Andhra Pradesh

News March 27, 2024

కమలాపురం నియోజకవర్గంలో TDPకి షాక్

image

కమలాపురం నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం రాష్ట్ర మాజీ కార్యదర్శి కాశీభట్ల సాయినాథ్ శర్మ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కమలాపురం మండలంలోని పెద్దచెప్పలిలో మంగళవారం సాయంత్రం ఆయన తన అభిమానులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దశాబ్దాలుగా టీడీపీలో ఉన్న ఆయన రాజీనామా చేయడంతో ఆ పార్టీకి భారీ షాక్ తగిలింది.

News March 27, 2024

కృష్ణా: వైసీపీలో చేరిన జనసేన కీలక నేత

image

ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన కీలక నేత బత్తిన రాము మంగళవారం వైసీపీలో జాయిన్ అయ్యారు. ఈయన బత్తిన ట్రాన్స్‌ఫోర్ట్ అధినేత. గతంలో ఈయన ప్రజారాజ్యం తరఫున గన్నవరం నియోజవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. జనసేన నుంచి గత ఎన్నికల్లో పోటీ‌చేసి ఓటమి చెందారు. నిన్న ఆయన కేశినేని నానితో సీఎం జగన్‌ను కలిసి వైసీపీలో చేరారు.

News March 27, 2024

టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శిగా ధర్మవరం సుబ్బారెడ్డి

image

డోన్ టికెట్ ఆశించి భంగపాటుకు గురైన ధర్మవరం సుబ్బారెడ్డికి అధిష్ఠానం కీలక పదవి అప్పగించింది. రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డోన్ ఇన్‌ఛార్జ్‌గా పనిచేసి పార్టీ అభివృద్ధి కోసం ధర్మవరం సుబ్బారెడ్డి ఎంతో కృషి చేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు బాధ్యతలను చేపట్టి కార్యకర్తలకు, నాయకులకు అండగా ఉన్న సుబ్బారెడ్డికి పార్టీ ఈ బాధ్యతలు అప్పజెప్పింది.

News March 27, 2024

15 మంది వాలంటీర్లు.. ముగ్గురు మున్సిపల్‌ సిబ్బంది తొలగింపు

image

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన 15 మంది వాలంటీర్లు, ముగ్గురు మున్సిపల్‌ సిబ్బందిని తొలగిస్తూ కలెక్టర్ మంగళవారం ఆదేశాలు జారీచేశారు. వారిలో బొమ్మనహాళ్‌ మండలం డి.హోన్నూరుకు చెందిన వాలంటీర్లు, తాడిపత్రి పురపాలికకు చెందిన ఒప్పంద ఉద్యోగులు రామరాజు, వెంకటరమణ, మధుసూదన్‌రెడ్డి ఉన్నారు. ఇప్పటి వరకు 36 మంది వాలంటీర్లు, ఐదుగురు రేషన్‌డీలర్లు, ఏడుగురు ఒప్పంద ఉద్యోగులు, ఒక రెగ్యులర్‌ ఉద్యోగిని తొలగించారు.

News March 27, 2024

విశాఖ: కారుతో యువతి బీభత్సం..!

image

విశాఖలోని ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో కారుతో ఓ యువతి బీభత్సం సృష్టించింది. మితిమీరన వేగంతో కారు నడిపి మూడు బైక్‌లను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడగా.. స్థానికులు ఆసుపత్రిలో చేర్చారు. డ్రైవింగ్ చేస్తున్న యువతి బీటెక్ థర్డ్ ఇయర్ విద్యార్థినిగా గుర్తించారు. కారులో ఎయిర్ బాగ్స్ ఓపెన్ కావడంతో యువతి స్వల్ప గాయాలతో బయటపడింది. కారు నడిపిన సమయంలో యువతి మద్యం మత్తులో ఉన్నట్లు భావిస్తున్నారు.

News March 27, 2024

తూ.గో.: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా జవహర్‌

image

తూ.గో. జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొత్తపల్లి శామ్యూల్‌ జవహర్‌ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు అధిష్ఠానం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జవహర్‌ నివాసం వద్ద పార్టీ కార్యకర్తలు, అభిమానులు సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ బాధ్యతలు అప్పగించినందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్‌, రాష్ట్రాధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.

News March 27, 2024

గుంటూరు: నియోజకవర్గాలకు ఎలక్షన్ ఇ‌న్‌ఛార్జ్‌ల నియామకం

image

గుంటూరు జిల్లాలోని పలు నియోజకవర్గాలకు ఎలక్షన్ ఇన్‌ఛార్జ్‌లను వైసీపీ అధిష్ఠానం ప్రకటించింది. పొన్నూరు, మంగళగిరి నియోజకవర్గాలకు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. తాడికొండ, ప్రత్తిపాడు, గుంటూరు ఈస్ట్ నియోజకవర్గాలకు ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌ను నియమించింది. సత్తెనపల్లి, చిలకలూరిపేట, వేమూరులకు మోదుగుల వేణుగోపాల్‌ను.. రేపల్లెకు ఎలక్షన్ అబ్జర్వర్‌గా గాదె మధుసూదన్ రెడ్డిని నియమిస్తున్నట్లు ప్రకటించింది.

News March 27, 2024

చిత్తూరు: 14 మంది వాలంటీర్లు రాజీనామా

image

చిత్తూరు జిల్లా వి.కోట మండలం కంబార్లపల్లి పంచాయతీ పరిధిలోని 14 మంది వాలంటీర్లు మంగళవారం రాజీనామా చేశారు. ఎంపీడీవోకు రాజీనామా పత్రాలు సమర్పించారు. తాము రానున్న ఎన్నికల్లో వైసీపీ పలమనేరు ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటే గౌడ విజయం కోసం కృషి చేస్తామని చెప్పారు. సీఎం జగన్ చొరవతో లబ్ధిదారులకు గత ఐదేళ్లుగా సేవలు అందించామని తెలిపారు. ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను గ్రామాల్లో ప్రచారం చేస్తామన్నారు.

News March 27, 2024

భ‌క్తుల‌కు అందుబాటులో పంచాంగం

image

శ్రీక్రోధినామ సంవత్సర పంచాంగాన్ని మంగ‌ళ‌వారం నుంచి టీటీడీ భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచింది. ఏటా లాగానే నూతన తెలుగు సంవత్సరాది పంచాంగాన్ని టీటీడీ ముద్రించింది. తిరుమల, తిరుపతిలోని టీటీడీ పుస్తక విక్రయ కేంద్రాల్లో రూ.75 చెల్లించి భక్తులు వీటిని కొనుగోలు చేయవచ్చు. మిగిలిన ప్రాంతాల్లో త్వ‌ర‌లో టీటీడీ అందుబాటులోనికి తీసుకు రానుంది.

News March 27, 2024

సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలి: SFI

image

విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి హర్ష కోరారు. ఈ మేరకు యూనివర్సిటీ రిజిస్టర్ డాక్టర్ రామచంద్రా రెడ్డికి వినతిపత్రం అందజేశారు. రెండు, నాలుగు సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసి 90 రోజుల తరువాతే పరీక్షలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు నరేంద్ర, చరణ్ తదితరులు ఉన్నారు.

error: Content is protected !!