India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఓటింగ్ సమయంలో ప్రత్యేక కేటగిరీకి చెందిన దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు, ట్రాన్స్ జండర్ ఓటర్లకు అసౌకర్యం కలగకుండా సదుపాయాలు కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల నియమావళిపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌ను పకడ్బందీగా అమలు చేయాలని, ఎంసీసీ ఉల్లంఘన జరగకూడదన్నారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సూర్యాపేట, నల్గొండ, పల్నాడు జిల్లాల అధికారులతో అంతరాష్ట్ర సరిహద్దు జిల్లాల భద్రత సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రవి శంకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శివ శంకర్ గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సరిహద్దు ప్రాంతాల గుండా నిబంధనలు అతిక్రమించి చట్ట వ్యతిరేకంగా అక్రమ నగదు, మద్యం, ఇతర వస్తువులు రవాణా జరుగకుండా నిరంతర నిఘాను ఏర్పాటు చేయాలన్నారు.
అనకాపల్లి జిల్లాలో మద్యం, మాదక ద్రవ్యాల రవాణాపై కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టరు రవి పట్టన్ శెట్టి తెలిపారు. గురువారం తాడేపల్లి నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అనకాపల్లి నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్, ఎస్పీ మురళి కృష్ణ పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండబిట్రగుంట ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఇటీవల బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఆలయ ఆవరణలో గురువారం స్వామివార్ల హుండీ కానుకలను లెక్కించారు. ఈక్రమంలో రూ.16,39,801 ఆదాయం వచ్చిందని ఈవో రాధా కృష్ణ తెలిపారు. ఇది గతేడాది కంటే ఎక్కువ అని చెప్పారు.
చిత్తూరు: యువ ఓటర్లు ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఏప్రిల్ 15వ తేదీ వరకు ఎన్నికల కమిషన్ గడువు పొడిగించిందని చిత్తూరు కలెక్టర్ షన్మోహన్ వెల్లడించారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు విస్తృతంగా ఓటరు అవగాహన కార్యక్రమాలు చేపట్టారన్నారు. 2019లో 85.02% పోలింగ్ నమోదైనట్లు చెప్పారు. 2024లో వంద శాతం నమోదు అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేపట్టామన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా నలుమూలల ఉన్న చెక్‌పోస్ట్‌లను ఎస్పీ అజిత వేజెండ్ల గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 10 చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. సిబ్బంది షిఫ్ట్‌ల వారీగా 24 గంటలు తనిఖీ చేసే విధంగా ఏర్పాటు చేశామని తెలిపారు. రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లకూడదని అన్నారు. ఒకవేళ అవసరం అయితే ఆధారాలు తప్పక చూపించాలని సూచించారు.
తాళ్లపాక అన్నమాచార్యుల 521వ వర్థంతి ఉత్సవాలు ఏప్రిల్ 4 నుంచి 8వ తేదీ వరకు జరగనుంది. తాళ్లపాకలోని ధ్యానమందిరం, తిరుమల నారాయణగిరి ఉద్యానవనం, తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 4న తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద మెట్లోత్సవం జరుగుతుంది. ఏప్రిల్ 5న తిరుమలలో నారాయణగిరి ఉద్యానవనంలో సప్తగిరి సంకీర్తనా గోష్ఠిగానం నిర్వహిస్తారు.
అమలాపురం రూరల్ మండలం సమనసకు చెందిన వాలంటీర్లు మోకా వెంకన్నబాబు, ఉడుముల ప్రసాదరావును విధుల నుంచి తొలగించారు. వీరిద్దరూ కామనగరువులో ఈ నెల 27న వైసీపీ నేతలతో కలిసి క్రైస్తవ మత ప్రచారంలో విద్యార్థులకు బైబిల్ పంపిణీలో పాల్గొన్న కారణంగా విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశామని మండల పరిషత్ అభివృద్ధి అధికారి లక్ష్మారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నామని చెప్పారు.
నాయుడుపేట-పెద్దపరియ రైల్వే స్టేషన్ల మధ్య గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి చనిపోవడాన్ని గూడూరు రైల్వే పోలీసులు గుర్తించారు. రైల్వే ఎస్ఐ కొండప్ప నాయుడు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సుమారు 35 ఏళ్ల వయసు కలిగిన వ్యక్తి రైలు వస్తుండగా పట్టాలపై తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నట్లుగా గుర్తించారు. మృతుడు గళ్ల లుంగి, ఫుల్ హ్యాండ్ షర్ట్ ధరించి ఉన్నాడు. మృతదేహాన్ని గూడూరు ఆసుపత్రికి తరలించారు.
జనసేన తిరుపతి MLA అభ్యర్థి శ్రీనివాసులును వ్యతిరేకిస్తున్న ఆపార్టీ స్థానిక ఇన్‌ఛార్జ్ కిరణ్ రాయల్ మంగళగిరిలో నాగబాబును గురువారం కలిశారు. తిరుపతిలో తాజా పరిస్థితులను ఆయనకు వివరించారు. త్వరలో తిరుపతిలో పవన్ పర్యటన ఉంటుందని.. ఈ లోపు పరిస్థితులు అంతా చక్కదిద్దుకుంటాయని నాగబాబు ఆయనకు సూచించారు. ఎన్నికల్లో తనకు కీలక బాధ్యతలు ఇవ్వాలని నాగబాబును కోరగా.. అందుకు ఆయన అంగీకారం తెలిపారని కిరణ్ రాయల్ చెప్పారు.
Sorry, no posts matched your criteria.