

శ్రీకాకుళం జిల్లాలో ఇంటర్మీడియట్ బోధిస్తున్న జూనియర్ కళాశాలలకు శుక్రవారం నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ప్రకటించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇటీవల ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ముగిసిన విషయం తెలిసిందే. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం మార్చి 28వ తేదీ వరకు పని దినాలుగా నిర్ణయించడంతో నేటి నుంచి జూనియర్ కళాశాలలు మూతపడనున్నాయి.

News March 29, 2024

లా కోర్స్ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల 

image

ఎచ్చర్ల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ లో లా కోర్సు కు సంబంధించిన పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు ఎగ్జామినేషన్ డీన్ ఎస్.ఉదయ్ భాస్కర్ ఒక ప్రకటనలో గురువారం తెలిపారు. మూడేళ్ల ఎల్.ఎల్.బి,లో రెండో సెమిస్టర్, ఐదో సెమిస్టర్, ఐదేళ్ల కోర్సులో రెండో సెమిస్టర్, ఐదో సెమిస్టర్, తొమ్మిదో సెమిస్టర్ ఫలితాలు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఫలితాలలో జ్ఞానభూమి పోర్టల్ లో అందుబాటులో ఉంచామన్నారు.

News March 29, 2024

ప్రకాశం: నేటి నుంచి జూనియర్ కళాశాలలకు సెలవులు

image

జిల్లాలోని అన్ని యాజమాన్యాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జూనియర్ కళాశాలలకు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి వేసవి నెలవులు ప్రకటిస్తున్నట్లు ఆర్ఐవో సైమన్ విక్టర్ తెలిపారు. జూన్ 1న కళాశాలలు పునః ప్రారంభమవుతాయన్నారు. ప్రభుత్వ ప్రైవేటు కళాశాలన్నింటికి ఈ ప్రకటన వర్తిస్తుందన్నారు. వేసవి సెలవుల్లో కళాశాలల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News March 29, 2024

గుంటూరు మిర్చియార్డుకు వరుస సెలవులు

image

గుంటూరు మిర్చియార్డుకు మళ్లీ వరుస సెలవులు వచ్చాయి. మూడు రోజులు పాటు మిర్చి క్రయవిక్రయాలు నిలిచిపోనున్నాయి. శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా సెలవు ప్రకటించారు. శని, ఆదివారాలు వారాంతపు సెలవులు కావడంతో సాధారణంగా లావాదేవీలు జరగవు. ఈ వారంలో మూడు రోజులు మాత్రమే క్రయవిక్రయాలు జరిగాయి. ఈ విషయాన్ని రైతులు గమనించాలని యార్డు నిర్వాహకులు తెలిపారు.

News March 29, 2024

కర్నూలు: నేడు CM, మాజీ CM పర్యటన

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలో CM, మాజీ CM ఇవాళ పర్యటించనున్నారు. బనగానపల్లెలో TDP అధినేత చంద్రబాబు ‘ప్రజాగళం’ కార్యక్రమంలో భాగంగా స్థానిక పెట్రోల్ బంక్ వద్ద నిర్వహించే రోడ్ షోలో ఆయన పాల్గొననున్నారు. అనంతరం బహిరంగ సభలో CBN ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అలాగే మరో వైపు సీఎం జగన్ ఎమ్మిగనూరు వైడబ్ల్యూసీఎస్ మైదానంలో సాయంత్రం ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రలో పాల్గొంటున్నారు.

error: Content is protected !!