Andhra Pradesh

News March 27, 2024

కాకినాడ- ఉప్పాడ బీచ్‌ రోడ్డు మూసివేత

image

కాకినాడ సముద్రతీరంలో నావికాదళ విన్యాసాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో మంగళవారం నుంచి ఈ నెల 29 వరకు కాకినాడ- ఉప్పాడ బీచ్‌ రోడ్డును మూసివేస్తున్నట్లు గ్రామీణ సీఐ శ్రీనివాస్‌ తెలిపారు. వాహనాలను తిమ్మాపురం అచ్చంపేట కూడలి నుంచి పిఠాపురం మళ్లిస్తున్నామని.. వాహనదారులు, గ్రామస్థులు సహకరించాలని ఈ సందర్భంగా తెలిపారు.

News March 27, 2024

కృష్ణా : ఈ నెల 30తో ముగియనున్న ధాన్యం కొనుగోళ్ల గడువు

image

ఈ నెల 30వ తేదీతో ఖరీఫ్ ధాన్యం సేకరణ గడువు ముగుస్తుందని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 55,562 మంది రైతుల నుండి 1070.07కోట్లు విలువ గల 4,88,590 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా సేకరించినట్లు చెప్పారు. ధాన్యం సేకరణ గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఇంకనూ ధాన్యం విక్రయించని రైతులు వెంటనే రైతు భరోసా కేంద్రాల ద్వారా విక్రయించుకోవాలన్నారు.

News March 27, 2024

ఆమదాలవలస: అత్యధిక మెజారిటీ సాధించిన ఘనత ఆమెదే..!

image

ఆమదాలవలసలో 1978 నుంచి 11 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ నియోజకవర్గంలో జరిగిన అన్ని ఎన్నికలలో కంటే 2009లో బొడ్డే పల్లి సత్యవతి ఐ.కాంగ్రెస్ నుంచి ప్రజారాజ్యం అభ్యర్థి తమ్మినేని సీతారాంపై16,209 ఓట్ల అత్యధిక మెజార్టీతో విజయ కేతనం ఎగురవేశారు. 2024 ఎన్నికలకు ఇక్కడ YCP నుంచి తమ్మినేని సీతారాం, TDP నుంచి కూన రవికుమార్ బరిలో ఉన్నారు. ఈసారి వీరు ఆ మెజార్టీని దాటగలరని మీరు అనుకుంటున్నారా..కామెంట్ చేయండి

News March 27, 2024

నెల్లూరు: కరోనా నాటు మందు సృష్టికర్త ఆనందయ్య టీడీపీలో చేరిక

image

ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో కరోనా నాటు మందు సృష్టికర్త బోనిగి ఆనందయ్య మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనతోపాటు అతని అనుచరులు కూడా టీడీపీలో చేరారు. ఆనందయ్య వైసీపీ ఎంపీటీసీగా ఉన్నారు. ఆనందయ్య టీడీపీలో చేరడం చాలా సంతోషంగా ఉందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు.

News March 27, 2024

గాజువాక: నేలబావిలో సెక్యూరిటీ గార్డు మృతదేహం

image

గాజువాక ఆటోనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఆటోనగర్ ఎస్ బ్లాక్‌లో టీపీఎల్ ప్లాస్టిక్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డ్ గణేష్ (31) నేలబావిలో ప్రమాదవశాత్తు పడిపోయి మృతి చెందాడు. ఘటనపై దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News March 27, 2024

ఎన్నికల విధులు నుంచి 431 మందికి మినహాయింపు

image

అనంత: ఎన్నికల విధులు నుంచి 431 మంది ఉద్యోగులకు మినహాయింపునిచ్చారు. విధులు కేటాయించిన ఉద్యోగుల్లో గర్భిణులు, బాలింతలు, దివ్యాంగులు, ఆరోగ్య సమస్యలున్న వారికి మినహాయింపునకు అవకాశం కల్పించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. జిల్లాలో ఎన్నికల విధులకు 581 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకోగా.. విచారణకు 372 మంది గైర్హాజయ్యారు. హాజరైన 209 మందిలో 186 మందికి మినహాయింపు ఇచ్చారు.

News March 27, 2024

తూ.గో.: 30వ తేదీన జనసేనలోకి సీనియర్ నేత

image

తూ.గో. జిల్లా జగ్గంపేట నియోజకవర్గ సీనియర్ రాజకీయ నాయకులు తుమ్మలపల్లి రమేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తుమ్మలపల్లి గతంలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థిగా పలుమార్లు పోటీలో నిలిచారు. కాగా ఈ నెల 30వ తేదీన పిఠాపురంలో పవన్ సమక్షంలో జనసేనలో చేరనున్నట్లు తెలిపారు.

News March 27, 2024

వైసీపీపై నందికొట్కూరు ఎమ్మెల్యే తీవ్ర ఆరోపణలు

image

వైసీపీపై నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ కీలక ఆరోపణలు చేశారు. నంద్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎమ్మెల్యేగా తన హక్కులను ఇతరులకు బదిలీ చేస్తామన్నారు. తనను స్టిక్కర్ ఎమ్మెల్యేగా ఉండమన్నారు. దీంతో గెలిచిన 4 నెలలకే రాజీనామా చేద్దామనే భావన వచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ఉన్న అభిమానంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరా’ అని వెల్లడించారు.

News March 27, 2024

జిల్లాలో సీనియర్ అభ్యర్థి ఆయనే

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రస్తుత ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగుతున్న అభ్యర్థులే ఎక్కువ మంది ఉన్నారు. వీరితో పాటు సీనియర్ నాయకులూ పోటీ పడబోతున్నారు. వీరందరిలో సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి. ఆయన 1983లోనే తొలిసారి నెల్లూరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గాల్లో మంత్రిగా వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో ఆయన ఆత్మకూరు ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు.

News March 27, 2024

ఎచ్చెర్ల సీటు ఎవరి కోసమో..?

image

ఎచ్చెర్ల కూటమి సీటు ఇంకా కేటాయించకపోవడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. 2014లో YCP అభ్యర్థి జి.కిరణ్ కుమార్‌పై,TDP అభ్యర్థి కళావెంకట్రావు గెలుపొందారు. 2019లో కూడా వీరే ప్రత్యర్థులుగా ఉండగా ఈసారి TDPపైYCP జెండా ఎగిరింది. 2024 అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసేందుకు YCP నుంచి గొర్ల కిరణ్ కుమార్‌ను అధిష్ఠానం బరిలో దింపింది. మరి కూటమి నుంచి ఎవరు పోటీ ఇస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

error: Content is protected !!