Andhra Pradesh

News March 27, 2024

ప్రకాశం: PHOTO OF THE DAY

image

ఎండాకాలం ప్రారంభమైన నేపథ్యంలో భానుడి ప్రతాపానికి మనుషులతో పాటు పశువులు, పక్షులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. ఇందుకు ఈ ఫొటోనే నిదర్శనం. ఏల్చూరులోని ఓ ప్రధాన రహదారి పక్కనే ఉన్న చేతిపంపు నుంచి జాలువారుతున్న నీటి బిందువులను ఓ కాకి గొంతు తడుపుకుటుంది. ఈ దృశ్యాన్ని ఓ వ్యక్తి కెమెరాలో బంధించాడు. అలాగే పశువుల నీరు కోసం చేతిపంపు, బోర్లు వద్ద, ఇళ్లపైన తొట్టెలు నిర్మించాలని పలువురు కోరుతున్నారు.

News March 27, 2024

విజయవాడ: కలెక్టర్, ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స‌చివాల‌యం నుంచి బుధవారం రాష్ట్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి ముకేశ్ కుమార్ మీనా అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు, జిల్లాల ఎన్నిక‌ల అధికారుల‌తో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి స‌మ‌ర్థ‌వంతంగా అమ‌లుచేస్తున్నామ‌ని సీ విజిల్ ద్వారా వ‌చ్చే ఫిర్యాదుల‌ను క్షుణ్నంగా ప‌రిశీలించి స‌త్వ‌ర ప‌రిష్కారానికి కృషిచేస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ డిల్లీరావు అన్నారు.

News March 27, 2024

గూడూరు-వెంకటగిరి రోడ్డుపై ప్రమాదం 

image

గూడూరు-వెంకటగిరి రోడ్డుపై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. వెంకటగిరి నుంచి గూడూరు వైపు వస్తున్న కారు.. ఎదురుగా వచ్చిన బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.    

News March 27, 2024

చేనేతలకు 500 యూనిట్ల కరెంట్ ఫ్రీ: CBN

image

పుత్తూరు ప్రజాగళం సభలో చంద్రబాబు(CBN) కీలక ప్రకటన చేశారు. ‘నగరి ఎమ్మెల్యేగా పదేళ్లు ఉన్నా జబర్దస్త్ రోజా ఏం చేయలేదు. నియోజకవర్గాన్ని అన్ని విధాలా దోచుకున్నారు. గతంలో పవర్‌లూమ్ చేనేత కార్మికులకు విద్యుత్తు ఛార్జీలో సబ్సీడీ ఇచ్చి ఆదుకుంది మేమే. ఈసారి గెలిచిన వెంటనే 500 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ అందిస్తాం. నేటం షుగర్ ఫ్యాక్టరీ పరిధిలోని రైతులకు బకాయిలు చెల్లిస్తాం’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.

News March 27, 2024

శ్రీకాకుళం: EVMల భ‌ద్ర‌త‌ను స‌మీక్షించిన‌ క‌లెక్ట‌ర్‌

image

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఈవీఎం గోదాముల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ మనజీర్ జిలాని సమూన్, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలసి బుధవారం త‌నిఖీ చేశారు. త్రైమాసిక తనిఖీలలో భాగంగా అక్క‌డి భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌పై స‌మీక్షించారు. గోదాముల‌ను తెరిపించి, నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ఏర్పాటు చేసిన బ్లాకులను, ఈవీఎంల‌ను ప‌రిశీలించారు.

News March 27, 2024

చంద్రబాబు భయపడ్డాడు: చిత్తూరు ఎంపీ

image

చంద్రబాబు కుప్పం పర్యటనపై చిత్తూరు ఎంపీ రెడ్డప్ప స్పందించారు. ‘భయం అంటే ఏంటో తెలుసా? చంద్రబాబు కుప్పంలో ఒక్కరోజూ ప్రచారం చేయకుండా 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. కానీ ఇప్పుడు ఇంటింటికీ తిరుగుతున్నాడు. కారణం కుప్పంలో జగన్ గారు చేసిన అభివృద్ధి. కుప్పం ప్రజలు ఈసారి వైసీపీకి పట్టం కట్టడానికి సిద్ధమయ్యారు అనే నిజానికి చంద్రబాబు భయపడ్డాడు’ అని ఆయన ట్వీట్ చేశారు.

News March 27, 2024

క్రోసూరు: గుండెపోటుతో పదో తరగతి విద్యార్థిని మృతి

image

గుండెపోటుతో పదో తరగతి విద్యార్థిని చిలకా చిన్నారి (15) మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. క్రోసూరు మండలం నాగవరాని చెందిన విద్యార్థిని స్థానిక హైస్కూల్‌లో చదువుతూ బృగుబండలో పది పరీక్షలు రాస్తోంది. బుధవారం సైన్సు పరీక్షకు హాజరై ఇంటికి రాగానే అస్వస్థతకు గురైంది. వెంటనే చికిత్స కోసం సత్తెనపల్లి తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో చనిపోయింది. విద్యార్థినికి కొన్నాళ్లుగా గుండె సమస్య ఉన్నట్లు సమాచారం. 

News March 27, 2024

పలాసకు చెందిన ఆర్మీ జవాన్ ఆత్మహత్య

image

పలాస మండలం మోదుగులపుట్టి గ్రామానికి చెందిన మద్దిల జోగారావు (40), జమ్మూకశ్మీర్‌ ఉదంపూర్‌లోని యూనిట్‌లో జేసీఓ క్యాడర్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం రాత్రి విధి నిర్వహణలో ఉండగా ఆత్మహత్య చేసుకున్నట్లు మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. జమ్మూకశ్మీర్‌ నుంచి ఈ రోజు సాయంత్రానికి మృతదేహం స్వగ్రామానికి తీసుకొస్తున్నట్లు సమాచారం.

News March 27, 2024

నెల్లూరు MP అభ్యర్థిగా భాస్కర్ గౌడ్ పోటీ

image

రాష్ట్రంలోని ఐదు పార్లమెంటు స్థానాలకు BSP అధిష్ఠానం తమ అభ్యర్థులను ప్రకటించింది. అందులో నెల్లూరు MP అభ్యర్థిగా గూడూరుకు చెందిన బీఎస్పీ నాయకుడు భాస్కర్ గౌడ్‌ను, గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా మల్లికార్జున్‌ను ఎంపిక చేసింది. 50 అసెంబ్లీ స్థానాలకు BSP  తన అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. 

News March 27, 2024

ఎర్రగుంట్ల: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

image

ఎర్రగుంట్ల వద్ద రైలు కింద పడి బుధవారం ఒక వ్యక్తి మృతి చెందాడు. ఎర్రగుంట్ల మండల పరిధిలోని కదిరివారిపల్లెకు చెందిన రామచంద్రారెడ్డి అనే వ్యక్తి కుటుంబ సమస్యల నేపథ్యంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని శరీరం రెండు ముక్కలుగా విడిపోయింది. మృతుడు పట్టణంలోని మహాత్మా గాంధీ నగర్‌ వాసిగా పోలీసులు గుర్తించారు.

error: Content is protected !!