India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కుప్పంలో చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం కుప్పం పట్టణంలో ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. బాబు నగర్ వద్దనున్న మసీదులో చంద్రబాబు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
భారత్, యూఎస్ మధ్య రక్షణ బంధం మరింత బలోపేతానికి నిర్వహిస్తున్న టైగర్ ట్రయాంఫ్–2024లో భాగంగా మంగళవారం నుంచి సీ ఫేజ్ విన్యాసాలు ప్రారంభంకానున్నాయి. ఈఎన్‌సీ ప్రధాన కేంద్రంలో ఈ నెల 18 నుంచి 25 వరకు హార్బర్ ఫేజ్ విన్యాసాలు జరగాయి. మంగళవారం నుంచి ఈ నెల 31 వరకు భారత్, యూఎస్ దేశాలకు చెందిన త్రివిధ దళాలు సీ ఫేజ్ విన్యాసాలు చేయనున్నాయి.
జిల్లాలో మెడికల్ అసెస్మెంట్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి జి. పగడాలమ్మ తెలిపారు. మన్యం జిల్లా సమగ్ర శిక్ష వారి ఆధ్వర్యంలో 3 సం. నుంచి 18 సం. గల దివ్యాంగ విద్యార్థులకు వైకల్యం నిర్ధారించుటకు నిపుణుల వైద్యుల పర్యవేక్షణలో మెడికల్ అసెస్మెంట్ క్యాంప్స్ నిర్వహిస్తున్నామన్నారు. వైకల్య నిర్ధారణ పరీక్షల అనంతరం వారికీ అవసరమగు ఉపకరణాలు అందజేస్తామని తెలిపారు.
ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న శ్రీశైలం క్షేత్రం సోమవారం భక్తజనంతో పోటెత్తింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన వేలాది సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఆలయానికి వచ్చిన భక్తులు శ్రీ భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు చేపట్టారు. సాధారణ, శీఘ్ర, అతి శీఘ్ర దర్శనం క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి.
కదిరి పట్టణంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో స్వామివారి బ్రహ్మోత్సవాల అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజు శేష వాహనంపై స్వామి వారిని ఊరేగింపు నిర్వహించారు. ఆలయంలో అర్చకులు విశేష పూజలు నిర్వహించి ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం మాడవీధుల్లో ఊరేగింపు చేశారు. ఊరేగింపు సందర్భంగా భక్తులు పూజలు చెల్లించుకున్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని డ్రగ్స్ మాఫియా కేంద్రంగా మార్చేశారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల్ రాయుడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా కిల్లీ కొట్టులో కూడా గంజాయి, డ్రగ్స్ దొరుకుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం విక్రయించే నాసిరకం మద్యం తాగడంతో పలువురు పేదలు కూడా మరణించారని విమర్శించారు.
రెట్టింపు లాభాలకు ఆశపడి, అపరిచిత వ్యక్తులు చెప్పింది నమ్మి, మోసపూరిత వెబ్ సైట్ లేదా యాప్‌లో డబ్బులు పెట్టుబడి పెట్టి మోసపోవద్దని విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం హెచ్చరికలు జారీ చేశారు. సైబర్ నేరాల పట్ల అవగాహనతో, అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కి కాల్ చేయాలనీ లేదా జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ https://cybercrime.gov.in/ ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు.
ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు సెంటిమెంట్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. అయినవిల్లి వరసిద్ధి వినాయకుని దర్శనంతో అభ్యర్థులు ప్రచారానికి శ్రీకారం చుడతారు. ప్రచారం, నామినేషన్ల దాఖలు ఇలా ఎన్నికలకు సంబంధించిన ప్రతి అంశంలో వినాయకుని ఆశీస్సులు తీసుకుంటారు. ప్రస్తుత ఎన్నికల్లో కూడా అభ్యర్థులు అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. మరి అయినవిల్లి సెంటిమెంట్ ఎవరిని అందలం ఎక్కిస్తుందో.. వేచి చూడాలి.
అద్దంకి మండలంలోని సింగరకొండ పుణ్యక్షేత్రం వార్షిక తిరునాళ్ల సోమవారం అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం నుంచి ప్రసన్నాంజనేయ స్వామి, కొండమీద ఉన్న లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఎన్నికల కోడ్ వల్ల రాజకీయ పార్టీల నేతలు ప్రభలు కట్టనప్పటికీ ఆలయం తరఫున ఒక ప్రభను ఏర్పాటు చేశారు. రాత్రికి విద్యుత్ దీపకాంతులతో సింగరకొండ పుణ్యక్షేత్రం ధగధగలాడుతోంది.
గుంటూరు మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో సోమవారం రాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. రెండు బైకులు ఎదురెదురుగా ఢీ కొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో వెంటనే ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు. అనంతరం క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని క్షతగాత్రుల వివరాలు తెలియాల్సిఉందని పోలీసులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.