Andhra Pradesh

News March 28, 2024

కర్నూలు: ‘క్షేత్ర స్థాయిలో కోడ్ ఉల్లంఘనల నివేదికలపై కలెక్టర్ అసంతృప్తి’

image

ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై మరింత ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన సంబంధిత అధికారులను టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. బుధవారం ఎన్నికల అంశాలపై ఆర్వోలు, మునిసిపల్ కమిషనర్‌లు, తహశీల్దార్లు, ఎంపిడిఓలతో కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో కోడ్ ఉల్లంఘనలకు సంబంధించిన నివేదికలపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

News March 28, 2024

ప్రొద్దుటూరు: ‘చంద్రబాబు మేనిఫెస్టోను ప్రజలు నమ్మవద్దు’

image

రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు విడుదల చేసే మేనిఫెస్టోను ప్రజలు ఎవరు నమ్మవద్దని సీఎం జగన్ కోరారు. సిద్ధం సభలో సీఎం ప్రసంగిస్తూ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే వ్యక్తి చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. తమ పార్టీ చెప్పిన మేనిఫెస్టోను 99% నెరవేర్చినట్లు సీఎం పేర్కొన్నారు. మేనిఫెస్టోను రాజకీయ పార్టీలు పవిత్రమైన గ్రంథంగా భావించాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో 175కు 175 సాధించడానికి మేము సిద్ధం అని పేర్కొన్నారు.

News March 28, 2024

నంద్యాల:  ట్రాఫిక్ అంతరాయం కలగకుండా డైవర్షన్ పాయింట్లు

image

సీఎం జగన్ గురువారం నంద్యాల జిల్లాలో పర్యటించనున్న సందర్భంగా ప్రజలకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసులు డైవర్షన్ పాయింట్లు ఏర్పాటు చేశారు. వెంకటేశ్వరపురం నుంచి వచ్చే వాహనాలు టౌన్‌లోకి అనుమతించకుండా  హైవే మీదుగా డైవర్షన్ చేయాలన్నారు. చామకాలువ నుంచి ఫ్లైఓవర్ మీదుగా బొమ్మల సత్రం, క్రాంతి నగర్‌లకు వెళ్లే వాహనాలను రైల్వే స్టేషన్ రోడ్డు మీదుగా మళ్లించారు. ఈ విషయాలను గమనించాలని కోరారు.

News March 28, 2024

ఒంగోలు: ‘బ్యాంకులు రుణాలు మంజూరు చేయాలి’

image

వ్యవసాయ అనుబంధ రంగాలతో పాటు ఇతర ప్రాధాన్య రంగాలకు కూడా లక్ష్యాల మేరకు రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ దినేశ్ కుమార్ అన్నారు. బుధవారం ప్రకాశ్ భవన్‌లో జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలలో ఎస్.హెచ్.జి మహిళల జీవనోపాధి మరింత మెరుగుపడేలా రుణాలు మంజూరుకు చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. విద్యా రుణాలు మంజూరు వేగవంతం చేయాలన్నారు.

News March 28, 2024

రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం

image

అనంతపురం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం సాయంత్రం సాధారణ ఎన్నికలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ ఎం. గౌతమి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కమీషన్ ఈ నెల 16వ తేదీన సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ 18వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారని అన్నారు.

News March 28, 2024

పార్వతీపురం: ‘ప్రచారానికి అనుమతులు తప్పనిసరి’

image

ప్రచారానికి అనుమతులు తప్పనిసరని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. బుధవారం రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి ఎన్నికల నిర్వహణకు ముందస్తు చేస్తున్న ఏర్పాట్లును, ఎన్నికల ప్రవర్తనా నియమావళి పటిష్టంగా అమలు తీరును సమీక్షించారు.

News March 28, 2024

కృష్ణా: విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

ట్రాక్ నిర్వహణ మరమ్మతులు జరుగుతున్నందున మచిలీపట్నం- విశాఖపట్నం మధ్య ప్రయాణించే ఎక్స్‌ప్రెస్ ట్రైన్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నెం.17220 విశాఖపట్నం- మచిలీపట్నం ట్రైన్‌ను ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 29 వరకు, నెం.17219 మచిలీపట్నం- విశాఖపట్నం ట్రైన్‌ను ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 28 వరకు రద్దు చేస్తున్నామని రైల్వే శాఖ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.

News March 28, 2024

విశాఖ: ‘ఆర్ఓలు బాధ్యతగా వ్యవహరించాలి’

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఆర్ఓ కూడా తమ విధులను బాధ్యతగా వ్యవహరించాలని ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ అధికారులు, పోస్టల్ బ్యాలెట్ బృందాలతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు చేయాలన్నారు. ప్రవర్తన నియమావళిని అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News March 28, 2024

ఏజెన్సీలను మరింత అప్రమత్తంగా ఉంచాలి: కలెక్టర్

image

ఎలక్షన్ సీజర్ మేనేజ్ మెంట్ ఏజెన్సీలను మరింత అప్రమత్తంగా ఉండి జిల్లా వ్యాప్తంగా నిఘాను మరింత పటిష్ఠ పరచాలని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ఏలూరులో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు తదితరులతో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎంసీసీ అమలు, ఎస్ఎస్‌టీ, ఎఫ్ఎస్‌టి, వీఎస్‌టీ బృందాలు పనితీరు అంశాలపై కలెక్టర్ చర్చించారు.  

News March 28, 2024

1న నన్నయలో బీఈడీ స్పాట్ అడ్మిషన్స్

image

ఆదికవి నన్నయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో బీఈడీ ప్రవేశాలకు ఏప్రిల్ 1వ తేదీన స్పాట్ అడ్మిషన్స్ నిర్వహిస్తున్నామని రిజిస్ట్రార్ ఆచార్య జి.సుధాకర్ తెలిపారు. బీఈడీ రెండేళ్ల కాలవ్యవధి కోర్సులో ప్రవేశాలకు ఆసక్తి, అర్హత ఉన్నవారు హాజరు కావాలని కోరారు. రెగ్యులర్ సీట్లు 14, ఈడబ్ల్యూఎస్ 5 సీట్లు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. తప్పనిసరిగా ఏపీ ఎడ్‌సెట్-2023 ప్రవేశ పరీక్షకు హాజరై ఉండాలన్నారు.

error: Content is protected !!