India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయవాడ వెస్ట్ NDA అభ్యర్థి సుజనా చౌదరి తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ పడుతున్నారు. 2005లో టీడీపీలో చేరిన ఆయన 2010 నుంచి రెండు విడతలు రాజ్యసభ ఎంపీగా సేవలందించారు. 2014 నుంచి 2018 వరకు కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రిగా పని చేశారు. రానున్న ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ప్రత్యక్ష ఎన్నికలను ఎదుర్కోనున్నారు. సుజనా చౌదరి స్వస్థలం ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల.
కూటమి అభ్యర్థి శివకృష్ణం రాజు టికెట్ వివాదంపై స్పందించారు. పొత్తులో భాగంగా సీటు ఏ పార్టీకి వచ్చినా అందరూ కలసి సహకరించుకుని ఎన్నికల్లో పోటీ చేయడం పొత్తు ధర్మం అన్నారు. త్వరలో నల్లమిల్లి రామక్రిష్ణ రెడ్డితో పాటు జనసేన నేతలను కలసి మద్ధతు అడుగుతానని స్పష్టం చేశారు. పార్టీ నిర్ణయమే తనకు శిరోధార్యంగా భావించి ముందుకు వెళ్తానన్నారు.
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి కాశీబొట్ల సాయినాథ్ శర్మ గురువారం నంద్యాలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. వీరికి సీఎం జగన్ వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి, రాష్ట్ర ఆర్టీసీ ఛైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, వైసీపీ నేత వెంకటసుబ్బారెడ్డి పాల్గొన్నారు.
2023-24 ఆర్థిక సంవత్సరంలో విజయవాడ రైల్వే డివిజన్ సరుకు రవాణా ద్వారా రూ3.975కోట్లను సాధించి సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఏకంగా 36.2 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసినట్లు రైల్వే అధికారులు చెప్పారు. త్వరలోనే విజయవాడ రైల్వే డివిజన్ వార్షిక ఆదాయం రూ.4వేల కోట్ల మైలురాయి దాటనుందని వారు తెలిపారు. అనంతరం సరుకు రవాణా కోసం కొత్తగా రూ.153కోట్లతో 15గూడ్స్ షెడ్లు నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
వెంకటగిరి నియోజకవర్గ రాజకీయాల్లో వైసీపీ సీనియర్ నేత, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు మెట్టుకూరు ధనుంజయరెడ్డి హాట్ టాపిక్‌గా మారారు. ఇటీవల వెంకటగిరిలో పెద్దసంఖ్యలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించడంతో పాటు కచ్చితంగా పోటీలో ఉంటానని రాజకీయ కాక రేపారు. ఈ క్రమంలోనే తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి పిలుపురావడంతో వెళ్లారు. కీలక నేతలు సుదీర్ఘంగా మంతనాలు సాగించినా ఆయన మెత్తబడలేదని సమాచారం.
ఉండ్రాజవరంలో కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తపై భార్య కత్తితో దాడి చేసింది. మద్యం మత్తులో నిత్యం వేధించడంతో భార్య అసహనానికి గురై దాడి చేసినట్లు భార్య తెలిపింది. ఈక్రమంలో జరిగిన పరస్పర దాడులలో భర్త గొల్లవిల్లి వెంకట్, కుమారుడు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నరసరావుపేట లోక్‌సభ స్థానంలో MP లావు కృష్ణదేవరాయలు, MLA అనిల్ మధ్య పోరు రసవత్తరంగా ఉండనుంది. YCPకి రాజీనామా చేసి టీడీపీ నుంచి బరిలో దిగుతున్న లావు.. పల్నాడు అభివృద్ధి కోసమే గుంటూరు YCP ఎంపీ టికెట్ వద్దనుకున్నట్లు ప్రకటించారు. మరోవైపు, వైసీపీ పాలనను టీడీపీ ప్రభుత్వంతో బేరీజు వేసుకొని తీర్పు ఇవ్వాలని అనిల్ అంటున్నారు. వీరిద్దరూ నాన్ లోకల్ కాగా, విజయం ఎవరిని వరిస్తుందని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
ఉత్తరాంధ్రలో టీడీపీ సీనియర్ నాయకుల్లో కిమిడి కళా వెంకట్రావు ఒకరు. పొత్తులో భాగంగా ఆయన ఆశించిన ఎచ్చెర్ల సీటును BJPకి కేటాయించారు. విజయనగరం MP అభ్యర్థి కోసం చేసిన ఐవీఆర్‌ఎస్ సర్వేలో కూడా ఆయన పేరు లేదు. దీంతో ఆయన పోటీ చేసే స్థానంపై ఉత్కంఠ నెలకొంది. చీపురుపల్లిలో నుంచి బరిలో ఉంటారా..లేక ఉమ్మడి విజయనగరంలో TDP ప్రకటించిన 7 స్థానాల్లో ఒక అభ్యర్థిని మార్చి ఆ సీటు కళాకు కేటాయిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.
కడుపు నొప్పి తాళలేక ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన బత్తలపల్లిలోని టీచర్స్ కాలనీలో చోటు చేసుకుంది. టీచర్స్ కాలనీలో నివాసం ఉన్న తిరుపాలు, లలిత దంపతుల కుమార్తె సుజనా పదో తరగతి చదువుతోంది. బుధవారం ఉదయం 10వ తరగతి పరీక్ష రాసి ఇంటికి వచ్చింది. అనంతరం తల్లిదండ్రులు ఆర్డీటీ ఆసుపత్రిలో పనిచేసేందుకు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
నెల్లూరు నగరంలోని మాగుంట లేఔట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘డేరింగ్ అండ్ డాషింగ్’ సినిమా బ్రోచర్ ను విడుదల చేశారు. ఎస్‌విఎస్‌ఆర్ ప్రొడక్షన్‌లో ఈ చిత్రం నిర్మాణమవుతుండగా ‘మైండ్ గేమ్’ హీరో శ్రీరామ్ మరోసారి హీరోగా నటిస్తున్నారు. శ్రీకృష్ణ కిషోర్ చిత్రానికి దర్శకుడుగా మిధున ప్రియతో పాటు పలువురు నటిస్తున్నారు. ఈ కార్యక్రమంలో షేక్ సలీం, మహేంద్ర, వాసు, శోభన్ బాబు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.