India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
యూకే డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ విశాఖ నగరానికి మంగళవారం వస్తున్నారు. ఆయన హైదరాబాద్ నుంచి విమానంలో ఉదయం 10 గంటల 50 నిమిషాలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. విశాఖలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని స్థానిక అధికారులు తెలిపారు. తిరిగి బుధవారం రాత్రి 8 గంటలకు విమానంలో హైదరాబాద్ వెళతారని అన్నారు.
నరసాపురం MP రఘురామరాజు ఉమ్మడి ప.గో జిల్లాలోనే ఏదైనా స్థానం నుంచి బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నరసాపురం BJP టికెట్ ఆయనకేనని అంతా భావించగా.. శ్రీనివాసవర్మ అనే మరో నేతకు టికెట్ దక్కింది. దీంతో RRRకు ‘పశ్చిమ’లో TDP నుంచి అసెంబ్లీ టికెట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారట. అయితే.. ఇప్పటికే అక్కడ అభ్యర్థులందరూ ఖరారు కాగా.. ఎవరినైనా ఆపి RRRకు టికెట్ ఇస్తే ఎలా ఉంటుందనే దానిపై సమాచారం సేకరిస్తున్నారట.
నరసాపురం MP రఘురామరాజు ఉమ్మడి ప.గో జిల్లాలోనే ఏదైనా స్థానం నుంచి బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నరసాపురం BJP టికెట్ ఆయనకేనని అంతా భావించగా.. శ్రీనివాసవర్మ అనే మరో నేతకు టికెట్ దక్కింది. దీంతో RRRకు ‘పశ్చిమ’లో TDP నుంచి అసెంబ్లీ టికెట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారట. అయితే.. ఇప్పటికే అక్కడ అభ్యర్థులందరూ ఖరారు కాగా.. ఎవరినైనా ఆపి RRRకు టికెట్ ఇస్తే ఎలా ఉంటుందనే దానిపై సమాచారం సేకరిస్తున్నారట.
కురుపాం టీడీపీ అభ్యర్థి జగదీశ్వరి భర్తపై సస్పెన్షన్ అన్యాయమని టీడీపీ, గిరిజన సంఘాల నాయకులు ఎం. భూషణరావు, ఎం. ప్రసాదరావు, కడ్రక కళావతి అన్నారు. టీడీపీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూడలేక రాజకీయ సంబంధం లేని ఉపాధ్యాయుడిపై వైసీపీ కుట్ర చేసిందని ఆరోపించారు. అనధికారికంగా ఐటీడీఏ వసతిగృహాల్లో ఉంటున్న వైసీపీ నాయకులను ఖాళీ చేయించాలని డిమాండు చేశారు.
సాధారణ ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా నిర్వహించడంలో పోలింగ్ అధికారులు, సిబ్బందే అత్యంత కీలకమని గుంటూరు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి అన్నారు. కలెక్టరేట్లోని వీసీ సమావేశ మందిరంలో ఎన్నికల విధులకు సిబ్బంది కేటాయింపు, శిక్షణలకు సంబంధించి సోమవారం అధికారులతో మాట్లాడారు. పోలింగ్ రోజు విధులు నిర్వహించే అధికారులు, ఇతర సిబ్బందికి సంబంధించి రాండమైజేషన్ చేపట్టాల్సి ఉందన్నారు.
ఆదోని మండలం సంతేకుడ్లూరులో సోమవారం హోలీ సంబరాలు ఉత్సాహంగా సాగాయి. రతీ, మన్మథుల ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలోని యువకులు, పురుషులు మహిళల వేషధారణలో ముస్తాబై ఆలయానికి వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు. ఐదు రోజులు సాగే సంబరాలకు గ్రామస్థులు ఎక్కడ ఉన్నా ఇక్కడికి చేరుకుంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చిన రతీ, మన్మథులను దర్శించుకున్నారు.
ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకుడు రామిరెడ్డి మరణించిన సందర్భంగా.. ఈరోజు (మంగళవారం) ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె.పుల్లారెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, విద్యార్థులు సహకరించాలని కోరారు.
విశాఖ బీచ్ రోడ్డులోని గుడ్లవానిపాలెం అమ్మవార్ల ఆలయాల ప్రాంతంలో ఓ కణుజు సోమవారం సంచరించింది. చెంగు చెంగున గంతులేస్తూ కొంత సమయం పాటు రహదారిపై అటూ ఇటూ తిరిగి సమీప జూపార్కు జాజాల గుమ్ము వైపు ముళ్ల పొదల్లోకి వెళ్లిపోయింది. ప్రయాణికులు ఆసక్తిగా ఈ దృశ్యాన్ని వీక్షించారు. అటవీ ప్రాంతంలో ఉండాల్సిన ఇలాంటి మూగ జీవాలు గత కొంతకాలంగా తరచూ బయటకొచ్చి ప్రమాదానికి గురవుతున్నాయి.
ప్రముఖ సినీ నటుడు చిరంజీవి కుమారుడు రామ్ చరణ్‌తో కలిసి మంగళవారం తిరుమలకు రానున్నారు. స్పెషల్ ఫ్లైట్‌లో సాయంత్రం నాలుగు గంటలకు విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా తిరుమలకు చేరి రాత్రి బస చేయనున్నారు. బుధవారం రామ్ చరణ్ జన్మదిన సందర్భంగా శ్రీవారిని దర్శించుకోనున్నారు. విమానాశ్రయానికి అభిమానులు చేరుకోవాలని చిరంజీవి అభిమాన సంఘం నాయకుడు ప్రభాకర్ కోరారు.
ఆమదాలవలస నుంచి శ్రీకాకుళం వెళ్లే ప్రధాన రహదారి విస్తరణ పనులు పూర్తిస్థాయిలో జరగకపోవడంతో గోతుల రహదారిలోనే ప్రయాణించాల్సి వస్తుందని పలువురు వాహనదారులు వాపోతున్నారు. తాజాగా సోమవారం రాత్రి గోతిలో దిగబడిన ఆటో ముందు చక్రం విరిగిపడింది. అయితే ఆ సమయంలో వెనుక నుంచి వస్తున్న లారీ డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పిందని ఆటో డ్రైవర్ లక్ష్మీనారాయణ తెలిపారు. రహదారిని బాగు చేయాలని కోరారు.
Sorry, no posts matched your criteria.