India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయనగరం జిల్లాలో మొత్తం 129 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. జీవశాస్త్రం పరీక్షలకు మొత్తం 25,287 విద్యార్థులు మంగళవారం హాజరయ్యారు. కాగా 816 మంది గైర్హాజరయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్. ప్రేమ్ కుమార్ తెలిపారు. మాస్ కాపీయింగ్ వంటి పిర్యాదులు ఎక్కడ అందలేదన్నారు. జిల్లా మొత్తం జీవశాస్త్రం పరీక్ష సజావుగా జరిగిందన్నారు. జిల్లా మొత్తం హాజరు 96.87 శాతం నమోదు అయ్యిందన్నారు.
రాజమండ్రి రూరల్ జై భీమ్‌రావ్ భారత్ పార్టీ MLA అభ్యర్థిగా నాంబత్తుల రాజుని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ నియమించినట్లు తెలిపారు. సామాన్యుడికి MLA టికెట్ రావడం పట్ల పలువురు సామాజిక వ్యక్తులు, ఉద్యమ నాయకులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యేగా గెలిచి తీరతానని అన్నారు.
ప.గో. జిల్లా పాలకోడేరు మండలకేంద్రానికి చెందిన పి.దుర్గా సూర్యనారాయణ రాజు అదే గ్రామానికి చెందిన ఓ దివ్యాంగురాలిని (యువతి) నమ్మించి గర్భవతిని చేశాడు. పెళ్లి చేసుకోమని అతడిని కోరగా అతను నిరాకరించినట్లు దివ్యాంగురాలి తల్లి పార్వతి తెలిపింది. పోలీసులకు ఫిర్యాదుచేయగా..సదరు వ్యక్తిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.
తెర్లాం మండలం సుందరాడ గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్న ఉప్పాడ శ్రీకాంత్ ఈరోజు మధ్యాహ్నం భోజనం కోసం తన సొంత ఊరు ఉద్దవోలు వెళుతుండగా మార్గమధ్యంలో గుండెపోటుతో ఒక్కసారి కుప్ప కూలిపోయాడు. వెంటనే దగ్గరలో ఉన్న ఓ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
రైలు నుంచి జారి పడి అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గుర్తు తెలియని యువకుడు(25) మంగళవారం మృతి చెందాడు. శారదానది బ్రిడ్జ్ సమీపంలో సోమవారం రాత్రి సమయంలో విశాఖ నుంచి విజయవాడ వెళ్లే రైల్వే ట్రాక్ సమీపంలో రైలు నుంచి యువకుడు జారి పడిపోయాడు. అటుగా వెళ్లే రైల్వే గ్యాంగ్‌మాన్ సమాచారంతో 108 అంబులెన్సులో ఆస్పత్రికి తర లించారు. చికిత్స పొందుతూ మంగళవారం మరణించాడు.
విజయవాడ సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో జనసేన నాయకుడు గంటా నరహరి వైసీపీలో చేరారు. వైసీపీ గెలుపులో తాను కూడా భాగస్వామిని అవుతానని గంటా నరహరి పేర్కొన్నారు. ఇటీవలే ఈయన టీడీపీ నుంచి జనసేనలోకి చేరారు. ఈ కార్యక్రమంలో రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, ఒంగోలు పార్లమెంట్ వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.
శ్రీశైలంలో ఏప్రిల్ 6 నుంచి 10 వరకు ఉగాది మహోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. మహోత్సవాల్లో స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే భక్తులను అనుమతిస్తామని పేర్కొన్నారు. మంగళవారం కార్యాలయంలో కర్ణాటక, మహారాష్ట్రాలకు చెందిన పాదయాత్ర భక్త బృందాలు, స్వచ్ఛంద సేవాసంస్థల భక్త బృందాలతో రెండవ విడత సమన్వయ సమావేశం నిర్వహించారు. అలంకార దర్శన విషయమై భక్త బృందాలు అవగాహన కల్పించాలన్నారు.
జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న వివిధ రాజకీయ పార్టీల ప్రచారాలకు అనుమతులు తప్పనిసరిగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ మనజిర్ జిలాని సమూన్ వెల్లడించారు. అనుమతులు లేకుండా ప్రచారాలు చేపడితే ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేస్తామన్నారు. జిల్లాలోని రిటర్నింగ్ అధికారులు, ఎంసీసీ అధికారులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఉగాది మహోత్సవాల సందర్భంగా కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన స్వచ్ఛంద సేవకుల సేవలను వినియోగించుకుంటామని ఈఓ పెద్దిరాజు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ స్వచ్ఛంద సేవకులు మార్చి 29వ తేదీ నుంచి ఏప్రియల్ పదో తేదీ వరకు సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛంద సేవకులకు ప్రదేశాల కేటాయింపులో పారదర్శకత కోసం గత ఏడాది లాగే ఈ ఏడాది లాటరీ పద్దతిలో సేవా ప్రదేశాలను కేటాయిస్తామన్నారు.
రామకుప్పం వద్ద హంద్రీనీవా కాలువను చంద్రబాబు పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుప్పానికి నీళ్లు రావడం గ్రాఫిక్స్‌లా ఉందన్నారు. ఉత్తుత్తి ముఖ్యమంత్రి బటన్ నొక్కగానే కనిపించిన నీరు ఇప్పుడు కనబడటం లేదని విమర్శించారు. మరి ఇంత మోసమా అని ప్రశ్నించారు. ఎన్నికల సమయం దగ్గర పడిందని హంద్రీనీవా నీళ్లు ఇచ్చినట్లు షో చేశారని మండిపడ్డారు.
Sorry, no posts matched your criteria.