India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా స్వచ్ఛ ఆంధ్ర ఛైర్‌పర్సన్ పి.దేవసేనమ్మ పేరును అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే వెంకటగిరి సీటును నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పేరు ప్రకటించగా ఆయనపై అసమ్మతి వర్గం దండెత్తడంతో ఆయన పేరు మార్చే యోచనలో అధిష్ఠానం ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు అధిష్ఠానం నుంచి దేవసేనమ్మకు పిలుపు అందినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమె పేరును పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
ఈనెల 31న విశాఖలో జరిగే చెన్నై సూపర్‌కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ టికెట్ల అమ్మకాలు ఈరోజు ఉ.10 గంటల నుంచి పేటీఎం ఇన్‌సైడర్ వెబ్‌సైట్ ద్వారా ప్రారంభం కానున్నాయి. టికెట్ల ధరలు రూ.1,000, రూ.1,500, రూ.2వేలు, రూ.3వేలు, రూ.3,500, రూ.5వేలు, రూ.7,500గా నిర్ణయించారు. ఆన్‌లైన్‌లో మాత్రమే టికెట్ల అమ్మకాలు జరుగుతాయి. రేపు CSK జట్టు, ఎల్లుండి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విశాఖ రానున్నట్లు సమాచారం.
పత్తికొండ మండలం బొందిమడుగుల గ్రామ శివారులో చెత్తకుప్పలో పడేసిన ఓటరు గుర్తింపు కార్డుల ఉదంతంపై బాధ్యుడైన అప్పటి వీఆర్ఎ శ్రీనివాసులను సస్పెండ్ చేసినట్లు పత్తికొండ ఆర్డీవో రామలక్ష్మి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం శ్రీనివాసులు ఆస్పరి తహశీల్దారు కార్యాలయంలో వాచ్‌మెన్ విధులు నిర్వహిస్తున్నారు. విధులు పట్ల నిర్లక్ష్యం వహించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలంలో మంగళవారం అర్ధరాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మండలంలోని సొమాలవాండ్ల పల్లిలో పాపయ్య నాయుడు(48)ను కొండయ్య నాయుడు రాళ్లతో కొట్టి చంపినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా ఇద్దరూ మద్యం మత్తులో గొడవ పడటంతో హత్యకు దారితీసినట్లు పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
జిల్లాలో సమయపాలన పాటించని బార్, రెస్టారెంట్ల యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి అధికారులను అదేశించారు. కోడ్ అమల్లో ఉన్నా తెల్లవారుజాము నుంచే మద్యం విక్రయిస్తుండడంతో ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మార్కాపురం సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రెహమాన్ స్థానిక బార్ నిర్వాహకులతో మంగళవారం సమావేశమయ్యారు. ఉదయం 11 నుంచి రాత్రి 11 వరకు వారిని విక్రయించుకోవాలని సూచించారు.
ప్రొద్దుటూరు పట్టణంలోని టీబి రోడ్డులోని తేజస్విని అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. మూడో సచివాలయం పరిధిలో వాలంటీర్‌గా పనిచేస్తున్న తేజస్వినికి తరచూ ఫిట్స్ వస్తుంటాయి. ఈ క్రమంలో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. మూడో పట్టణ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి అనారోగ్య సమస్యలతోనే తేజస్విని మృతి చెందిందని, దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
తాను పార్టీ మారుతున్నానని వస్తున్న వార్తలపై ఏలూరు టీడీపీ సీనియర్ నాయకులు మాగంటి బాబు స్పందించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ.. గత 24 గంటల నుండి సోషల్ మీడియాలో వస్తున్న తాను పార్టీ మారుతున్నానని వస్తున్న వార్తలు అవాస్తవాలని, వాటిని నమ్మొద్దని చెప్పారు. వ్యక్తిగత పనులపై హైదరాబాదులో ఉన్న కారణంగా క్యాంప్ కార్యాలయంలో అందుబాటు లేనని చెప్పారు. టీడీపీని విడిచిపెట్టే ఆలోచన తనకు లేదన్నారు.
ఉమ్మడి తూ.గో. జిల్లా బాస్కెట్ బాల్ జట్ల ఎంపిక ఈ నెల 31వ తేదీన నిర్వహించనున్నట్లు ఆ సంఘ జిల్లా కార్యదర్శి బొజ్జా మాణిక్యాలరావు తెలిపారు. స్త్రీ, పురుషుల విభాగంలో జట్ల ఎంపిక ఉంటుందన్నారు. అమలాపురం జడ్పీ పాఠశాలలో ఆరోజు ఉదయం 8 గంటల నుంచి ఎంపికలు ప్రారంభమవుతాయన్నారు. అర్హులైన వారు ఆధార్, పుట్టిన తేదీ ధ్రువపత్రాలతో రావాలని ఆయన సూచించారు.
బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్, ఐదుగురు అనుచరులపై ఎన్నికల కోడు ఉల్లంఘన కేసు నమోదు చేసినట్టు ఎస్సై ప్రతాప్ రెడ్డి తెలిపారు. మండల కేంద్రంలో పలమనేరు రోడ్డులో బస్టాండ్ ప్రాంతంలో సమావేశానికి అనుమతి తీసుకుని.. ప్రైవేటు బస్టాండ్‌లో సమావేశం నిర్వహించి కోడ్ ఉల్లంఘించారని ఆయన చెప్పారు. రోడ్డుపై బాణసంచా కాల్చడం, ట్రాఫిక్ ఇబ్బంది కలిగించడం వంటి కారణాలతో కేసు నమోదు చేశామన్నారు.
నెల్లూరు నియోజకవర్గంలో 1989 ఎన్నికల్లో జక్కా కోదండరామి రెడ్డి(జేకే రెడ్డి) సంచలనం సృష్టించారు. అప్పట్లో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగగా ఎన్నికల కమిషన్ ఉదయించే సూర్యుడు గుర్తు కేటాయించింది. ఆ ఎన్నికల్లో ప్రచారాన్ని జేకే రెడ్డి సరికొత్త పుంతలు తొక్కించారు. అందరి మనస్సు చూరగొని తన సమీప ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి తాళ్లపాక రమేష్ రెడ్డిపై 14474 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
Sorry, no posts matched your criteria.