Andhra Pradesh

News October 3, 2024

TPT: ఇలా ఓ మంచి పని చేద్దామా..?

image

తిరుపతిలోని రుయా, స్విమ్స్ ఆసుపత్రులకు రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు నుంచి ఎంతో మంది పేదలు వస్తుంటారు. ఇందులో చాలా మంది చదువు రాని వాళ్లే ఉంటారు. వీళ్లంతా ఓపీ తీసుకోవడంతో పాటు ఆయా ఆసుపత్రుల్లో ఏ విభాగానికి ఎటు వెళ్లాలో తెలియక చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఆసుపత్రి, ఓపీ గురించి మీకు తెలిసి ఉంటే.. ఇలా ఇబ్బంది పడుతూ మీకు ఎదురు పడిన వాళ్లకు సాయపడితే ఇతరులకు ఆదర్శంగా ఉంటుంది.

News October 3, 2024

నంద్యాల జిల్లాలో మహిళ హత్య

image

నంద్యాల జిల్లాలో మరో దారుణ హత్య జరిగింది. కొలిమిగుండ్ల మండలం కనకాద్రిపల్లిలో ఓ భర్త భార్యను కిరాతకంగా చంపాడు. భార్యపై అనుమానంతో గొడ్డలితో నరికి చంపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News October 3, 2024

ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే.!

image

ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. మధ్యాహ్న 12 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి సచివాలయానికి వెళతారు. అనంతరం అక్కడ జీఎస్‌డీపీ వృద్ధిపై సమీక్ష చేస్తారు. సాయంత్రం ఐ అండ్ పీఆర్ శాఖపై, ఆ తర్వాత నెలవారీ గ్రీవెన్స్‌ల పరిష్కారంపై రివ్యూ చేస్తారని చెప్పారు.

News October 3, 2024

విజయవాడ దుర్గమ్మ బంగారు కిరీటాన్ని చూశారా

image

విజయవాడ కనకదుర్గమ్మకు ఒక అజ్ఞాత భక్తుడు ఇటీవల బంగారు కిరీటాన్ని అందజేశారు. రూ.2.5 కోట్లతో బంగారం, వజ్రాలతో తయారు చేసిన ఈ కిరీటాన్ని గురువారం కనకదుర్గమ్మ వారికి అర్చకులు అలంకరించారు. బాలా త్రిపుర సుందరి దేవిగా నేడు అలంకరించిన కనకదుర్గమ్మ అమ్మవారు ఈ కిరీటంతో భక్తులకు దర్శనమిస్తారని ఆలయ అర్చకులు చెప్పారు.

News October 3, 2024

విజయవాడ దుర్గమ్మ బంగారు కిరీటాన్ని చూశారా

image

విజయవాడ కనకదుర్గమ్మకు ఒక అజ్ఞాత భక్తుడు ఇటీవల బంగారు కిరీటాన్ని అందజేశారు. రూ.2.5 కోట్లతో బంగారం, వజ్రాలతో తయారు చేసిన ఈ కిరీటాన్ని గురువారం కనకదుర్గమ్మ వారికి అర్చకులు అలంకరించారు. బాలా త్రిపుర సుందరి దేవిగా నేడు అలంకరించిన కనకదుర్గమ్మ అమ్మవారు ఈ కిరీటంతో భక్తులకు దర్శనమిస్తారని ఆలయ అర్చకులు చెప్పారు.

News October 3, 2024

నీ ఢిల్లీ గుట్టు నేను విప్పుతా: కేతిరెడ్డి

image

తననకు ఉద్దేశించి ‘కాస్త ఓపిక పట్టు.. నీ గుట్టు విప్పుతా’ అని మంత్రి సత్యకుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలకు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘మాయల మరాఠీ.. నీ దౌర్జన్యాలతో ధర్మవరంలో చింద్రమైన చేనేత, రైతు, కార్మికుల బతుకులకు.. నీ పదవికి న్యాయం చేయు. తర్వాత మన లెక్కలు తేల్చుకుందాం. ఏమీలేని నా గుట్టు విప్పుదువులే. అక్రమాలతో కూడిన 20ఏళ్ల నీ ఢిల్లీ గుట్టు నేను విప్పుతా’ అని కేతిరెడ్డి ట్వీట్ చేశారు.

News October 3, 2024

17 గ్రామాలలో అభివృద్ధి పనులు చేస్తాం: కలెక్టర్

image

పీఎం జనజాతీయ ఉన్నత గ్రామఅభియాన్(పీఎం జుగా) పథకంలో ఎన్టీఆర్ జిల్లాలోని 5 మండలాల్లో ఉన్న 17 గ్రామాలలో అభివృద్ధి పనులు చేస్తామని కలెక్టర్ జి.సృజన తెలిపారు. ఈ గ్రామాలలో గిరిజన జనాభా ఎక్కువ ఉన్నందున ఈ పథకం అమలవుతుందని ఆమె తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ పథకంలో స్వయం ఉపాధి కల్పన, నైపుణ్య శిక్షణ, విద్యా, మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు చేస్తామన్నారు.

News October 3, 2024

శ్రీగిరిలో నేటి నుంచి దసరా ఉత్సవాలు

image

శ్రీశైల క్షేత్రంలో దసరా నవరాత్రి మహోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నేడు శైలపుత్రి అలంకారంలో భ్రమరాంబాదేవి అమ్మవారు దర్శనమిస్తారు. శరన్నవరాత్రులలో స్వామివారికి అభిషేకాలు, అమ్మవారి కుంకుమార్చనలు మినహా మిగిలిన ఆర్జిత సేవలను తాత్కాలికంగా రద్దు చేశారు. వాహనసేవలను సామాన్య భక్తులు వీక్షించేలా ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు. వాహన సేవలు, గ్రామోత్సవం, తెప్పోత్సవాలను భక్తులు <>శ్రీశైలటీవీ<<>> ద్వారా లైవ్ చూడొచ్చు.

News October 3, 2024

రోజా గారూ.. అప్పుడు ఏమైంది: వాసంశెట్టి

image

అక్కినేని కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మాజీ మంత్రి రోజా ట్వీట్ చేయగా..దీనికి కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ కౌంటర్ ఇచ్చారు. ‘రోజా గారూ మీరు మంచి మనసుతో ఇలా స్పందించడం చాలా ఆనందం. కానీ ఆరోజు రాజకీయాలకు సంబంధంలేని లోకేశ్ తల్లి భువనేశ్వరిని నిండు సభలో YCP నేతలు అవమానించినప్పుడు పకపక నవ్వారు కదా అప్పుడు ఏమైంది మీ స్పందన?’అని వాసంశెట్టి ట్వీట్ చేశారు.

News October 3, 2024

సాలూరు- విశాఖ వయా బొబ్బిలి.. రేపే ట్రైల్ రన్

image

కొన్నేళ్ల నుంచి ట్రైన్ సాలూరు వస్తుందని ఎదురు చూస్తున్న ప్రజలకు శుక్రవారం ట్రైల్ రన్ నిర్వహిస్తున్నట్లుగా తెలియ వచ్చింది. రేపు ఉదయం 10 గంటలకు విశాఖపట్నంలో ప్రారంభమై 12.30కు బొబ్బిలి 1.10 కి సాలూరు చేరుకుని తిరుగు ప్రయాణమై సాయంత్రం 4.30 గంటలకు విశాఖపట్నం చేరుకోనున్నట్లు తెలుస్తోంది. దీని కోసం రైల్వే అధికారులు తగు ఏర్పాట్లు చేస్తున్నారు.