India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఆర్ఓ కూడా తమ విధులను బాధ్యతగా వ్యవహరించాలని ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ అధికారులు, పోస్టల్ బ్యాలెట్ బృందాలతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు చేయాలన్నారు. ప్రవర్తన నియమావళిని అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఎలక్షన్ సీజర్ మేనేజ్ మెంట్ ఏజెన్సీలను మరింత అప్రమత్తంగా ఉండి జిల్లా వ్యాప్తంగా నిఘాను మరింత పటిష్ఠ పరచాలని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ఏలూరులో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు తదితరులతో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎంసీసీ అమలు, ఎస్ఎస్‌టీ, ఎఫ్ఎస్‌టి, వీఎస్‌టీ బృందాలు పనితీరు అంశాలపై కలెక్టర్ చర్చించారు.
ఆదికవి నన్నయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో బీఈడీ ప్రవేశాలకు ఏప్రిల్ 1వ తేదీన స్పాట్ అడ్మిషన్స్ నిర్వహిస్తున్నామని రిజిస్ట్రార్ ఆచార్య జి.సుధాకర్ తెలిపారు. బీఈడీ రెండేళ్ల కాలవ్యవధి కోర్సులో ప్రవేశాలకు ఆసక్తి, అర్హత ఉన్నవారు హాజరు కావాలని కోరారు. రెగ్యులర్ సీట్లు 14, ఈడబ్ల్యూఎస్ 5 సీట్లు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. తప్పనిసరిగా ఏపీ ఎడ్‌సెట్-2023 ప్రవేశ పరీక్షకు హాజరై ఉండాలన్నారు.
రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల ప్రచారానికి ఇతర అనుమతుల మంజూరుకు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి అనుమతులు ఇస్తామని జిల్లా ఎన్నికల అధికారి ఢిల్లీరావు తెలియజేశారు. నేడు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అభ్యర్థులు, పార్టీలు నేరుగా లేదా ఆన్‌లైన్లో సువిధ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
విజయవాడలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి నివాసంలో ఆంధ్రప్రదేశ్ ఎన్డీయే కూటమి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చం నాయుడు, జనసేన పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జ్ అరుణ్ సింగ్, పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై చర్చలు కొనసాగినట్లు సమాచారం.
వైసీపీ అధికారికంగా కొనుగోలు చేసిన ప్రచార సామగ్రిపై దుష్ప్రచారం చేయడం తగదని ఆ పార్టీ ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సాధారణ ఎన్నికల నిమిత‍్తం పార్టీకి అవసరమైన సామగ్రిని 2023 అక్టోబర్ నుంచి 2024 మార్చి 14వ తేదీ వరకు వివిధ తేదీల్లో పలు సంస్థల నుంచి జీఎస్‌టీ చెల్లించి మరీ కొనుగోలు చేసినట్లు చెప్పారు.
భారత్, యూఎస్‌ల ఆధ్వర్యంలో టైగర్ ట్రయాంఫ్–2024 సీఫేజ్ విన్యాసాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండో రోజు బుధవారం విశాఖ సముద్ర తీరానికి 40 నాటికల్ మైళ్ల దూరంలో విన్యాసాలు నిర్వహించారు. విపత్తు నిర్వహణ, మానవతా సహాయం పేరుతో రెండో రోజు విన్యాసాలు సాగాయి. భారత్‌కు ఐఎన్‌ఎస్ జలశ్వా ప్రాతినిధ్యం వహించగా, యూఎస్‌కు యూఎస్‌ఎస్ సోమర్‌సెట్, యూఎస్‌ఎస్ హాల్‌సే యుద్ధ నౌకలు పాల్గొన్నాయి.
అనంతపురం పట్టణానికి చెందిన అంజలి మృతిపై ముగ్గురిని అరెస్టు చేసినట్టు అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ.. అంజలి మృతి ఘటనలో ఆమె భర్త రాజు, బెల్దరి దస్తగిరి, బాలును అరెస్టు చేశామన్నారు. మృతురాలి కుటుంబీకులు వాంగ్మూలం ప్రకారం భర్తతో పాటు మరో ఇద్దరిపై విచారణ జరిపి కేసు నమోదు చేశామన్నారు.
ఎచ్చెర్ల నియోజకవర్గంలో మిత్ర పక్షాల ఎమ్మెల్యే అభ్యర్థిగా బీజేపీ నుంచి ఎన్. ఈశ్వరావును అధిష్ఠానం బుధవారం రాత్రి నిర్ణయించింది. వీరి స్వగ్రామం రణస్థలం మండలం బంటుపల్లి పంచాయితీ నడుకుదిటిపాలెం. అతని తండ్రి నడుకుదిటి అప్పలకొండ 1982 నుంచి టీడీపీలో ఉన్నారు. ఎన్. ఈశ్వరావు MBA, MCOM పూర్తి చేశారు. ఈయన విజయనగరం జిల్లా బీజేపీ అధ్యక్షులుగా పని చేస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
బనగానపల్లె మండలంలోని కైప అప్పలాపురం గ్రామాల మధ్య ఆటో బోల్తాపడి ఒక వ్యక్తి మృతి చెందిన విషాదకర ఘటన బుధవారం జరిగింది. టంగుటూరు గ్రామానికి చెందిన బాల చౌడయ్య(60) ఆటోలో స్వగ్రామానికి వెళుతుండగా ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడింది. దీంతో బాల చౌడయ్య మృతిచెందగా మరో ఇద్దరికి గాయాలైనట్లు స్థానికులు వెల్లడించారు. బనగానపల్లె పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.