Andhra Pradesh

News March 28, 2024

పుంగనూరు: 1 నుంచి ఉపాధి కూలీ రూ:300

image

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు గరిష్టంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి రూ.300 వేతనం అందేలా కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ శన్మోహన్ తెలిపారు. కూలీలు పనిచేసిన పని పరిమాణాన్ని 300 రూపాయలకు మించకుండా పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. వందరోజుల పనిదినాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు.

News March 28, 2024

బాపట్లలో గెలుపు ఎవరిది.?

image

బాపట్ల నియోజకవర్గంలో గెలుపుపై తెలుగుదేశం పార్టీ ఆశలు పెట్టుకుంది. 1999లో చివరిగా టీడీపీ నుంచి మంతెన అనంతవర్మ గెలుపొందారు. అప్పటి నుంచి బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ గెలవలేదు. రానున్న ఎన్నికల్లో టీడీపీ నుంచి వేగేశన నరేంద్ర వర్మ, వైసీపీ నుంచి ఎమ్మెల్యే కోన రఘుపతి పోటీ చేస్తున్నారు. ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుండటంతో, విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి. 

News March 28, 2024

కోవెలకుంట్ల: ఇద్దరు వాలంటీర్లు రాజీనామా

image

కోవెలకుంట్ల మండలంలో ఇద్దరు గ్రామ వాలంటీర్లు తమ పదవులకు రాజీనామా చేసినట్లు కోవెలకుంట్ల మండల ఎంపీడీవో సయ్యదున్నిసా ఓ ప్రకటనలో వెల్లడించారు. కోవెలకుంట్ల పట్టణం సచివాలయం-5కు చెందిన మీనా కుమారి, గుళ్లదుర్తి గ్రామానికి చెందిన పాణ్యం మహేష్ కుమార్ రాజీనామా లెటర్ అందించినట్లు తెలిపారు. కాగా సీఎం జగన్ కోసం పని చేయడానికి తమ పదవులు అడ్డుగా ఉన్నాయన్న కారణంగానే రాజీనామా చేస్తున్నట్లు వాలంటీర్లు ప్రకటించారు.

News March 28, 2024

తెలంగాణలో తూ.గో జిల్లావాసి సూసైడ్

image

యాదాద్రి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని హనుమాన్ నగర్ లో సామర్లకోటకు చెందిన కొరిపల్లి సంజయ్ (26) ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేశామని ఎస్సై యాదగిరి బుధవారం తెలిపారు. ఇతను సంజయ్ దివిస్ పరిశ్రమలో పనిచేస్తున్నాడని చెప్పారు. పరిశ్రమ క్వార్టర్స్ లో ఉండే అతను నెల రోజుల క్రితం స్నేహితులు అద్దెకు ఉండే గదికి మారాడన్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉందని ఎస్సై చెప్పారు.

News March 28, 2024

తిరుమల కాలినడక మార్గంలో చిరుత కలకలం

image

తిరుమల కాలినడక మార్గంలో మరోసారి చిరుత కదలికలు టీటీడీ, ఫారెస్ట్ అధికారుల మధ్య కలకలం సృష్టించింది. ఈనెల 25, 26 వ తేదీలలో కాలినడక మార్గంలో చిరుత జాడలను గుర్తించినట్లు టీటీడీ ఫారెస్ట్ అధికారులు తెలిపారు. కాలినడకన మార్గానికి 150 మీటర్ల దూరంలో చిరుత ట్రాప్ కెమెరాలకు చిక్కింది. దీంతో అప్రమత్తమైన అధికారులు భక్తులను గుంపులుగా అనుమతిస్తున్నారు.

News March 28, 2024

టెక్కలి: ప్రేమ పేరుతో మోసం.. యువకుడిపై కేసు నమోదు

image

మండలంలోని కొండభీంపురం గ్రామానికి చెందిన టీ.ఢిల్లీశ్వరరావు అనే వ్యక్తిపై విజయనగరం జిల్లా బొండపల్లిలో బుధవారం రాత్రి ఒక మహిళ పిర్యాదు మేరకు అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. 2021 నుంచి తనని ప్రేమించి ఇప్పుడు పెళ్లికి నిరాకరించి వేరే పెళ్లి చేసుకునేందుకు సిద్ధం అవుతూ.. తనని మోసం చేస్తున్నాడు మహిళ ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కె.లక్ష్మణరావు తెలిపారు.

News March 28, 2024

విజయవాడలో 9న పలు అర్జీత సేవల రద్దు

image

ఉగాది పండుగను పురస్కరించుకొని ఏప్రిల్ 9వ తేదిన ఇంద్ర కీలాద్రిపై దుర్గమ్మకు స్నపనాభిషేకం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పలు అర్జిత సేవలను రద్దు చేశామని ఆలయ అధికారులు తెలిపారు. ఆ రోజు తెల్లవారు జామున అమ్మవారి ఆలయం చుట్టూ జరిగే ప్రదక్షిణలను నిలిపివేయనున్నారు. సుప్రభాత సేవ, వస్త్రాలంకరణ, ఖడ్గమార్చనచ నవగ్రహ శాంతి హామం, పల్లకీ సేవలను నిపుదల చేస్తామని చెప్పారు.

News March 28, 2024

పోలీసులకు DGP పథకాలు.. IG పాలరాజుకు గోల్డ్ డిస్క్

image

పోలీస్ శాఖలో రాష్ట్రస్థాయిలో వివిధ కేసుల్లో అత్యున్నత ప్రతిభ కనబరిచిన వారికి రాష్ట్రప్రభుత్వం డీజీపీ గోల్డ్ డిస్క్, సిల్వర్ డిస్క్, బ్రాంచ్ డిస్క్ అవార్డులకు ఎంపిక చేసింది. వారిలో గుంటూరు రేంజ్ ఐజి పాలరాజుకు గోల్డ్ డిస్క్, ఏఎస్పి సుప్రజ, డీఎస్పీ పోతురాజులకు సిల్వర్ డిస్క్, ఏఎస్పీ A. శ్రీనివాసరావు, డి.ఎస్.పిలు T. శ్రీనివాసరావు, B సీతారామయ్య మరికొందరికి బ్రాంచ్ డిస్క్‌లకు ఎంపికయ్యారు.

News March 28, 2024

చిత్తూరు: హైవేపై రోడ్డు ప్రమాదం

image

తవణంపల్లి మండలం, K పట్నం 140 జాతీయ రహదారిపై గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళుతున్న లారీని వెనక నుంచి కారు ఢీకొనడంతో కారులో ఉన్న ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. వేగం కంట్రోల్ కాక లారీని కారు ఢీకొన్నట్లు స్థానికులు చెబుతున్నారు. గాయపడిన వ్యక్తి బెంగళూరుకు చెందిన మహేశ్‌గా గుర్తించి వెంటనే చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

News March 28, 2024

ధర్మవరంలో ఊపందుకోనున్న ప్రచారం

image

ఎట్టకేలకు ధర్మవరం టికెట్ పొత్తులో భాగంగా బీజేపీకి దక్కడంతో ఇక ఎన్నికల ప్రచారం ఊపందుకోనుంది. వైసీపీ నుంచి కేతిరెడ్డి పోటీచేస్తుండగా.. బీజేపీ నుంచి ఆ పార్టీ కీలక నేత వై.సత్యకుమార్ బరిలో ఉన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన సత్యకు.. వరదాపురం సూరి, పరిటాల కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉండటం బీజేపీకి ఇక్కడ కలిసొచ్చే అంశమని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

error: Content is protected !!