India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రంజాన్ మాసం సందర్భంగా కదిరిలో ముస్లిం మైనార్టీల కోసం ఏప్రిల్ 1న ఏర్పాటు చేయనున్న ఇఫ్తార్ విందులో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించిన వేదికను పరిశీలించేందుకు సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం సోమవారం కదిరికి విచ్చేశారు. కదిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీఎస్ మక్బూల్ అహ్మద్‌తో కలిసి కదిరి-మదనపల్లి రోడ్‌లోని పీవీఆర్ ఫంక్షన్ హాలును పరిశీలించారు.
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీఎస్పీ తరపున పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థుల రెండో జాబితాను ఆ పార్టీ సోమవారం ప్రకటించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రేమ జ్యోతి అభ్యర్థుల వివరాలను సోమవారం వెల్లడించారు. ఉమ్మడి జిల్లాలో నంద్యాల నుంచి రమణ, నందికొట్కూరు నుంచి లాజర్, ఆళ్లగడ్డ నుంచి అన్నమ్మ, పాణ్యం నుంచి చిన్న మౌలాలి, డోన్ నుంచి రాముడు, ఆలూరు నుంచి రామలింగయ్య పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.
పలాస మండలం కోసంగిపురం జంక్షన్ వద్ద మంగళవారం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న బైక్‌ను ఇసుక లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ వెనుక చక్రాల కింద సోంపేట మండలం జీడీపుట్టుక గ్రామానికి చెందిన చెల్లురి చైతన్య తీవ్ర గాయాలపాలయ్యాడు. పలాస ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా మృతుడు ఇటీవల సీఆర్పీఎఫ్ ట్రైనింగ్ పూర్తి చేశారు. ఘటనపై కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలోని TDP-9, జనసేన-4, BJP-2 స్థానాల్లో పోటీ చేయునున్నట్లు తెలుస్తోంది. అరకు, మాడుగుల, చోడవరం, విశాఖ ఈస్ట్, వెస్ట్, గాజువాక, పాయకరావుపేట, నర్సీపట్నంలో TDP అభ్యర్థులను ప్రకటించగా..భీమిలి కూడా TDPకే ఇవ్వనున్నట్లు సమాచారం. అనకాపల్లి, పెందుర్తి, ఎలమంచిలిలో అభ్యర్థులను ప్రకటించిన జనసేన.. విశాఖ సౌత్ సీటు ఆశిస్తుంది. అటు BJPకి విశాఖ నార్త్, పాడేరు సీట్లు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
సీఎం జగన్ కడప జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం 12 :20 గంటలకు కడప ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అనంతరం హెలికాఫ్టర్ లో బయలుదేరి 12:45కు ఇడుపులపాయకు చేరుకుంటారు. అనంతరం వైఎస్ఆర్ ఘాట్ వద్ద 1:20 వరకు ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొంటారు. 1:30 కు ఇడుపులపాయలో బయలుదేరి వేంపల్లి, వీఎన్ పల్లె, ఎర్రగుంట్ల మీదుగా రోడ్ షో నిర్వహిస్తూ ప్రొద్దుటూరుకు చేరుకుంటారు. అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.
చంద్రబాబు ప్రకాశం జిల్లా పర్యటన షెడ్యూల్‌లో మార్పు జరిగింది. తొలుత ఈ నెల 31న మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలు నియోజకవర్గాలలో ప్రజాగళం పేరుతో పర్యటించనున్నారని ప్రకటించగా ..తాజా షెడ్యూలు ప్రకారం చంద్రబాబు కార్యక్రమం మార్కాపురం వరకే పరిమితం కానుంది. ఆ రోజు ఉదయం నెల్లూరు జిల్లా కావలిలో జరిగే సభలో పాల్గొని అనంతరం చంద్రబాబు హెలికాఫ్టర్లో మార్కాపురం చేరుకొని సభలో ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది.
కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రాజకీయ వ్యవహారాలలో ఆమె కుమారుడు డాక్టర్ అర్జున్ రెడ్డి కీలకపాత్ర పోషిస్తున్నారు. నెల్లూరులోనే మకాం వేసి పాత పరిచయాలు, బంధుత్వాలను సమన్వయం చేసుకుంటూ పలువురు నేతలను వైసీపీ నుంచి టీడీపీలోకి తీసుకురావడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచార శంఖారావానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈనెల 30న పిఠాపురంలోని శ్రీపురూహూతిక అమ్మవారిని దర్శించుకుని, ‘వారాహి’కి పూజలు చేసి ప్రచారం మొదలు పెట్టనున్నారు. 3 విడతల్లో పవన్ ప్రచారం సాగనుంది. మొదటి 3 రోజులు పిఠాపురంలోనే ఉండి సమావేశాలు నిర్వహిస్తారు. తర్వాత జనసేన బరిలో ఉన్న ప్రాంతాలకు ప్రచారానికి వెళ్తారు. ఉగాది వేడుకలను సైతం పిఠాపురంలోనే జరుపుకోనున్నారు.
ఇంటి ఆవరణలో పార్కింగ్ చేసిన తన కారును గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని పాలకొల్లుకు చెందిన బీజేపీ నాయకుడు రావూరి సుధ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈనెల 22న రాత్రి 11 గంటల సమయంలో ఇంటి వద్ద కారు పార్కింగ్ చేశామన్నారు. మరుసటిరోజు ఉదయం చూసేసరికి వెనుక భాగంలో అద్దం పూర్తిగా ధ్వంసమై ఉందన్నారు. పార్కింగ్ స్థలంలో వరుసగా కార్లు ఉన్నా తన కారునే టార్గెట్ చేసి ధ్వంసం చేశారన్నారు.
విజయనగరం ఎంపీ అభ్యర్థి ఎంపిక కోసం TDP ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహిస్తుంది. ఈ సర్వేలో మూడు పేర్లను తెరపైకి తీసుకువచ్చారు. సర్వేలో కలిశెట్టి అప్పలనాయుడు, కంది చంద్రశేఖర్, మీసాల గీత అభ్యర్థిత్వాలపై ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. కాగా.. మీసాల గీత విజయనగరం ఎమ్మెల్యే సీటు ఆశించి భంగపడగా.. కలిశెట్టి అప్పలనాయుడు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల అసెంబ్లీ సీటు ఆశిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.