India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖ నగరంలో తహశీల్దార్ రమణయ్య హత్య కేసులో నిందితుడు మురారి సుబ్రహ్మణ్యం గంగారావు బెయిల్ మంజూరు కోరుతూ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ తిరస్కరించారు. గంగారావు ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు దాఖలు చేసుకున్న పిటిషన్ గురువారం విచారణకు వచ్చింది. వాదనల అనంతరం నిందితుడికి బెయిల్ మంజూరు తిరస్కరిస్తున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు.
కృష్ణా జిల్లాలో ఇప్పటి వరకు 55,562 మంది రైతుల నుంచి రు.1070.07 కోట్ల విలువైన 4,88,590 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ తెలిపారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఈ నెల 31 వరకు ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. ఆ తర్వాత కేంద్రాలను మూసివేస్తామని ఆమె చెప్పారు. ఈ అవకాశం రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
తిరుపతి నగరం జీవకోనలో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గురువారం ఎన్నికల నిర్వహించారు. ఇందులో భాగంగా ఓ దుకాణంలో ఆయన స్వయంగా దోశలు వేశారు. అనంతరం ఇంటింటికీ తిరిగి తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రచారం, ప్రకటన ప్రదర్శన నిర్వహించడంలో స్థానిక సంస్థల పరిధికి లోబడి, భద్రతాపరమైన అంశాల నేపథ్యాన్ని అనుసరించి మాత్రమే అనుమతులు జారీ చేయడం జరుగుతుందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.కె.మాధవీలత శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. స్థానికంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ప్రదర్శించే హోర్డింగుల విషయంలో స్థానిక సంస్థలకు చెందిన చట్టాలను అనుసరించే అనుమతుల మేరకు ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిపారు.
తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ టి.జానకిరామ్ ది ఆర్కిడ్ సొసైటీ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. మహారాష్ట్రలోని పూణేలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఆయనను నియమించారు. రెండేళ్లపాటు ఈ పదవిలో జానకిరామ్ కొనసాగనున్నారు. ఈ సందర్భంగా ఆయనను వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బి.శ్రీనివాసులు, రీసెర్చ్ డైరెక్టర్ నారం నాయుడు అభినందించారు.
ఎన్నికల్లో పోలీస్ అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అనంతపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్ అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో నెల వారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలను ప్రశాంతంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పాత నేరస్తులు, సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు.
దివ్యాంగులు, వృద్ధ ఓటర్లకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు. ఇదే అంశంపై గురువారం జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని బాపట్ల కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించారు. జిల్లాలో 14,525 మంది దివ్యాంగ ఓటర్లు, 8,633 మంది వృద్ధ ఓటర్లు ఉన్నారని కలెక్టర్ అన్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా మ్యాపింగ్ చేయాలని ఆదేశించారు.
ఒక్క ఛాన్స్ ఇస్తే పాతపట్నం నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు అన్నారు. టీడీపీ అధిష్ఠానం పాతపట్నం ఎమ్మెల్యే అభ్యర్థిగా మామిడి గోవిందరావును ప్రకటించిన అనంతరం తొలిసారి రావడంతో కూటమి సభ్యులతో కలిసి ర్యాలీగా శ్రీ నీలమణి దుర్గ అమ్మవారిని దర్శించుకుని, పాతపట్నం మామిడి గోవిందరావు క్యాంప్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలతో సమీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా జి.సృజన సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం ఎన్నికల అంశాలపై ఆర్వో లు, మునిసిపల్ కమిషనర్‌లు, తహశీల్దార్లు, ఎంపిడిఓలతో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఎన్నికల ఉల్లంఘనలకు సంబంధించి ఫిర్యాదు చేసిన ప్రజల ఐడెంటిటీ రహస్యంగా ఉంచాలని ఆదేశించారు.
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు నేడు జిల్లాకు రానున్నట్లు ఎంపీ కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదలైంది. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు రాజమహేంద్రవరం విమానాశ్రయానికి వచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గాన పెదఅమిరంలో ఉన్న ఆయన కార్యాలయానికి చేరుకుంటారు. అనంతరం నియోజకవర్గ ప్రజలకు, ఆయన అభిమానులకు అందుబాటులో ఉండనున్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.